Header Ads

ఎమ్మెల్యే గా పోటీ చేయనున్న జూనియర్ ఎన్టీఆర్ చెల్లెలు.!

హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా దివంగత నేత నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని నేడు 11:21 గంటలకు నామినేషన్ వేశారు. ముందుగా నందమూరి ఫ్యామిలీతో కలిసి వెళ్లి దివంగత నేత ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ: సుహాసినిని భారీ మెజార్టీతో గెలిపించాలని కూకట్‌పల్లి నియోజకవర్గ ప్రజలకు బాలయ్య పిలుపునిచ్చారు. తెలంగాణలో ప్రజాకూటమిదే విజయమన్నారు. బాలకృష్ణ సుహాసిని కి సపోర్ట్ గా నిలవడం తో నందమూరి అభిమానులు సంతోషం లో మునిగి తేలుతున్నారు



సోషల్ మీడియా లో జూనియర్ ఎన్టీఆర్, సుహాసిని కి సపోర్ట్ తెలుపుతూ పోస్ట్ వేసాడు. కళ్యాణ్ రామ్ అన్నయ్య నేను ఎప్పుడు సుహాసిని కి అండగా ఉంటాం అని తెలిపాడు. జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. సమయాన్ని బట్టి, షెడ్యూల్ ప్రకారం వారు ప్రచారం చేస్తారన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కూకట్‌పల్లి వరకే ప్రచారం చేస్తారా? లేకుంటే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

శుక్రవారం రోజున నందమూరి సుహాసినిని జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ప్రచారానికి వస్తారా అని మీడియా అడగ్గా.. నామినేషన్‌ దాఖలు చేసిన తర్వాత దీని గురించి మాట్లాడతానని స్పష్టం చేశారు. ప్రజలంతా తనను ఆశీర్వదించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. ప్రజలకోసం అనునిత్యం కష్టపడతానన్నారు. కాగా.. సుహాసినిని అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి ఎన్నికల ప్రచారానికి నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ వస్తారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం విజయోత్సవ వేడుక లో బాలయ్య బాబు, నేను ఉన్న నా అన్నయ్య కుటుంబానికి అంటూ ముందుకు వచ్చాడు. జూనియర్. ఎన్.టీ.ఆర్ బాలకృష్ణ తిరిగి కలవడం తో నందమూరి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

Wishing my sister Suhasini garu all the very best, as she takes her first step into public service.

https://www.facebook.com/jrntr/posts/2090865864310845

No comments