విమానం రెక్కలు వంగి ఎందుకు ఉంటాయో తెలుసా..?
విమానాల్లో మీరెప్పుడైనా ప్రయాణించారా..? లేదా..! అయినా ఏం ఫర్లేదు. ఎందుకంటే ఇప్పుడు మేం చెప్పబోయేది అందుకు సంబంధించి కాదు, కానీ విమానాలకు చెందినదే. అందుకు విమానాల్లో ప్రయాణించాల్సిన పనిలేదు. వాటిని చూసి ఉంటే చాలు. ఇంతకీ ఏంటా విషయం అంటారా..? ఏమీ లేదండీ… విమానాల రెక్కలు మొదలు నుంచి చివరి వరకు సమతలంగా ఉండకుండా చివరల్లో ఓ వైపుకు లేదా రెండు వైపులకు వంగి ఉంటాయి కదా..! అయితే అవి అలా ఎందుకు ఉంటాయో మీకు తెలుసా..? దాని గురించే ఇప్పుడు చూద్దాం.
సాధారణంగా వంగి ఉన్న విమానాల రెక్కలను వింగ్లెట్స్ (Winglets) అని పిలుస్తారు. అవి రెక్క చివరకు ఓ వైపుగా వంగి ఉంటాయి. లేదంటే రెండు వైపులకు వంగి ఉంటాయి. విమానాలకు ఉండే రెక్కల్లో ఇప్పుడు చెప్పిన రెండు రకాల్లో ఏదో ఒక విధంగా రెక్కలు వంగి ఉంటాయి. అయితే అవి అలా ఎందుకు ఉంటాయంటే… రెక్కలు మొదలు నుంచి చివరి వరకు సమతలంగా ఏక రీతిన ఉంటే అప్పుడు రెక్కల పైన కన్నా కింద ఎక్కువగా భారం పడుతుంది. దీంతో రెక్కల కింద పీడనం ఎక్కువగా తయారవుతుంది. అలా తయారైన పీడనం ఎప్పుడూ పైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. కానీ రెక్కలు సమతలంగా ఉండడం వల్ల అలా కుదరదు. ఆ ప్రక్రియ చాలా ఆలస్యమవుతుంది.
ఈ క్రమంలో విమానం త్వరగా టేకాఫ్ కాదు. అందుకు కొంత సమయం పడుతుంది. అలా సమయం పట్టే సరికి ఎంతో విలువైన ఇంధనం వృథా అవుతుంది. దీనికి తోడు ప్రయాణికుల సమయం కూడా వేస్ట్ అవుతుంది. అయితే అలా వృథాలను అరికట్టేందుకే విమానాల రెక్కలను అలా వంచి తయారు చేయడం మొదలు పెట్టారు. రెక్కలను అలా ఏదో ఒక వైపుకు లేదా రెండు వైపులకు వంచడం వల్ల రెక్కల కింది భాగంలో ఉత్పన్నమయ్యే పీడనం పైకి చాలా సులభంగా వెళ్తుంది. ఆ క్రమంలో విమానంపై భారం పడదు. దీంతో త్వరగా టేకాఫ్ అవుతుంది. అదీ… విమానం రెక్కలు వంగి ఉండేందుకు గల అసలు కారణం..!
Post a Comment