Header Ads

‘పో***’ చూడమని భర్త వేధింపులు.నగ్న చిత్రాలు లీక్ చేస్తానని బ్లాక్‌మెయిల్.! చివరికి ఏమైంది?

నేటి త‌రుణంలో స‌మాజంలో మ‌హిళ‌ల‌ను వేధింపుల‌కు గురి చేసే మృగాళ్లు రోజు రోజుకీ పెరుగుతున్నారు కానీ త‌గ్గ‌డం లేదు. మ‌హిళ‌ల‌ను వేధించే, వారిపై లైంగిక దాడికి పాల్ప‌డే వారిని శిక్షించ‌డం కోసం అనేక క‌ఠిన‌మైన చ‌ట్టాలు ఉన్నాయ‌ని చెప్పుకుంటున్నాం. కానీ అవేవీ ఆ మృగాళ్ల‌పై ప్ర‌భావం చూప‌లేక‌పోతున్నాయి. దీంతో వారు ఎప్ప‌టిలాగే రెచ్చిపోతున్నారు. బెంగుళూరులో ఓ మృగాడు కూడా క‌ట్టుకున్న భార్య‌ను వేధింపుల‌కు గురి చేస్తున్నాడు. దీంతో ఆ వేధింపుల‌ను భ‌రించ‌లేని ఆమె అత‌నిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే.
బెంగుళూరులోని విద్యార‌ణ్య‌పుర లో ఓ మ‌హిళ (38) త‌న భ‌ర్త డాక్ట‌ర్ మంజునాథ్‌తో క‌లిసి నివాసం ఉంటోంది. అయితే ఆ మ‌హిళ మంజునాథ్ క‌న్నా 15 సంవ‌త్స‌రాలు చిన్న‌. కాగా వీరిద్ద‌రికీ వివాహం అయి 3 సంవ‌త్స‌రాలు అవుతోంది. అయిన‌ప్ప‌టికీ సంతానం క‌ల‌గ‌లేదు. దీంతో త‌మ‌కు సంతానం క‌ల‌గ‌క‌పోవ‌డానికి త‌న భార్యే కార‌ణ‌మ‌ని భావించిన మంజునాథ్ ఆమెను వేధింపుల‌కు గురి చేయ‌డం మొద‌లు పెట్టాడు. త‌న భార్య‌ను రోజూ అత‌ను వేధించేవాడు.

మంజునాథ్ త‌న భార్య‌ను రోజూ అశ్లీల చిత్రాలు చూసి వేధించ‌డ‌మే కాదు, వాటిల్లో ఉన్న‌ట్లుగా త‌న‌తో శృంగారం చేయాల‌ని ఆమెను బ‌ల‌వంత పెట్టేవాడు. అందుకు ఆమె ఒప్పుకోక‌పోతే ఆమెను చిత్ర‌హింస‌ల‌కు గురి చేసేవాడు. అలాగే తాను చెప్పిన‌ట్లు చేయ‌క‌పోతే ఆమె న‌గ్న చిత్రాల‌ను సోష‌ల్ మీడియాలో పెడ‌తాన‌ని ఆమెను బెదిరించేవాడు. దీంతో ఆ వేధింపుల‌కు భ‌రించ‌లేని ఆమె విద్యార‌ణ్య‌పుర పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు డాక్ట‌ర్ మంజునాథ్‌పై మార్చి 7వ తేదీన కేసు న‌మోదు చేసిన‌ట్టు తెలిపారు. ఏది ఏమైనా ఇలాంటి మృగాళ్ల‌ను క‌ఠినంగా శిక్షించ‌క‌పోతే ఇలాంటి వారు బాగా త‌యార‌య్యేందుకు అవ‌కాశం ఉంటుంది.

No comments