యూట్యూబ్ లో దుమ్ము రేపుతున్న దేత్తడి - వారెవ్వా హారిక అలేఖ్య.!
ఎక్కడ చూసినా తెలంగాణ పదమే ఇనిపిస్తోంది. వివక్షకు లోనై ..స్వీయ అస్తిత్వంతో తనకంటూ ప్రపంచంలోనే ఓ బ్రాండ్‌ను ఏర్పాటు చేసుకున్న ఘనత ఈ ప్రాంతానిదే. ప్రింట్ అండ్ మీడియాలో ఓ ప్రాంతపు ఆధిపత్యానికి చెక్ పెడుతూ తెలంగాణ యాస, భాష జెట్ స్పీడ్ కంటే వేగంగా దూసుకెళుతోంది. సోషల్ మీడియా పుణ్యమా అని..డిజిటల్ మీడియా దెబ్బకు సామాన్యులు విజేతలుగా నిలుస్తున్నారు. తమ కలల ప్రపంచానికి మెరుగులు దిద్దుతూ ..ప్రతిభకు పదును పెడుతూ రోజు రోజుకు నయా ట్రెండ్స్‌కు శ్రీకారం చుడుతున్నారు. మా జిందగీ మా ఇష్టం అంటూ ఇండిపెండెంట్ గానే రికార్డులు తిరగ రాస్తున్నారు. ఒకప్పుడు ఏ యాసను పట్టించు కోకుండా అణగ దొక్కారో వారే ఇపుడు నెత్తిన పెట్టుకుని పూజిస్తున్నారు.
ఇగ చూస్కో..గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాం..ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం నిండా అచ్చమైన తెలంగాణ కనిపిస్తోంది..ఇంపుగా వినిపిస్తోంది..బేకార్ మాటలను బంద్ చేసి..స్వచ్ఛమైన పల్లెకు పట్టం కడుతూ మట్టి బిడ్డలు..తమ మాటలతో గారడీ చేస్తున్నరు. గాయబ్ కాకుండా చూస్తున్నరు..జనం ఒకే గొంతుకై జానపదమై దుమ్ము రేపుతున్నరు. ఆట పాటలతో ..గజ్జెల మోతలతో..గొంగళ్ల చప్పుళ్లతో..తప్పెట మోతళ్లతో దరువేస్తున్నరు. తెలంగాణ యువత యూట్యూబ్ లో సందడి చేస్తున్నరు.షార్ట్ ఫిల్స్, పాటలు, ఆటలు, డ్యాన్సులతో అదరహో అనిపిస్తున్నరు. లైక్‌లు, సబ్ స్క్రైబర్లు లక్షలు దాటి కోట్లకు చేరుకుంటున్నరు. ఇదంతా తమ క్రియేటివిటీని నమ్ముకున్న ఫలితం. వెబ్ సిరీస్, సీరియల్స్, లైఫ్, సంగీతం, ముచ్చట, జర్నీ, ఆట, పాటలతో ఇలా అనేకం ఇందులో వీడియోలు అప్ లోడ్ చేస్తున్నరు. తక్కువ ఖర్చు ఎక్కువ ఆదాయం..ఊహించని ప్రచారంతో సినిమా దిగ్గజాలు జడుసుకునేలా తమను తాము నిరూపించుకుంటున్నారు.
గిపుడు ఏ సినిమా చూసినా..ఏ ఛానల్ తిరగేసినా..అంతటా తెలంగాణ ముచ్చటే..ఏకంగా పేపర్లు, ఛానళ్లు తెలంగాణ, ఏపీ అంటూ ఏర్పాటు చేసుకున్నయి. ఇంకా ఆ వాసన పోకుండా కాపాడుకుంటున్నయి. అయినా మన కత, మన దుఖం ..మన సంతోషం..మన కల్లు..మన ముచ్చట..మన బాట..మన గొంతుక ..పల్లె ప్రజలను కదిలిస్తోంది. నిన్నటి దాకా కత్తి కార్తీక మన యాసతో ఆకట్టుకుంటే..ఏకంగా అచ్చమైన తెలంగాణ భాషతో హైదరాబాద్‌కు చెందిన హారిక అలేఖ్య ఎవరూ ఊహించని స్థాయికి చేరుకుంది. యూట్యూబ్ స్టార్‌గా వెలుగొందుతోంది.
