Header Ads

పెళ్లి పీటలెక్కనున్న శ్వేతా బసు ప్రసాద్! వరుడు ఎవరో తెలుసా.?

'శ్వేతా బసు ప్రసాద్' త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది, కొత్త బంగారు లోకం సినిమాతో తన నటన తో అందరిని ఆకట్టుకుంది శ్వేతా బసు ప్రసాద్, కొత్త బంగారు లోకం సినిమా తరువాత పలు తెలుగు సినిమాల్లో నటించినా, అంతగా ఆదరణ దక్కలేదు. ఆ తరువాత వ్యభిచారం కేసు లో పట్టుబడి చాలా ఇబ్బందులని ఎదుర్కొంది శ్వేతా బసు ప్రసాద్, ఆ సమయం లో మహిళా సంఘాలు మొదలు చిత్ర పరిశ్రమ వాళ్ళందరూ శ్వేతా బసు ప్రసాద్ వెంట నిలిచారు, కోర్ట్ క్లీన్ చిట్ ఇవ్వడం తో, శ్వేతా బసు ప్రసాద్ ఊపిరి పీల్చుకుంది. ఆ తరువాత అడపా తడప క్యారెక్టర్ రోల్స్, ఐటెం సాంగ్స్ లో నటిస్తూ వచ్చింది, 'చంద్రనందిని' అనే సీరియల్ లో శ్వేతా బసు ప్రసాద్ నటించింది, ఆ సీరియల్ ద్వారా ప్రేక్షకులకు మరొక సారి దెగ్గర అయ్యింది, శ్వేతా బసు ప్రసాద్ ఒక వ్యక్తి తో ప్రేమలో పడింది అని చాలా నెలలుగా వినిపిస్తున్న మాట, ఇప్పుడు ఆ మాటని నిజం చేసి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది శ్వేతా బసు ప్రసాద్.




ప్రస్తుతం ఇండోనేషియా లోని బాలీ దీవుల్లో తన కాబోయే భర్త అయిన ఫిల్మ్‌మేకర్‌ 'రోహిత్‌ మిట్టల్‌' మరియు కొంత మంది సన్నిహితులతో కలిసి బ్యాచిలర్‌ పార్టీ ని ఎంజాయ్ చేస్తున్నారు. శ్వేతా బసు ప్రసాద్, రోహిత్ మిట్టల్ నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు, డిసెంబర్ 13వ తారీఖున పూణే లో వివాహం చేసుకోనున్నారు, తరువాత ముంబై లో రిసెప్షన్. బెంగాలీ, మార్వాడీ రెండు సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం.




శ్వేతా బసు ప్రసాద్ గోవా లో మిట్టల్ కు ప్రపోస్ చేసిందట, ఆ ప్రపోసల్ ను పూణే కి వెళ్ళాక మిట్టల్ అంగీకరించాడు, సామాన్యంగా అబ్బాయిలే అమ్మాయిలకు ప్రపోస్ చేస్తారు, కానీ ఇక్కడ అమ్మాయి ఏ అబ్బాయి కి ప్రపోస్ చేసింది, ఆలా చేస్తే తప్పేంటి అని శ్వేతా బసు ప్రసాద్ చెప్పుకొచ్చారు, మనసులు కలిసినప్పుడు ఎవరు ముందు చెబితే ఏంటి అని శ్వేతా బసు ప్రసాద్ తెలిపారు.

జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను అతి తక్కువ సమయం లో అనుభవించిన శ్వేతా బసు ప్రసాద్, చివరికి ప్రేమించిన వాడితోనే వివాహం జరుగుతుండటం తో శ్వేతా బసు ప్రసాద్ ఆనందానికి పరిధి లేకుండా పోయింది.



No comments