Header Ads

‘మిషెలిన్ స్టార్’ గుర్తింపు పొందిన తొలి భారతీయ మహిళ. చరిత్ర సృష్టించిన గరిమా.!

ప్రపంచ వ్యాప్తంగా ‘మిషెలిన్ స్టార్’ గుర్తింపుకు ఎంతో ప్రముఖత ఉంది, ఒక రెస్టారెంట్ కు ‘మిషెలిన్ స్టార్’ గుర్తింపు వచ్చింది అంటే, ఆ రెస్టారెంట్ అంతర్జాతీయంగా ఫేమస్ అయిపోయినట్టే. అంత విలువ ఉంది ‘మిషెలిన్ స్టార్’ గుర్తింపు కి. ‘మిషెలిన్ స్టార్’ గుర్తింపు పొందిన భారతీయ మహిళా గా గరిమా అరోరా చరిత్రలో నిలిచిపోతారు. గరిమా అరోరా గారు నిర్వహిస్తున్న ఒక రెస్టారెంట్ కు ‘మిషెలిన్ స్టార్’ గుర్తింపు లభించింది, ఫ్రాన్స్‌కు చెందిన ఓ సంస్థ ఈ గుర్తింపును అందిస్తుంది.




ఈ సంస్థ ఎవరికి పడితే వారికి ‘మిషెలిన్ స్టార్’ గుర్తింపు ఇవ్వదు. నాణ్యత, రుచి, రెస్టారెంట్ లో పని చేసే వారి నిబద్ధత, రెస్టారెంట్ పైన జనాల్లో ఉండే నమ్మకం, ఇలా ఎన్నో విషయాలను పరిగణలోకి తీసుకొని ఒక రెస్టారెంట్ కు ‘మిషెలిన్ స్టార్’ గుర్తింపు ఇస్తారు. భారతీయ మహిమ పెట్టిన రెస్టారెంట్ కి ఈ ఘనత దక్కడం గర్వకారణం. ‘మిషెలిన్ స్టార్’ గుర్తింపు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని గరిమా వెల్లడించారు. బ్యాంకాక్‌లో గరిమా ‘గా’ రెస్టరెంట్‌ను నిర్వహిస్తున్నారు. ‘గా’ రెస్టరెంట్‌కె ‘మిషెలిన్ స్టార్’ గుర్తింపు వచ్చింది.

గరిమా మాట్లాడుతూ:

‘నిజానికి వంట చేయడం చాలా పెద్ద చాకిరీ. మొదట్లో కష్టంగా ఉండేది. తరువాత నేను దానికి అలవాటు పడిపోయా. ఇప్పుడు ఇక్కడి దాకా రాగలిగా. 21ఏళ్ల వయసులో వంట చేయడం నేర్చుకున్నా. పాక శాస్త్రంలో శిక్షణ కోసం ప్యారిస్‌లోని కార్డన్ బ్లూ కలినరీ స్కూల్‌లో చేరాను. పంజాబీ కుటుంబానికి చెందిన మహిళ కావడంతో మొదట్నుంచీ వంటలపైన నాకు ఆసక్తి ఉంది.




‘రెస్టరెంట్‌ నిర్వహించడం అంటే ఇంటికొచ్చిన అతిథులకు మర్యాద చేసి, వాళ్లకు మంచి భోజనం పెట్టడం లాంటిదే. మేం కూడా అతిథులకు అలాంటి అనుభూతినే పంచుతున్నాం. దానికి లభించిన గుర్తింపే మిషెలిన్ స్టార్’. వంట చేయడంలో నా తండ్రి గారే నాకు స్ఫూర్తి, ఇంట్లో ఆయన చేసే రకరకాల వంటకాలను గమనిస్తూ పెరిగాను. పాక శాస్త్రంపైన అభిరుచి పెరగడానికి తండ్రి ప్రభావమే కారణం. ‘చాలామంది భారతీయులకు ఇప్పుడు పరిచయం లేని వంటకాలను కూడా న తండ్రి గారు 90ల్లోనే చేసేవారు’

గత ఏడాది తన సొంత రెస్టరెంట్‌ను తెరవక ముందు గోర్డన్ రామ్సే, రెనె రెజెపి, గగన్ ఆనంద్ లాంటి ప్రముఖ షెఫ్‌ల దగ్గర ఆమె పనిచేశాను. ‘భారతీయ రుచులతో పాటు ఇతర దేశాల ప్రజల అభిరుచులను మేళవించి మా రెస్టరెంట్‌ మెనూను రూపొందించా. వంట చేయడంలో చాలా సృజనాత్మకత దాగుంటుంది. ఏదో తెలీని సంతృప్తిని అది అందిస్తుంది’. తమ హోటల్ సిబ్బందిని చూసి గర్వపడుతున్నానని, రెస్టరెంట్‌ను ఇదే విధంగా ముందుకు తీసుకెళ్తాను. ‘ఇలాంటి ఆహారాన్ని ముందెప్పుడూ తినలేదే’ అనుకుంటూ తన వినియోగదారులు రెస్టరెంట్ నుంచి అడుగు బయటపెట్టాలని నా కోరిక అంటూ గరిమా గారు తెలిపారు.




మిషెలిన్ స్టార్ల ద్వారా రెస్టరెంట్లకు అంతర్జాతీయ గుర్తింపు లభించడంతో పాటు, వ్యాపారం కూడా బాగా పెరిగే అవకాశం ఉందని హోటల్ రంగ నిపుణులు భావిస్తారు, ఈ గుర్తింపు ద్వారా రెస్టారెంట్ కు మరింత ఘనత పెరిగిందని హోటల్ సిబ్బంది చెబుతున్నారు.

No comments