Header Ads

క‌ల‌లు ఫ‌లించేనా..పెద్ద‌న్న క‌రుణించేనా

ప్ర‌తి ఇండియ‌న్ తీర‌ని క‌ల అమెరికా. డాల‌ర్ డ్రీమ‌ర్స్ రోజు రోజుకు పెరిగాయి. ప్ర‌పంచీక‌ర‌ణ పుణ్య‌మా అంటూ లెక్క‌లేన‌న్ని అవ‌కాశాలు ప్ర‌పంచ వ్యాప్తంగా పెరిగాయి. ఐటీ వెలిగిపోతోంది. దీంతో ల‌క్ష‌లాది కొలువుల‌కు మార్గం ఏర్ప‌డింది. యుఎస్ ఏతో పాటు ఇంగ్లండ్‌, ఫ్రాన్స్‌, న్యూజిలాండ్‌, ద‌క్షిణాఫ్రికా , శ్రీ‌లంక త‌దిత‌ర కంట్రీస్ అన్నీ ద్వారాలు తెరిచాయి. ప్ర‌తి రోజు వంద‌లాది మంది యుఎస్ వైపు ప్ర‌యాణం చేస్తున్నారు. ఇన్మ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ రంగంలో ఊహించ‌ని రీతిలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఐటీ రంగానికి ప్ర‌త్యేకంగా శాఖ‌ల‌ను కేటాయించి, ఆంట్ర‌ప్రెన్యూర్‌లుగా, వ్యాపార వేత్త‌లుగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు వెన్నుద‌న్నుగా నిలిచాయి. .వ్యాపార‌, వాణిజ్య రంగాల‌లో త‌మ‌దైన ముద్ర వేసేందుకు ఉత్సుక‌త చూపిస్తున్నారు.భార‌త దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఇండియాలో ఎక్క‌డికి వెళ్లినా..ప్ర‌పంచంలో ఏ దేశాన్ని ప‌ర్య‌టించినా అక్క‌డంతా ఐటీ జ‌పం చేశారు. సోష‌ల్ మీడియా, డిజిట‌లైజేష‌న్‌, స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్‌, డిమానిట‌రైజేష‌న్ గురించి చెబుతూ వ‌చ్చారు. భార‌త్ అంటే 110 కోట్ల మంది జ‌నమే కాదు భిన్న సంస్కృతుల స‌మ్మేళ‌నం. విలువ‌లే ప్రాతిప‌దిక‌గా ఈ జాతి అంతా ఒకే తాటిపై న‌డుస్తోంది. ఐటీ ప‌రంగా చూస్తే ఎక్క‌డ లేన‌న్ని కంపెనీలు ఇండియాలో ఏర్పాట‌య్యాయి. ఐటీ హ‌బ్‌లుగా విరాజిల్లుతున్నాయి. బెంగ‌ళూరు, చెన్నై, కోల్‌క‌తా, ఢిల్లీ, హైద‌రాబ‌ద్ న‌గ‌రాలు వేలాది మందికి ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించే కేంద్రాలుగా ఉన్నాయి.

సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌థ‌మ స్థానాల్లో ఉన్న‌టువంటి ఫేస్‌బుక్‌, గూగుల్‌, పొలారిస్‌, మైక్రోసాఫ్ట్‌, యూట్యూబ్‌, ట్విట్ట‌ర్‌, వాట్స్ యాప్ కంపెనీల‌న్నీ కొత్త‌గా ఏర్ప‌డిన తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్‌ను ఎంచుకున్నాయి. టీం లీడ‌ర్లుగా, సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్లుగా, గ్రాఫిక్‌, వెబ్ డిజైన‌ర్లుగా, అన‌లిస్టులుగా, డిజిట‌ల్ టెక్నాల‌జీ ప‌రంగా దూసుకు వెళుతోంది. మీడియా, ఎంట‌ర్ టైన్ మెంట్ రంగాలు దీంతో పాటే ఎదుగుతున్నాయి. లెక్క‌లేన‌న్ని ఇంజ‌నీరింగ్ కాలేజీలు, ఐఐటీలు, ఎంఐటీలు, త్రిబుల్ ఐఐటీలు , ప్రైవేట్ యూనివ‌ర్శిటీలు సైతం ఐటీ సెక్టార్‌కు చెందిన కోర్సుల‌తో నిండిపోయాయి. ప్ర‌తి ఏటా ల‌క్ష‌లాది మంది ఇంజ‌నీర్లుగా బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. త‌మ భ‌విత‌వ్యాన్ని ప‌రీక్షించుకుంటున్నారు. సివిల్ స‌ర్వీసెస్‌, మేనేజ్‌మెంట్‌, హ్యూమానిటీస్‌, ఆర్ట్స్‌, క్రాఫ్ట్స్‌, ఏవియేష‌న్‌, ఫార్మా , త‌దిత‌ర రంగాల‌కు ప్ర‌యారిటీ పెరిగింది.

