తోడబుట్టిన వాళ్ళ కోసం వేశ్య గా మారిన ఒక యువతీ కన్నీటి కథ.?
వేశ్యలు కావాలని ఎవరు అనుకోరు. బలవంతంగా ఎత్తుకొచ్చి ఇందులోకి తోస్తారు, ఏ తోడు లేక డబ్బు అవసరం అయితే ఏమి చేయాలో తేలిక ఇందులోకి వస్తారు, ప్రతి వేశ్య వెనక ఒక చీకటి బాధాకరమైన కథ తప్పక ఉంటుంది.
తన తోబుట్టువుల కోసం వేశ్య గా మారిన ఒక అమ్మాయి కథ ఇది:
"ఆ రోజు మాకొక కాళరాత్రి. గాఢ నిద్రలో ఉన్న మేము భారీగా వచ్చిన వరదల కారణంగా ఒక్కసారిగా మేలుకున్నాం. అప్పటికే మా ఇంటి పైకప్పు గాలికి ఎగిరిపోయింది. చూస్తుండగానే ఇంట్లోకి వర్షపు నీరు వచ్చి చేరింది. అది అంతకంతకూ పెరగడంతో చివరకు మేం ఆ నీటిలో దాదాపుగా మునిగిపోతామనే అనుకున్నాం. కానీ ఎలాగోలా బయట పడ్డాం.
చేతికి దొరికిన కొన్ని బట్టలు తప్ప మా వద్ద ఏమీ లేవు. వాటితోనే వరద బాధితుల్లా వేరే ప్రాంతానికి వెళ్లాం. మేం ఉన్నది నదీ తీర ప్రాంతం. దాంతో వరద తాకిడికి మాలాగే మరో 100 నుంచి 150 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అప్పటికి మా నాన్న లేడు. నేను, అమ్మ, నా తోబుట్టువులు మరో నలుగురు మాత్రమే ఉన్నాం.
మమ్మల్ని పెంచలేని నాన్న మమ్మల్ని వదిలి వెళ్లిపోగా అమ్మే అన్నీ అయి మమ్మల్ని పెంచింది. కానీ వరదల వల్ల మాకున్న ఇల్లు కూడా పోవడంతో అమ్మకు ఏం చేయాలో తోచలేదు. దీంతో అమ్మ ఆత్మహత్య చేసుకుంది. నా తోబుట్టువుల బరువు, బాధ్యతలు నా మీద పడ్డాయి. ఇది జరిగి ఏడేళ్లయింది. ఇప్పుడు మా ఇల్లు ఉన్న ప్రాంతంలో నది పారుతుంటుంది. నా చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ ఆ నది కింద జలసమాధి అయ్యాయి.
ఆ రోజు జరిగిన దుర్ఘటన అనంతరం చెల్లెళ్లు, తమ్ముళ్ల పోషణ బాధ్యత నా మీద పడడంతో నేను వేరే దారి లేక శృంగార వర్కర్‌గా మారాల్సి వచ్చింది. అయినా నాకు దిగులు లేదు. ఎందుకంటే.. నా తోబుట్టువుల సంతోషం కన్నా నాకు ఏదీ ముఖ్యం కాదు. వారిని స్కూల్‌కు పంపుతున్నందుకు, వారికి కావల్సినవి కొనిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను నా చెల్లెళ్లు, తమ్ముళ్లను చూసుకుంటా. రాత్రి అయితే ఇక ఎవరి బాగోగులు వారే చూసుకుంటారు. మరుసటి రోజు ఉదయం నేను ఇంటికి వచ్చే వరకు వారు కోసం ఎదురు చూస్తుంటారు. అది చాలు నాకు.. వారికి నాపై ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి.
శృంగార వర్కర్‌గా నేను ఎంత బాధ అనుభవిస్తున్నానో వారికి తెలియదు. కొన్ని సార్లు ప్రెగ్నెంట్ అయ్యా. అది అబార్షన్లకు దారి తీసింది. అయినా అలా జీవించడం ఆపలేదు. ఆపితే ఏం జరుగుతుందో తెలుసు. అది ఊహించుకోవడానికే చాలా కష్టంగా ఉంటుంది. అందుకే.. నేను దేవున్ని కోరుకునేది ఒక్కటే.. నేను చేసే పనిలో ఎలాంటి ఇబ్బంది కలిగించవద్దని. ఆ ఇబ్బందులతోనే నా తల్లి నాకు దూరమైంది. ఆ ఇబ్బందులు నాకు రాకుండా చూడాలని నేను దేవున్ని రోజూ ప్రార్థిస్తున్నా!" అని ఆ అమ్మాయి తన బాధను పంచుకుంది.
Post a Comment