Header Ads

మిథాలీ రాజ్ కు అండగా భారత అభిమానులు, రమేష్ పొవార్ ని బూతులతో ముంచెత్తిన నెటిజన్స్. రమేష్ పొవార్ఒక 'టూ'.. అంటున్న నెటిజన్స్.

మిథాలీ రాజ్. భారత దేశం లో మహిళా క్రికెట్ కు పేరు తెచ్చిన గొప్ప మహిళ, అంతర్జాతీయ మహిళల క్రికెట్ విభాగం లో ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నారు మిథాలీ రాజ్, ప్రస్తుత మహిళ క్రికెట్ విభాగానికి కోచ్ గా వ్యవహరిస్తున్న రమేష్ పొవార్ వలన మిథాలీ రాజ్ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ సెమి ఫైనల్స్ లో ఇండియా తరపున ఆడలేకపోయింది, సెమి ఫైనల్స్ లో ఇండియా ఓటమి పాలవడం తో, మిథాలీ రాజ్ ఆడి ఉంటె ఇండియా గెలిచేది అని క్రికెట్ అభిమానులు కామెంట్ లతో హోరెత్తారు, రమేష్ పొవార్ వల్లనే తను సెమి ఫైనల్స్ లో ఆడలేకపోయా అని మిథాలీ రాజ్ స్పష్టం చేసారు, ప్రాక్టీస్ చేసే సమయాల్లో నేను మాట్లాడుతున్నా పట్టించుకొనేవాడు కాదు, ఫోన్ వాడుతూ ఆలా వెళ్ళిపోతాడు, రమేష్ పొవార్ కి భారత మహిళ T20 క్రికెట్ టీం కెప్టెన్ హర్మన్ ప్రీత్ జత అయ్యింది, ఇద్దరు కలిసి కావాలనే నన్ను మ్యాచ్ లో ఆడనివ్వలేదు అంటూ బాధ పడ్డారు మిథాలీ రాజ్.




భారత మహిళ క్రికెట్ విభాగం అభివృద్ధి చెందడానికి మిథాలీ రాజ్ ఎంతో కృషి చేసారు, అలంటి మిథాలీ రాజ్ కి ఇలాంటి పరిస్థితి రావడం తో ప్రతి ఒక్కరు BCCI ని తిట్ట సాగారు, సోషల్ మీడియా లో అయితే రమేష్ పొవార్ ని ఒక ఆట ఆడుకుంటున్నారు, అసలు నీకు ఏ అర్హత ఉందని నువ్వు ఉమెన్స్ టీం కి కోచ్ గా వెళ్ళావు, అసలు నిన్ను ఎంపిక చేసిన ఆ *బీప్* గాడు ఎవడు అంటూ ఒకరు తిడితే, అసలు నీ మోకానికి నువ్వు కోచ్ ఏంట్రా, రాజకీయం చేసి కోచ్ వి అవ్వగలవేమో కానీ, మా దృష్టిలో నువ్వు ఎప్పటికి ఒక ఒక *బీప్* గాడివే అంటూ ఇంకొకరు తిట్టారు, ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు, కొన్ని వేల మంది ఇప్పుడు రమేష్ పొవార్ ని తిట్లతో ముంచెత్తుతున్నారు, ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం కెప్టెన్ అయిన హర్మన్ ప్రీత్ ని కూడా తిట్లతో ముంచెత్తారు, ఇండియా లో మిథాలీ కి ఉన్న క్రేజ్ చూసి మిగిలిన ఉమెన్స్ క్రికెట్ ప్లేయర్స్ అందరూ ఆశ్చర్యపోతున్నారు.

గమనిక: *బీప్* అనగా బూతు పదం, సోషల్ మీడియా లో రమేష్ పొవార్ ని మునుపెన్నడూ వినని బూతులతో నెటిజన్స్ తిడుతున్నారు. హిందీ, తెలుగు, తమిళ్, ఇంగ్లీష్, ఇలా అన్ని బాషల వాళ్ళు వాళ్ల బాషలలో బద్ధం పొవార్ ను బాధేస్తున్నారు.

Tweet:

https://twitter.com/yashbhati0017/status/1067376997091799043

No comments