Header Ads

రెండు వేల కోట్ల‌ను స‌మీక‌రించిన ఒకే ఒక్క‌డు - గోపాల్ శ్రీ‌నివాస‌న్.!!

క‌ష్టం వ‌స్తే వంద రూపాయ‌లు దొర‌క‌ని ప‌రిస్థితి. కానీ ఒకే ఒక్క ఇండియ‌న్ మాత్రం 2000 వేల కోట్ల నిధుల‌ను స‌మీక‌రించి చ‌రిత్ర సృష్టించారు. అత‌నే త‌మిళ‌నాడుకు చెందిన గోపాల్ శ్రీ‌నివాస‌న్‌. 35 ఏళ్ల కెరీర్‌లో ఇదో రికార్డుగానే భావించాల్సి ఉంటుంది. డీమానిట‌రైజేష‌న్ త‌ర్వాత డ‌బ్బులు లేకుండా పోయాయి. మార్కెట్‌లో స్త‌బ్ధ‌త ఏర్ప‌డింది. ఈ స‌మ‌యంలో ఎవ‌రైనా ఇన్ని కోట్లు స‌మీక‌రిస్తార‌ని ఆశిస్తారా. కానీ శ్రీ‌నివాస‌న్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఐటీ, ఫైనాన్స్‌, ఇంజ‌నీరింగ్‌, ఆటోమొబైల్స్ , త‌దిత‌ర రంగాల‌తో టీవీఎస్ కంపెనీ సుసంప‌న్న‌మైన , బ‌లీయ‌మైన‌, ఆర్థికంగా బలోపేత‌మైన సంస్థ‌గా ఇండియాలో పేరుగాంచింది. 4 వేల బిలియ‌న్ల మార్కెట్‌ను దాటేసింది ఈ కంపెనీ. ఈ సంస్థ‌లోని స‌భ్యులలోని వ్య‌క్తే మ‌న గోపాల్.బెంగళూరులో జ‌రిగిన కంపెనీ బోర్డు స‌మావేశంలో పాల్గొన్న శ్రీ‌నివాసన్ నిధులు స‌మీక‌రించాల‌ని ప్ర‌తిపాదించారు. ఎలా చేస్తార‌న్న దానిపై స‌భ్యులు నిల‌దీశారు. ఆయ‌న న‌వ్వుతూ ఉండి పోయారు. టీవీఎస్ ఓ బ్రాండ్‌. ఇండియ‌న్ ఆటోమొబైల్స్ రంగంలో న‌మ్మ‌క‌మైన కంపెనీ. వేలాది మంది మ‌న సంస్థతో అనుసంధాన‌మై ఉన్నారు. ఐటీలో టీసీఎస్ ఎలానో వాహ‌నాల రంగంలో టీవీఎస్ అలాంటిది. ఈ ఒక్కటి చాలు నిధులు స‌మీక‌రించేందుక‌ని తిరిగి ప్ర‌శ్నించారు గోపాల్‌. మీటింగ్ ముగిసిన వెంట‌నే టీవీఎస్ కేపిట‌ల్ ఫండ్ పేరుతో ఫైనాన్స్ కంపెనీని నెల‌కొల్పారు. ఏ రంగంలోనైనా స‌రే స్టార్టింగ్‌తో ప్రారంభ‌మైన కంపెనీల‌పై ఆయ‌న దృష్టి పెట్టారు. ఈ సంస్థ ద్వారా 2 వేల కోట్ల రూపాయ‌ల‌ను స‌మీక‌రించారు. ఆర్బీఐ ..కంపెనీల చ‌ట్టాల నియ‌మ నిబంధ‌న‌ల‌కు లోబ‌డే వీటిని ఒకే చోట‌కు చేర్చిన ఘ‌న‌త శ్రీ‌నివాస‌న్‌దే.దేశంలోని ప్ర‌తి చోటా టీవీఎస్ కేపిట‌ల్ ఫండ్ విస్త‌రించింది. ఈక్విటీ ద్వారా, ఇత‌ర మార్గాల ద్వారా నిధుల‌ను వ్య‌క్తులు, సంస్థ‌లు, కంపెనీల నుండి నిధులు పెట్టుబ‌డి పెట్టేలా చేశారు. ఒకే ఒక్కడు వేల కోట్ల‌ను స‌మీక‌రించ‌డం అసాధార‌ణ‌మైన విష‌యం. ఆటోమొబైల్స్‌లో మా కంపెనీ న‌మ్మ‌క‌మైన బ్రాండ్‌గా ఇండియాలో నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని పొందింది. ఈ ఒక్క న‌మ్మ‌కం..బ్రాండ్ చాలు ..ఇదే మేం వ్యాపారం చేసేందుకు దోహ‌ద ప‌డిందంటారు ఓ సంద‌ర్భంలో శ్రీ‌నివాస‌న్‌. టీవీఎస్ సంస్థ‌కు అనుబంధంగా మ‌రో తొమ్మిది కంపెనీల‌ను స్టార్ట్ చేశారు. మార్కెట్‌ను ప్ర‌భావితం చేస్తున్న ప్ర‌తి రంగంపై ప‌ట్టు ఉండేలా కంపెనీల‌ను విస్త‌రించారు. ఇదే ఆయ‌న వెనుక వున్న విజ‌య ర‌హ‌స్యం. ఆటోమొబైల్స్ నుండి ప్రారంభ‌మైన మా వ్యాపారం అన్ని రంగాల‌లో ఉండాల‌న్న నా కోరిక నెర‌వేరింది. దీని వెనుక నాకు అండ‌గా ..ఆలోచ‌న ఇచ్చింది..సీకే ప్ర‌హ్లాద్ అంటారాయ‌న‌.

