Header Ads

మ‌ధ్యప్ర‌దేశ్‌లో మ‌హ‌రాజు ఎవ్వ‌రు..? - క‌మ‌లం నిలిచేనా ..హ‌స్తం గ‌ట్టెక్కేనా

దేశమంత‌టా మ‌ధ్య‌ప్ర‌దేశ్ వైపు చూస్తోంది. నిన్న‌టితో ఛ‌త్తీస్ గ‌డ్ లో ఎన్నిక‌ల ప్ర‌క్రియ ముగిసింది. బీజేపీ, కాంగ్రెస్‌, ఇత‌ర పార్టీలు ఈసారి ఎన్నిక‌ల‌ను ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. ఇక్క‌డ ప్ర‌ధాన పార్టీల మ‌ధ్యే పోటీ జ‌రుగుతోంది. ఈ రాష్ట్రంలో రైతులే అధికం. వ్య‌వ‌సాయ రంగ‌మే కీల‌కం. వీరు ఎటు వైపు మొగ్గితే వారే ప‌వ‌ర్‌లోకి వ‌స్తారు. దీంతో వీరిని ప్ర‌స‌న్నం చేసుకోవ‌డానికి నేత‌లు నానా అగ‌చాట్టు ప‌డుతున్నారు. 2013లో ఎన్నో హామీల‌తో ప్ర‌భుత్వంలోకి వ‌చ్చిన చౌహాన్ లెక్క‌లేన‌న్ని హామీలు గుప్పించారు. ప్ర‌ధాన వ‌న‌రుగా ఉన్న రైతుల ప‌ట్ల ఉదాసీన వైఖ‌రి అవ‌లంభించార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇటీవ‌ల ఏకంగా అన్న‌దాత‌ల‌పై కాల్పులు జ‌ర‌గ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ సంఘ‌ట‌న‌లో అన్నెం పున్నెం ఎరుగ‌ని రైతులు ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌తిప‌క్షాలు బాధితుల‌కు అండ‌గా నిలిచాయి. రాహుల్ గాంధీ రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామంటూ ప్ర‌క‌టించారు.ఎన్నిక‌ల ప్ర‌చారంలో సీఎం చౌహాన్ ఎక్క‌డికి వెళ్లినా అన్న‌దాత‌ల జపం చేస్తున్నారు. తాను రైతు బిడ్డ‌నేనంటూ చెప్పారు. చాలా చోట్ల ఆయ‌న‌కు రైతుల నుండే వ్య‌తిరేక‌త ఎదుర‌వుతోంది. ఎన్నిక‌ల‌కు కొన్ని గంట‌లే స‌మ‌యం ఉండ‌డంతో మోడీ, రాహుల్ దీనిపైనే దృష్టి పెట్టారు. ఎన్నిక‌ల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 2907 మంది అభ్య‌ర్థులు రంగంలో ఉన్నారు. త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. మొత్తం 230 స్థానాల్లో 200 స్థానాల‌కు పైగా త‌మ‌వే అంటున్నాయి బీజేపీ శ్రేణులు. అయితే వారికి అన్ని ద‌క్కుతాయా అన్న‌ది సందేహాస్ప‌ద‌మే.
ఇక్క‌డ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాలంటే దాదాపు 110 సీట్ల‌కంటే ఎక్కువ రావాలి. ఆ బ‌లం ఎవ‌రికి వ‌స్తుంద‌న్న‌ది అంచ‌నా వేయ‌లేమంటున్నాయి స‌ర్వేలు..ఏజెన్సీలు. గ‌తంలో కంటే ఈసారి కొంత ప్ర‌భుత్వ వ్య‌తిరేకత ఉంద‌ని..పోటీ మాత్రం ఇరు పార్టీల మ‌ధ్యే..హోరా హోరీగా జ‌ర‌గ‌నుంద‌ని స‌ర్వేలు తేట‌తెల్లం చేస్తున్నాయి.

మొత్తం ఓట్లు పోల‌యితే..60 శాతానికి కంటే పైగా రైతుల ఓట్లే ఉంటాయి. వీరే ఈ ఎన్నిక‌ల్లో కీల‌క పాత్ర పోషించ బోతున్నారు. రాష్ట్రంలో 70 శాతానికి పైగా గ్రామీణ ప్రాంతాలున్నాయి. ఇపుడ‌వి ప‌ట్ట‌ణాలుగా రూపాంత‌రం చెందుతున్నాయి. ప‌ట్ట‌ణ ప్ర‌జానీకం 90 శాతం మేర‌కు ఉంది..ఈ ర‌కంగా చూస్తే 194 నియోజ‌క‌వ‌ర్గాలు వీరికే చెందుతాయి. గ‌తంలో 132 సీట్లు క‌మ‌లం కైవ‌సం చేసుకుంది. కాంగ్రెస్ కేవ‌లం 45 ప్రాంతాల‌కే ప‌రిమిత‌మైంది. ప‌వ‌ర్‌లోకి వ‌చ్చేందుకు రైతుల‌కు అనేక తాయిళాలు ప్ర‌క‌టించ‌డంతో ఓట్లు బీజేపీకి ప‌డ్డాయి.

రాష్ట్రంలో జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో మొత్తం 5,04,95,251 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఈసారి అదనంగా 11,000 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడి అసెంబ్లీ ఎన్నికలు మిగిలిన రెండు హిందీ బెల్ట్‌ రాష్ట్రాల కంటే -పెద్ద పార్టీలకు ప్రతిష్ఠాత్మకం. నాలుగోసారి బీజేపీ గెలిచిందా- 2019లో విజయానికి రెండు మెట్లు ఎక్కేసినట్లే! ఓడిందా.. నరేంద్ర మోదీ ప్రభ మసకబారుతున్నట్లేనని విశ్లేషిస్తున్నారు రాజ‌కీయ మేధావులు. ఈ ఎన్నిక‌లు వార్‌ను త‌ల‌పింప చేస్తున్నాయి. సీఎం చౌహాన్ కంటే ఎక్కువ‌గా మోడీ వ‌ర్సెస్ రాహుల్ గాంధీగా మారాయి. ఏది ఏమైనా ఫార్మ‌ర్స్ ఎవరి వైపు నిల‌బ‌డ‌తార‌న్న దానిపైనే ఇరుపార్టీలు కాన్‌స‌న్ంట్రేష‌న్ చేస్తున్నాయి. బీజేపీ స‌ర్కార్ ప‌ట్ల రైతులు కారాలు మిరియాలు నూరుతున్నారు. మ‌రి పోలింగ్ స‌ర‌ళి ఎలా ఉంటుంద‌న్న దానిపైనే ఉత్కంఠ నెల‌కొంది. ఫ‌లితాల కోసం వెయిట్ చెయ్య‌డ‌మే.

No comments