ఆంగ్ల భాష‌పై ప‌ట్టు, త్వ‌ర‌గా ఆక‌ళింపు చేసుకునే మ‌న‌స్త‌త్వం..ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టు మారే వారిగా ఇండియ‌న్స్‌కు పేరుంది. అమెరికా ఆదాయాభివృద్ధిలో తెలుగువారి షేర్ కూడా అధిక‌మే. అక్క‌డి ఐటీ కంపెనీల‌న్నీ మ‌న ఇంజ‌నీర్లు, టెక్కీల‌పై అధికంగా ఆధార‌ప‌డ్డాయి. నెట్టింట్లో సంచ‌ల‌నం రేపుతున్న యాప్స్ క్రియేష‌న్‌లో సైతం మ‌నోళ్లే టాప్‌. ఇంట‌ర్‌లో చ‌దువుతున్న‌ప్ప‌టి నుండే అమెరికా జ‌పం చేస్తున్నారు. మ‌న వాళ్లు వేలాది మంది అమెరికాలో స్థిర ప‌డ్డారు. అక్క‌డే ఇళ్లు కొనుగోలు చేశారు. ఐటీ ప‌రంగానే కాకుండా ప‌ర్యాట‌క ప‌రంగా కూడా హైద‌రాబాద్ నుండి నేరుగా అమెరికాకు రోజూ విమానాలు న‌డుస్తున్నాయి. జీఎంఆర్‌కు ..విమాన కంపెనీల‌కు ..టూరిజం రంగానికి భారీగా ఆదాయం స‌మ‌కూరుతోంది. బీపీఓ, కేపీఓ రంగాలలో ల‌క్ష‌లాది మంది ప‌నిచేస్తున్నారు. కోట్లాది రూపాయ‌ల ఆదాయం స‌మ‌కూరుతోంది.

ఇక్క‌డ చ‌దువుకుని అమ‌రికా జ‌పం చేస్తూ ..యుఎస్ వెళుతున్న వారికి అమెరికా దేశ అధ్య‌క్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఆశావాహుల మీద నీళ్లు చ‌ల్లుతున్నాయి. వీసా నిబంధ‌న‌లు మ‌రింత క‌ఠిన‌త‌రం చేస్తూ షాక్ కు గురి చేశారు. ఒబామా ఆ దేశ అధ్య‌క్షుడిగా ఉన్న‌ప్పుడు నిబంధ‌న‌ల‌ను స‌ర‌ళ‌త‌రం చేశారు. ఇండియాతో స్నేహ పూర్వ‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ఐటీ రంగంలో మ‌నోళ్లే అత్య‌ధిక శాతం ఉన్నారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక ఇండియాకు క‌ష్టాలు స్టార్ట్ అయ్యాయి. త‌మ దేశంలో ఉన్న ఉద్యోగాల‌ను ఇండియ‌న్లు కొల్ల‌గొడుతున్నారంటూ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఆ త‌ర్వాత త‌న మాట‌ల్ని స‌వ‌రించుకున్నారు. మోడీ మంత్రాంగం ప‌ని చేయ‌డంతో గ‌త్యంత‌రం లేక ట్రంప్ దిగి వ‌చ్చారు. అధిక ఆదాయం డాల‌ర్ల రూపంలోనే మ‌న‌కు వ‌స్తోంది. గ్రీన్ కార్డు , వీసాల జారీ విష‌యంలో క‌ఠినంగానే ఉంటామ‌ని మ‌రోసారి పెద్ద‌న్న హెచ్చ‌రించారు. త‌మ జీవితంలో ఎలాగైనా స‌రే అమెరికాలో ఉంటూ డాల‌ర్లు కొల్ల‌గొట్టాల‌ని ఆశిస్తున్న డాల‌ర్ష్ డ్రీమ‌ర్స్ కు ట్రంప్ అడ్డంకిగా మారాడు. ఐటీ కంపెనీలు మాత్రం టాలెంట్ వుంటే చాలు మీకు వెల‌కం అంటూ ఆహ్వానం ప‌లుకుతున్నాయి. మ‌రి క‌ల‌ల బేహారుల ఆశ‌లు ఫ‌లిస్తాయా లేక పెద్ద‌న్న క‌రుణిస్తారో లేదో వేచి చూడాలి.

No comments