Header Ads

ఒక రాత్రికి వస్తావా అంటూ హీరోయిన్ ని అడిగి చిక్కుల్లో పడ్డ యువకుడు.!!

#మీటూ ఉద్యమం జోరుగా సాగుతున్న ప్రస్తుత సమయం లో, పుండు మీద కారం చల్లినట్టు, ఒక హీరోయిన్ కి ఒక సామాన్య వ్యక్తి అసభ్యంగా మెసేజ్ చేయడం తో సోషల్ మీడియా మొత్తం ఊగిపోతోంది. అసలు తను ఎటువంటి మెసేజెస్ పంపాడు, ఆ హీరోయిన్ ఎవరు?



వివరాల్లోకి వెళ్తే యాక్ట్రెస్ నేహా సక్సేనా కన్నడ, మలయాళీ చిత్రాల్లో హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించింది. గ్లామరస్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. 2013 లో ఇండిస్ట్రిలోకి అడుగుపెట్టిన నేహా సక్సేనా సినిమాలతో పాటు కొన్ని టివి సీరియల్స్‌లో కూడా నటించింది. ఇటీవల ఓ కార్యక్రమం కోసం దుబాయ్ వెళ్లిన నేహాకు చేదు అనుభవం ఎదురైంది. దుబాయ్‌లో జరిగిన ఓ ఈవెంట్ లో లోహిదక్షన్ అనే వ్యక్తి అక్కడ నేహా సక్సెనాని చూశాడు. ఆమె మేనేజర్ కు, పిఆర్ కు నేహా రేటెంత, ఒకరాత్రి గడపడానికి అంగీకరిస్తుందా అంటూ మెసేజ్ పెట్టాడు. మేనేజర్ ఈ విషయాన్ని నేహా దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె సీరియస్ గా తీసుకుంది. వెంటనే అతడు వాట్సాప్ ద్వారా పెట్టిన సందేశాల్ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియా ద్వారా బయట పెట్టింది.

నా ఫోన్ ఎవరో హాక్ చేసారని లోహిదక్షన్ పోలీస్ లకు కంప్లైంట్ ఇచ్చాడు, నిజంగానే ఆ మెసేజెస్ నేను చేయలేదు, అమ్మాయిలతో నేను మంచిగా ఉంటాను, స్త్రీలు అంటే నాకు చాలా గౌరవం అంటూ వాపోయాడు లోహిదక్షన్, లోహిదక్షన్ పేరెంట్స్ కూడా లోహిదక్షన్ కె మద్దతు ఇచ్చారు, తమ పిల్ల వాడి ఫోన్ నిజంగానే హాక్ అయ్యిందని, తమ అబ్బాయి అలా అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తించడని తెలిపారు.

నేహా సోషల్ మీడియా లో పెట్టిన పోస్ట్ లో:

https://www.facebook.com/princess.neha.58/posts/1431069853691430
నా ఫ్యాన్స్, నా మేలు కోరే వారు లోహిదక్షన్ పని చేసే కంపెనీ కి వెళ్లి అతని వివరాలు సేకరించారు, అతగాడు ప్రస్తుతం కంపెనీ కి రావట్లేదు, ఫోన్ చేస్తే ఎత్తట్లేదు, ఆ మెసేజెస్ పంపింది నేను కాదు, నా ఫోన్ హాక్ అయ్యిందని లోహిదక్షన్ చెప్తున్న మాటల్లో నిజం లేదు. అతడు చెబుతున్నట్లుగా ఫోన్ హ్యాక్ అయి ఉంటే, నా పిఆర్ రిప్లై ఇచ్చినప్పుడే స్పందించి ఉండాల్సింది. నంబర్ బ్లాక్ చేసి వివరణ ఇవ్వాల్సింది. కానీ అవేమి చేయలేదు. అతడు పనిచేస్తున్న కంపెనీ వద్దకు నా స్నేహితులు వెళ్లారు. అతడు అక్కడ లేడని తెలిసింది. పైగా ఫోన్ ఆఫ్ లో ఉంది. ఇలాంటి చర్యలన్నీ అతడికి ఇంకా చిక్కులు తెచ్చిపెడతాయి. బహిరంగంగా క్షమాపణ కోరుతూ లెటర్ విడుదల చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని నేహా సక్సేనా తేల్చి చెబుతోంది.

No comments