Header Ads

దీపావళి బాంబులు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.?

దీపావళి హ్యాపీ గానే కాదు సేఫ్ గా కూడా జరుపుకోవాలి. ఎందుకంటే దీపావళి అంటేనే టపాసులు…వెలుగులు విరజల్లేవి..చెవులు దద్దరిల్లేలా చప్పుళ్లు చేసేవి… రయ్ అంటూ ఆకాశం లోకి దూసుకుపోయేవి…రకరకాల పేర్లతో దీపావళి బాంబుల మోత మోగాల్సిందే. ప్రతి ఇంట్లో ఈ దీపావళి సంబరాలనే నింపాలి, విషాదాలను కాదు…అందుకు తప్పకుండా ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది.

  • టపాసులు పేల్చే పిల్లల దగ్గర తల్లిదండ్రులు తప్పకుండా ఉండాలి.

  • దీపావళి బాంబులు కాల్చేవాళ్ళు విధిగా కాటన్ వస్త్రాలు ధరించాలి.

  • బాంబులు పేల్చే చోట రెండు బకెట్ల నీటిని సిద్దంగా పెట్టుకోవాలి.

  • కాకరపువ్వొత్తులు కాల్చాకా వాటిని అలాగే పడేయకుండా ఓ పక్కకు ఉంచాలి.

  • మరీ పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే బాంబుల జోలికి పోకపోతేనే మంచింది.

  • మరీ వయసు మీరిన వారిన, పెంపుడు జంతువులను ఇంట్లోనే ఉంచాలి. వారికి ఎక్కువ శబ్ధాలు వినపడకుండా చూసుకోవాలి.

గాయాలైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

కాలిన గాయం అయిన చోట పసుపు పేస్ట్ రాసుకుంటే శరీర ఉష్ణోగ్రతను తగ్గించి.. వెంటనే ఉపశమనం కలిగిస్తుంది. ఇది యాంటీ సెప్టిక్ గా పనిచేస్తుంది. కాబట్టి ఎలాంటి చిన్న గాయం తగిలినా.. వెంటనే పసుపు ఉపయోగించాలి.
దీపావళి సమయంలో ఇంట్లో తేనె ఉండేలా జాగ్రత్త పడండి. ఎందుకంటే.. కాలిన గాయాలు మాన్పడానికి ఇది మంచి మెడిసిన్. కాలిన గాయాలను తగ్గించడమే కాదు.. ఇన్ఫెక్షన్ లు రాకుండా చేస్తుంది తేనె. గాయాలపై తేనెను రుద్దకుండా.. ఊరికే అప్లై చేయాలి. దీనివల్ల సత్వర ఉపశమనం ఉంటుంది.
టూత్ పేస్ట్ కాలిన గాయాలకు టూత్ పేస్ట్ గానీ, ఫౌంటేన్ పెన్ ఇంకు కానీ రాయడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది. కాలిన ప్రాంతంలో చల్లగా అనిపించడమే కాదు.. బొబ్బలు కూడా పెరగకుండా పనిచేస్తుంది.

ఇవి కనీసం పాటియవలసిన జాగ్రత్తలు, గాయం తీవ్రత ఎక్కువ అయితే వెంటనే డాక్టర్ ని సంప్రదించ వలసి ఉంటుంది.

No comments