Header Ads

యాపిల్‌కు షాకిచ్చిన మైక్రోసాఫ్ట్.!!

వ‌ర‌ల్డ్ మార్కెట్‌ను షేక్ చేసిన వార్త ఇది. టెక్కీల‌ను ఆశ్చ‌ర్య పోయేలా చేసింది. ఐటీ ప‌రంగా ఆపిల్ కంపెనీని న‌మ్మ‌క‌మైన నాణ్య‌మైన కంపెనీగా తీర్చిదిద్దిన ఘ‌న‌త స్టీవ్ జాబ్స్‌ది. వాట్స్ యాప్‌, ఇన్‌స్టాగ్రాం, ఫేస్ బుక్‌, గూగుల్‌, యూట్యూబ్‌, ఆపిల్ , పోలారిస్ త‌దిత‌ర కంపెనీ దిగ్గ‌జాలు వ‌ర‌ల్డ్ మార్కెట్‌ను ప్ర‌భావితం చేస్తున్నాయి. ఆల్ మోస్ట్ పాపుల‌ర్ కంపెనీల‌లో ఇండియ‌న్స్ ఎక్స్‌ప‌ర్ట్స్ వాటా అత్య‌ధికం. ఇది కాద‌న‌లేని వాస్త‌వం. అత్యంత విలువైన కంపెనీగా అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్ నిలిచింది.
ప్ర‌పంచ దేశాలు నివ్వెర పోయేలా..ఇత‌ర ఐటీ కంపెనీల‌కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది ఈ కంపెనీ. మార్కెట్ విలువ‌లో దూసుకు పోతోంది. ఈ ఐటీ కంపెనీకి ఏపీకి చెందిన తెలుగు వాడు స‌త్య నాదెళ్ల బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. మెల మెల్ల‌గా న‌మ్మ‌కాన్ని పెంచుతూ..నాణ్య‌వంతంగా సేవ‌లు అందించేలా తీర్చిదిద్దుతున్నాడు స‌త్య‌.

ఆయ‌న క‌ర‌వు ప్రాంతానికి చెందిన వారు. నాదెళ్ల తండ్రి పేరొందిన ఐఏఎస్ అధికారి. ఇటీవ‌లే ఈ ఐటీ దిగ్గ‌జం ..త‌న ఆత్మ‌క‌థ పేరుతో ఓ పుస్త‌కాన్ని విడుద‌ల చేశారు. త‌న అనుభ‌వాలే ఇందులో ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ న‌మ్మ‌క‌మైన కంపెనీగా పేరు తెచ్చుకుంది. 75 వేల 330 కోట్ల విలువ‌ను మూట‌గ‌ట్టుకుంది. నిన్న‌టి దాకా మార్కెట్‌ను ఐటీ దిగ్గ‌జ కంపెనీ ఆపిల్ ప్ర‌థ‌మ స్థానంలో నిలిచింది. స్టాక్ మార్కెట్ విలువ ఒక్క‌సారిగా పెరగ‌డంతో ట్రేడ్ వ‌ర్గాల అంచ‌నాలు త‌ల‌కిందుల‌య్యాయి.

74 వేల 880 కోట్ల మార్కెట్ విలువ‌తో ఆపిల్ కంపెనీ రెండ‌వ స్థానంతో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. ఒక్క‌సారిగా ల‌క్ష కోట్ల విలువలో మార్పులు చోటు చేసుకోవ‌డం కూడా ఒకింత ఆలోచించాల్సిన అంశం. ప్ర‌ధానంగా ఆపిల్‌కు ఐఫోన్ల రూపేణా కొంత దెబ్బ ప‌డింద‌న్న‌ది కంపెనీ ప్ర‌తినిధుల వాద‌న‌. ఇటీవ‌లే విడుద‌ల చేసిన ఈ ఐఫోన్ల‌కు ఆశించినంత ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు. ఒక‌ప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ ఫోన్లు విడుద‌ల‌వుతున్నాయంటే రేయింబ‌వ‌ళ్లు ఆయా మొబైల్ స్టోర్ల వ‌ద్ద జ‌నం క్యూ క‌ట్టారు. ఇపుడు అది మారింది. నాణ్య‌త‌లో ఎలాంటి రాజీ ప‌డ‌కుండా న‌మ్మ‌క‌మైన బ్రాండ్‌గా ఆపిల్‌కు ఇప్ప‌టికీ డిమాండ్ ఉంది.

అయితే అమెరిక‌న్ ఆపిల్ కంపెనీకి ..శ‌త్రు దేశ‌మైన చైనా నుండి ప్ర‌మాదం పొంచి ఉన్న‌ది. ప్రపంచ వ్యాప్తంగా ఏ వ‌స్తువు త‌యారైనా ..మొబైల్స్‌, టీవీలు, ఇత‌రాలు ఏదైనా విడుద‌లైన కొద్ది సేప‌టికే..మార్కెట్‌ను సేమ్ టు సేమ్‌..అవే ఫీచ‌ర్స్‌తో త‌క్కువ రేటుకే మార్కెట్‌లోకి వ‌దులోంది. దీని దెబ్బ‌కు ఠారెత్తిపోతున్నాయి ఇత‌ర కంట్రీస్‌..కంపెనీలు. ఏం చేయాలో పాలుపోక ల‌బోదిబోమంటున్నాయి. జ‌నాభా వంద కోట్లు దాటినా ప్ర‌తి ఒక్క‌రు అక్క‌డ ప‌నిమంతులే. ఆన్‌లైన్‌లో దుమ్ము రేపుతున్న అమెజాన్ 73 వేల 800 కోట్ల డాల‌ర్ల మార్కెట్ విలువ‌తో మూడో స్థానంలో నిలిచింది.

ఇండియాలో నీళ్లు దొరుకుతాయో లేదో కానీ అమెజాన్ అక్క‌డికి చేరుకుంది. అంత‌గా పాపుల‌ర్ అయ్యింది. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ 72 వేల 850 కోట్ల డాలర్ల మార్కెట్ విలువ‌తో నాలుగో స్థానంతో స‌రిపెట్టుకోవ‌డం విస్మయానికి గురి చేసింది. క్లౌడ్ స‌ర్వీస్‌, గేమింగ్ విభాగాలు మైక్రోసాఫ్ట్ విలువ పెరిగేందుకు దోహ‌ద ప‌డ్డాయ‌ని మార్కెట్ వ‌ర్గాలు విశ్లేసిస్తున్నాయి. ఇదే మార్కెట్ విలువ‌తో ఎంఎస్ త‌న స్థానాన్ని నిలబెట్టుకుంటుందా లేక ఇత‌ర కంపెనీల పోటీ త‌ట్టుకుని నిల‌బ‌డుతుందా అన్న‌ది మిలియ‌న్ డాల‌ర్ ప్ర‌శ్న. ఏది ఏమైనా టెక్కీలు మాత్రం సంతోషంగా ఉన్నారు.

No comments