Header Ads

ఉదయాన్నే వంటగదిలో అమ్మను ఈ పరిస్థితిలో చూసిన కొడుకు ఆవేదన..!!

ప్రతి రోజూలానే ఆఫీసుకు ఉదయాన్నే బయలుదేరే రిజ్వాన్, ఆ రోజు ఎందుకో కొంచెం ముందుగానే నిద్రలేచి రెడీ అయ్యాడు. అమ్మా వంట అయిందా?, లంచ్ బాక్స్ తీసుకురా.అని హాల్ లో నుండే అరిచాడు. వంటిట్లో వంటపనిలో నిమగ్నమైన తల్లికి, కొడుకు మాటలు వినిపించలేదు. ఆలస్యం అవుతుందని అతడే వంటిట్లోకి వెళ్ళాడు,వంటింట్లో తల్లి పరిస్థితి చూసి షాక్ అయ్యాడు.. బకెట్ లో నిలబడి తల్లి వంట చేయడాన్ని గమనించిన రిజ్వాన్…అమ్మా…! ఏంటిది? అని అడిగాడు.




ఏం లేదురా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయ్…అందుకే బకెట్ లో వేడి నీళ్ళు పెట్టుకొని వంట చేస్తున్న…ఇప్పుడు కొంత రిలీప్ గా ఉందని చెప్పింది తల్లి,తన కోసం తన తల్లి పడుతున్న కష్టాన్ని చూసి రిజ్వాన్ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. సారీ అమ్మా అంటూ తల్లిని గట్టిగా హగ్ చేసుకున్నాడు. థ్యాంక్స్ దేవుడా ఇటువంటి తల్లిని ఇచ్చావ్ అంటూ మనసులోనే దేవుడికి దండం పెట్టుకున్నాడు.

ఇది దాదాపు చాలామంది తల్లులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యే….. ఆఫీస్ పని, వర్క్ టెన్షన్ ,నెల జీతానికి అలవాటు పడి మనకంటూ తమ జీవితాన్ని కరిగించిన తల్లీదండ్రుల గురించి పట్టించుకోలేకపోతున్నాం. మనకు గోరుముద్దలు తినిపించిన వాళ్ళు, కనీసం నాలుగు గింజలైనా సమయానికి తింటున్నారా?అని ఆలోచించే టైం కూడా కొందరికి ఉండడం లేదు. ఇది చదివాక ఓ సారి మీ అమ్మ దగ్గరికి వెళ్లి ఆత్మీయంగా ఆలింగనం చేసుకోండి.మనసు కాసింత కుదుట పడుతుంది.

No comments