Header Ads

నాడు చెత్త కుండీలో దొరికిన అమ్మాయి నేడు అసిస్టెంట్ కమిషనర్ అయ్యింది.!

ఆడ పిల్ల పుడితే చేత కుప్ప లో వేసే కొంత మంది డో**** కొ*** చెత్త ము*** ఉన్న ఈ లోకం లో, ఆలా చెత్త కుప్ప లో వేసిన పిల్లలని తమ పిల్లలుగా అనుకోని అక్కున చేర్చుకొని ప్రేమతో పెంచి పెద్ద చేసే వాళ్ళ సంఖ్యా చాలా తక్కువ, అసోంలోని తీన్ సుఖియా జిల్లాకు చెందిన సోబరన్‌‌ బండిమీద కురగాయలు పెట్టుకుని వీధివీధి తిరుగుతూ అమ్ముతుండేవాడు. అదే ఆధారంగా బతుకుతున్నాడు. తల్లి దండ్రులు ఇద్దరూ పెద్దవారు కావడం వారిని చూసుకునే బాధ్యత తనపై పడడంతో పెళ్లి చేసుకోవాలని కూడా ఆలోచించలేకపోయాడు.


రోజులానే ఓ రోజు కూరగాయలు అమ్మి చీకటి పడిన తరువాత ఇంటికి వస్తున్నాడు. ఇంతలో ఓ చిన్నారి ఏడుపు వినిపించింది. తల్లి పొత్తిళ్లలో ఉండాల్సిన ఓ పసికందు చెత్తకుప్పలో ఏడుస్తూ కనిపించింది. పరుగున వెళ్లి చుట్టూ చూశాడు. పాప తాలూకూ ఎవరూ కనిపించలేదు. ఏజన్మ బంధమో నాకోసమే పుట్టిందేమో అనుకుని ఆప్యాయంగా అక్కున చేర్చుకున్నాడు. అమ్మానాన్నా అన్నీ తానై పెంచి పెద్ద చేశాడు. 25 ఏళ్లు వచ్చిన ఆ అమ్మాయి.. నాన్నా నీ కష్టం ఊరికే పోలేదు.. అసిస్టెంట్ కమిషనర్ అయ్యానంటూ తనకి ఉద్యోగం వచ్చిన ఆర్డర్స్ తండ్రి సోబరన్ చేతిలో పెట్టింది. చిన్నారి రాకతో తన జీవితం మారిపోయింది. ఇప్పుడు అందరూ అతన్ని మెచ్చుకుంటున్నారు, అతను లేకపోయి ఉంటె ఇప్పుడు ఆ అమ్మాయి కలెక్టర్ అయ్యేది కాదు. తనకి దొరికిన ఆ చిన్నారికి జ్యోతి అని పేరు పెట్టాడు, తన జీవితం లో జ్యోతి ని నింపిన జ్యోతి ఆ దేవుడి వరం అని సంతోష పడుతున్నాడు.

జ్యోతి ని కన్న కూతురి లాగ చూసుకున్నాడు, జ్యోతి ని మంచి స్కూల్లో జాయిన్ చేశాడు. బాగా చదవాలంటూ ప్రోత్సహించాడు. జ్యోతి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఓ తండ్రిగా అందమైన కలలు కన్నాడు. కష్టం తెలియకుండా, కన్నీళ్లు రానివ్వకుండా జ్యోతిని పెంచి పెద్ద చేశాడు. ఫలితంగా జ్యోతి కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ పట్టా తీసుకుంది. అసోం పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు హాజరైంది. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. ఇంటర్వూలో కూడా విజయం సాధించి ఇన్ కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌గా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందుకుంది. బిడ్డ విజయాన్ని చూసిన తండ్రి సోబరన్ కళ్లలో ఆనంద భాష్పాలు చూసి జ్యోతి తల్లడిల్లిపోయింది, తనను పెంచి పెద్ద చేసి తాను ఇంత స్థాయికి రావడానికి కారణం అయిన తన తండ్రికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తనకి అర్ధం కావట్లేదు.. బ్రతికినంత కాలం తన తండ్రి సోబరన్‌‌ కు ఎటు వంటి కష్టం రాకుండా చూసుకుంటా అని జ్యోతి పేర్కొనింది.

అమ్మాయిలు అంటే కేవలం భారం, భయం మాత్రమే కాదు.. అమ్మాయిలు, అబ్బాయిలకు ఏ మాత్రం తీసిపోరు అని ఈ ఘటన ఉదాహరణలో ఒకటిగా చెప్పొచ్చు. ఇప్పటికైనా అమ్మాయిల విషయం లో పెళ్లి అయిన జంటలకు ఉండే అవగాహన మారాలని కోరుకుంటున్నారు.

No comments