Header Ads

బిగ్ బాస్ ఫేమ్ “తనీష్” నటించిన “రంగు” హిట్టా.? స్టోరీ అండ్ రివ్యూ మీరే చూడండి.!

బాల నటుడిగా.. హీరోగా 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం చేసిన తనీష్‌కి ఇప్పటి వరకూ సరైన హిట్ పడలేదు. బిగ్ బాస్ సీజన్ 2లో ఫైనల్‌కి చేరడంతో ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకుంటూ.. బెజవాడ రౌడీ షీటర్ లారా వాస్తవ జీవిత కథతో ‘రంగు’ సినిమా ద్వారా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తనీష్, ప్రియా సింగ్ హీరో హీరోయిన్లుగా కార్తికేయ.వి దర్శకత్వం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నల్లస్వామి సమర్పణలో యు అండ్ ఐ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ఎ.పద్మనాభరెడ్డి, నల్ల అయ్యన్న నాయుడులు నిర్మించారు. విడుదలకు ముందు వివాదాలు చుట్టిముట్టిన ఈ చిత్రం ప్రేక్షకులకు చేరువైందా? బెజవాడ రౌడీ షీటర్ లారా కథతో బిగ్ బాస్ ఫేమ్ తనీష్ మెప్పించగలిగాడా?
కథ :

బెజవాడ రౌడీయిజం చుట్టూ రంగు కథ తిరుగుతుంది. లారా అనే వ్యక్తి జీవితంలో సంఘటనల ఆదారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. లారా పాత్రను తనీష్‌ పోషించాడు. పవన్‌ కుమార్‌ అలియాస్‌ లారా(తనీష్‌) అనే కుర్రాడు చదువుల్లో స్కూల్‌ ఫస్ట్‌. అయితే కాలేజ్‌లో గొడవలు, కొన్ని పరిస్థితుల వల్ల పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లడం.. అటుపై రౌడీ షీటర్‌గా మారతాడు. అక్కడినుంచి సెటిల్‌మెంట్లు చేస్తూ.. ఎదుగుతూ ఉంటాడు. ఈ గొడవల మధ్యే తనకు పూర్ణ (ప్రియా సింగ్‌) అనే అమ్మాయితో ప్రేమా తరువాత పెళ్లి జరుగిపోతాయి. దీంతో జీవితంపై ఇష్టం ఏర్పడుతుంది. మళ్లీ మాములు మనిషిలా మారాలానుకుంటాడు. మరి అనుకున్నట్టుగా లారా మంచి వాడిగా మారిపోయాడా..? ఈ ప్రయత్నంలో లారాకు ఎదురైన సమస్యలేంటి..? ఈ కథలో ఏసీపీ రాజేంద్రన్ (‌పరుచూరి రవి), మణి (షఫీ)ల పాత్ర ఏంటీ? అసలు చివరకు ఏమైంది.. అనేదే ‘రంగు’ కథ.

నటీనటులు :

లారా పాత్రలో తనీష్‌ బాగానే నటించాడు. కొన్ని సన్నివేశాల్లో తడబడ్డట్టు అనిపించినా.. ఎమోషనల్‌ సీన్స్‌లో ఆకట్టుకున్నాడు. ఇక ఏసీపీ రాజేంద్రన్‌ పాత్రలో పరుచూరి రవి నటన గుర్తుండిపోతుంది. ఆ పాత్రకు కావల్సిన బాడీలాంగ్వేజ్‌తో బాగానే నటించాడు. ఇక ఈ సినిమాలో తనీష్‌ తరువాత ఎక్కువగా కనిపించేది, గుర్తుండేది పరుచూరి రవి పాత్రే. నటుడిగా అతను ఇంకా బిజీ అయ్యే అవకాశం ఉంది. రౌడీయిజం వదిలేసి సాధుజీవిలో బతుకుతున్న పాత్రలో షఫీ నటన బాగుంది. పూర్ణ తెరపై కనిపించింది కొద్ది సేపే అయినా ఉన్నంతలో మంచి నటన కనబరిచింది. ఇక మిగిలిన పాత్రల్లో పోసాని కృష్ణమురళీ, పరుచూరి వెంకటేశ్వర్రావు తమ పాత్ర పరిధిమేరకు నటించారు.

రివ్యూ:

త‌నీశ్‌, ప్రియా సింగ్‌ హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు కార్తికేయ‌.వి తెరకెక్కించిన ఈ చిత్రంలో కొన్ని క్రైమ్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నా… పూర్తి స్థాయిలో ఆసక్తికరంగా సాగలేదు. దర్శకుడు కార్తికేయ‌.వి విజయవాడలో జరిగిన కొన్ని వాస్తవిక సంఘటనల ఆధారంగా మరియు రౌడీ షీటర్ లారా జీవితానికి సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను తగ్గట్లు ఇంట్రస్టింగ్ కథాకథనాలను రాసుకోలేదు. లారా, విలన్లతో గొడవ పడే సన్నివేశాలకు కారణాలు కూడా పెద్దగా బలంగా అనిపించవు.

పైగా కథనం స్లోగా సాగడం, లవ్ స్టోరీ పూర్తిగా ఆకట్టుకొన్నే విధంగా లేకపోవడం, లారా తీసుకున్నే కొన్ని నిర్ణయాలకు సంబంధించిన సన్నివేశాలు సరిగ్గా కన్విన్స్ కాకపోవడం, స్టేట్ ర్యాంకర్ అయిన లారా ఓ రౌడీ షీటర్ గా మారడానికి, బలమైన కారణాలను అంతే బలంగా చూపించపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి.

అయితే సినమాలో చెప్పాలనకున్న మెయిన్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయానికి హత్తుకుపోతాయి. తనిశ్ నటన కూడా చాలా బాగుంది. మొత్తం మీద ఈ చిత్రం సి సెంటర్ ప్రేక్షకులకు నచ్చుతుంది. అయితే మిగిలిన అన్నివర్గాల ప్రేక్షకులని ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.

ప్లస్ పాయింట్స్:  • తనీష్

  • పరుచూరి రవి యాక్టింగ్

  • కథ, కథనం

  • డైరెక్షన్

  • నిర్మాణ విలువలు

  • మైనస్ పాయింట్స్:

  • సినిమా నిడివి ఫస్టాఫ్‌

  • సెకండాఫ్‌లో కొన్ని సీన్లు

రేటింగ్: 2.25/5

ఫైనల్‌గా

భావోద్వేగం, నటన, సాంకేతిక అంశాలు మేలవించిన చక్కటి చిత్రం రంగు. సమాజంలోని వ్యక్తుల్లోని పలు కోణాలు, మనసుల్లో ఉండే రంగులను చాటిచెప్పే చిత్రం. తనీష్ నటన, దర్శకుడి ప్రతిభ సినిమాకు ప్రధాన ఆకర్షణ. అన్ని రకాల ప్రేక్షకులను మెప్పించే చిత్రం. మంచి ప్రమోషన్ ద్వారా సినిమాను ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్తే ఆర్థికంగాను, ప్రశంసల పరంగా మంచి ఫలితాన్ని రాబట్టడానికి అవకాశం ఉంది.

No comments