Header Ads

సంచలనం సృష్టించిన సర్కార్ మూవీ రెండు రోజుల కలెక్షన్స్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.!

నవంబర్ 6 న దీపావళి కానుకగా రిలీజ్ అయిన 'సర్కార్' మూవీ రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్లు వసూళ్లు చేసి సంచలనం సృష్టించింది, మొదటి రోజు దాదాపు 70 కోట్ల వరకు వసూలు చేసిన ఈ చిత్రం రెండో రోజు 35 కోట్ల వరకు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మురుగ దాస్ దర్శకత్వం లో తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన సర్కార్ మూవీ గురించే ప్రస్తుతం అందరు చేర్చించు కుంటున్నారు, పొలిటికల్ మూవీ కి కమర్షియల్ టచ్ ఇస్తే ఎలా ఉంటుందో ఈ మూవీ చూస్తే తెలుసుకోవచ్చు ,విజయ్ ఫాన్స్ కి ఈ మూవీ ఫుల్ మీల్స్. డాన్స్, యాక్టింగ్, స్టైల్ తో అభిమానులని ఆకట్టుకున్నాడు. మెర్సల్ (అదిరింది) సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విజయ్,సర్కార్ కూడా అదే రేంజ్ హిట్ అవుతుందని అభిమానులు ఆనంద పడుతున్నారు. తెలుగు లో కూడా సర్కార్ చిత్రం మంచి వసూళ్ళని రాబట్టింది, తెలుగు లో ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తాయి అని తెలుగు డిస్ట్రిబ్యూటర్ కూడా ఊహించి ఉండడు, తెలుగు లో రిలీజ్ అయిన రెండు రోజుల్లో నాలుగు కోట్ల షేర్ సాధించి తెలుగు ట్రేడ్ వర్గాలకు షాక్ ఇచ్చింది. కీర్తి సురేష్ హీరోయిన్ నటించిన ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించాడు.
దక్షిణాది సినిమాల్లో ఇప్పటి వరకు బాహుబలి, కబాలి, భరత్ అనే నేను సినిమాల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో 100 కోట్లు సాధించిన చిత్రంగా సర్కార్ రికార్డు సృష్టించింది. నవంబర్ 29 న రాబోతున్న 2.0 చిత్రం ఒక్క రోజులోనే 100 కోట్లకు పైగా వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి, దక్షిణాది సినిమాల్లో ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా
బాహుబలి 2 చిత్రం మాత్రమే ఒక్క రోజులో 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.

సూపర్ స్టార్ రజిని కాంత్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న 2.0 పైన భారీ అంచనాలు ఉన్నాయ్, అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్న 2.0 చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించాడు. 550 కోట్ల బడ్జెట్ తో రూపు దిద్దుకున్న ఈ చిత్రం బాహుబలి రికార్డ్స్ ని అధిగమిస్తుందో లేదో చూడాలి, తెలుగు లో ఏకంగా 70 కోట్లకు పైగా బిజినెస్ చేసిందని సమాచారం, తెలుగు లో 2.0 హిట్ టాక్ సొంతం చేసుకోవాలి అంటే ఏకంగా 70 కోట్ల షేర్ రావాలి, ఇప్పటివరకు తెలుగు లో భరత్ అనే నేను, రంగస్థలం, ఖైదీ NO.150,బాహుబలి, బాహుబలి-2 చిత్రాలు మాత్రమే 70 కోట్లకు పైగా షేర్స్ ను రాబట్టాయి. రిలీజ్ తరువాత 2.0 ఏ రేంజ్ లో కలెక్షన్స్ సునామి ని సృష్టిస్తుందో వేచి చూడాలి.

No comments