వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకపోతే జైలు పాలే.!!
భరత్ అనే నేను సినిమా లో ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే ఫైన్స్ చాలా కఠినంగా ఉంటాయి. అని చూపించారు, ఇప్పుడు నిజ జీవితం లో కూడా అలంటి పరిస్థితులు వస్తాయేమో, బైక్ కి నెంబర్ ప్లేట్ లేకపోతే మీ జేబు కి చిల్లు పడటం పక్కా, గట్టిగా చెప్పాలి అంటే కోర్ట్ కి కూడా వెళ్ళవలసి వస్తుంది. అసలు విషయానికి వస్తే ఎవరైనా వాహనం కొన్న వెంటనే సంబంధిత షోరూమ్‌లో రిజిస్ర్టేషన్ చేయించుకుని, కొద్దిరోజుల్లోనే నెంబర్ప్లేట్లు వేయించుకుని నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలి.
నెంబర్ప్లేట్లు లేని వాహనాలను చాలామంది వినియోగిస్తుండటంతో ఏదైనా నేరాలకు, ఆ వాహనాలను ఉపయోగిస్తే వారిని పట్టుకోవడానికి పోలీస్‌శాఖ చాలా అవస్థలు పడాల్సి వస్తోంది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వ ఆదేశాలతో పోలీస్ శాఖ, రవాణా శాఖ సీరియ్‌సగా పరిగణనలోకి తీసుకుని అలాంటి వాహనాలపై చర్యలకు సిద్ధమయ్యారు.
డిసెంబర్ 1వ తేదీ నుంచి నెంబర్ ప్లేట్లపై నెంబర్ లేకుండా వాహనాలు రోడ్డుపై తిరిగితే వాటిని తక్షణమే సీజ్ చేస్తారని అధికారులు చెబుతున్నారు. వచ్చే నెల డిసెంబర్ ఒకటో తేదీ నుంచి కార్లు, భారీ వాహనాలకు నెంబర్ప్లేట్లు సరిగా లేకుండా తిరిగితే ముందుగా రూ.2 వేలు జరిమానా, రెండోసారి దొరికితే రూ.5 వేలు జరిమానా, మూడోసారి కోర్టుకు తరలిస్తారు.
ద్విచక్ర వాహనాలు, చిన్న వాహనాలు నెంబర్ ప్లేట్లు లేకుండా మొదటిసారి దొరికితే వెయ్యి, రెండోసారి దొరికితే రూ.2 వేలు, మూడోసారి దొరికితే కోర్టుకు పంపిస్తాం. అక్కడ జరిమానాతోపాటు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. నెంబర్ప్లేట్లు సరిగా లేని వాహనాలను రిజిస్ర్టేషన్ లేని వాహనాలుగా నిర్ధారిస్తాం. ఆ కోణంలోనే జరిమానాలను విధిస్తాం. ప్రస్తుతం ప్రత్యేక టీమ్‌ల ద్వారా తనిఖీల ప్రారంభానికి సిద్ధమవుతున్నాం. నాలుగు రోజుల అనంతరం తనిఖీల పరంపర వేగంగా కొనసాగుతుంది. సంబంధిత పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఇకపై సీరియ్‌సగా చర్యలు తీసుకునేందుకు రవాణా శాఖ నిర్ధారించింది. వాహనం కొన్న వెంటనే ఆయా షోరూమ్‌ల్లో రిజిస్ర్టేషన్‌ను పక్కాగా చేయించుకుంటేనే సుఖమైన ప్రయాణం చేయగలరు. ఇటీవల ప్రతీ వాహనానికి ఇన్సూరెన్స్‌ను ఐదేళ్ళకు పొడిగించడం వల్ల చాలా రకాల ఇబ్బందులు తొలగాయి. ప్రతీ వాహనదారుడు ఐదేళ్ళకు సరిపడ ఇన్సూరెన్స్ చేయించుకుంటే వాహనం ఎటువంటి ప్రమాదంలో ఇరుక్కున్నా ఇబ్బందులు ఉండవు. దీన్నిపై ప్రతీ ఒక్కరూ స్పందించవలసిన అవసరం ఉంది అని తెలిపారు భీమవరం రవాణా శాఖ ఇన్స్పెక్టర్ రవీంద్రనాథ్.

Post a Comment