ఇక్క‌డే ఆగి పోలేదు. బిజినెస్ కొత్త పుంత‌లు తొక్కాలి. మ‌రింత విస్త‌రించాలి.. ఇందు కోసం కొత్త కంపెనీల‌తో క‌లిస్తే మార్కెట్ వాటాలో చేజిక్కించు కోవ‌చ్చ‌న్న ఐడియా ఫ‌లించింది. త‌మిళ‌నాడులో బిగ్ మార్కెట్ క‌లిగిన శ్రీ‌రామ ఫైనాన్స్ కంపెనీ ఛైర్మ‌న్ త్యాగ‌రాజ‌న్‌తో చ‌ర్చించారు. ఇరు కంపెనీలు ఓ ఒప్పందానికి వ‌చ్చాయి. ఫైనాన్స్‌, బీమా రంగాల‌లో పెట్టుబ‌డి పెట్టారు. రెండు కంపెనీల మార్కెట్ విలువ 5 వేల కోట్ల నుండి 16 వేల కోట్ల‌కు పెరిగింది. ఇదో రికార్డు. ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం..క‌లిసి బిజినెస్ చేస్తే మంచి ఫ‌లితాలు ఉంటాయ‌న్న‌ది శ్రీ‌నివాస్‌..త్యాగ‌రాజ‌న్‌లు నిరూపించారు.

కొత్త ఐడియాల‌తో స్టార్ట‌ప్‌ల‌తో షేక్ చేస్తున‌న కంపెనీల‌పై పెట్టుబ‌డి పెట్టాల‌న్న ఆస‌క్తి శ్రీ‌నివాసన్‌కు ఉంది. ఓలా, స్విగ్గీ మీద కాన్‌సెంట్రేష‌న్ చేశారు. అవి వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లాయి. వెంచ‌ర్ కేపిట‌లిస్టుల‌కు, ప్రాథ‌మిక స్థాయిలో ఉండే స్టార్ట‌ప్‌ల‌కు ఫండింగ్ స‌పోర్ట్ త‌న వైపు నుండి ఎప్ప‌టికీ ఉంటుంద‌ని గోపాల్ స్ప‌ష్టం చేస్తున్నారు. మీరూ ట్రై చేయండి. కొత్త కంపెనీకి శ్రీ‌కారం చుట్టండి. టీవీఎస్ కేపిట‌ల్ ఫండ్ నుండి సాయం పొందండి.

No comments