బేసికల్ గా డ్యాన్సర్ అవ్వాలనుకున్న హారిక ఏకంగా తెలంగాణ పిల్లగా ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. దీని వెనుకాల పెద్ద కతుంది. ఏమన్ననా..అందం..అభినయం..మాట..ముచ్చట..అచ్చం మన ఇంట్ల పిల్లల్లాగానే మాట్లాడుతుంటే జనం ఫిదా అయిపోతుండ్రు..రోజుకు వేలాది మంది ఆమె వీడియాలను అప్ లోడ్ చేసుకుంటున్నరు. హారిక మొదట్లో తమద మీడియాలో అనుకోకుండా ఎంటర్ అయింది. అక్కడ ఈమె టాలెంట్‌ను గుర్తించి దెత్తడి పేరుతో ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. అదే యూట్యూబ్ చానల్ గా క్రియేట్ కావడం..ఏక కాలంలో వీడియో అప్ లోడ్ చేయడం..లక్షల్లో లైకులు, సబ్ స్క్రైబర్లు పెరగడం వీరిని ఆశ్చర్య పోయేలా చేశాయి. ఇంకేముంది..హారిక మోస్ట్ టాలెంటెడ్ స్టార్‌గా పేరు తెచ్చుకుంది. కోట్లల్లో అప్ లోడ్ అవుతున్నా...డిఫరెంట్ కాన్సెప్ట్..జనం మాట్లాడుకునే మాటలు..పరిస్థితులకు తగ్గట్టు కథ ఉండటం..నవ్వు..థింకింగ్ ..లోకల్ టాలెంట్..ఇవ్వన్నీ కలిసి దెత్తడి దూసుకెళుతోంది.
ఇప్పటి దాకా యూట్యూబ్‌లో పెళ్లి లొల్లి, హిమాయత్ నగర్ హారిక, నా న్యూస్ నా ఇష్టం నీకేం కష్టం, ఏంటి..? , పక్డో, ఫ్రస్టేట్ తెలంగాణ, ఎంబీబీస్ డాక్టర్ ఇలాంటి హెడ్ లైన్స్‌తో తయారు చేసిన వీడియోలు సంచలనం సృష్టిస్తున్నాయి. వీవర్స్‌ను నిద్ర పోనీయకుండా చేస్తున్నాయి. యువతీ యువకులు, పిల్లలు, పెద్దలు, ప్రోఫెషనల్స్ ఇలా అందరూ హారిక జపం చేస్తున్నారు..దెత్తడి వెనుక పెద్ద కతుంది..దీని క్రియేటర్స్ వెరీ డిఫరెంట్. రాహుల్ రాజ్ వనం. ఈ పేరు చెబితే చాలు కన్నీళ్లే కాదు అతడిలోని క్రియేటివిటీని మనల్ని కంట తడి పెట్టిస్తుంది. ప్రతి హాస్యం వెనుక దుఖఃం వుంటుందన్న చార్లీ చాప్లిన్ ను గుర్తుకు తెస్తాడు..ఇంకొకరు సి.పి.ఇమాన్యుల్ .. ఇతడిది పాలమూరు జిల్లా. వీరు ముగ్గురు చేసే సందడి అంతా ఇంతా కాదు.
స్టోరీలు రాయటమే కాదు వీళ్లే డైరెక్షన్, నటించడం అంతా వీరే..దీంతో దెత్తడి మోస్ట్ పాపులర్ ప్రోగ్రాం ఇన్ యూట్యూబ్‌లో వినుతికెక్కింది. రాహుల్ బేసికల్‌గా ఇంజనీర్. 16 ఏళ్లప్పుడు తల్లిదండ్రులను కోల్పోయాడు. ఎలాగో చదువుకుని కొలువు సంపాదించినా ఏదో ఫ్రస్టేషన్. 2012 వరకు కథలు రాసుకుంటూ పోయాడు..2018లో ఇలా దెత్తడితో ముందుకు వచ్చాడు. ఇక ఇమ్మాన్యుయల్ మోస్ట్ టాలెంటెడ్..రైటర్..యాక్టర్..వీరి క్రియేటివిటీకి..కసి తోడైంది..డ్యాన్సర్ కావాలనుకున్న హారిక జత కావడంతో జర్నీ మారిపోయింది. అదే దెత్తడిగా మారి తెలంగాణ బతుక్కి ఒక గుర్తింపును..ఆత్మ గౌరవాన్ని తెచ్చి పెట్టింది.
ఎన్ని సినిమాలు వచ్చినా..ఎన్ని సీరియల్స్ కాపురాల్ని ప్రభావితం చేసినా..యూట్యూబ్ మాత్రం కలలబేహారులకు.క్రియేటర్స్..డ్రీమర్స్‌కు స్వాగతం పలుకుతోంది..అపారమైన అవకాశాలను కల్పిస్తూ తలుపు తడుతోంది..అందులో రాహుల్, పీఎస్..హారికలు కూడా..వీళ్లు సృష్టించిన ఈ ట్రెండ్ వేలాది తెలంగాణ బిడ్డలకు స్ఫూర్తిని బలాన్ని కలగ చేస్తోంది. దయచేసి హారికను చూడండి..మనింటి అమ్మాయి, అందం, అభినయం, అమాయకత్వం, మాటకారితనం, మంచితనం, మొండి ఘటం..పెంకితనం..ముద్దులొలికే మాటల గారడీ. అన్నిటితో అలరిస్తోంది, ఏమన్ననా..హారిక..అదరగొడుతోంది..యాస..భాషతో ఆకట్టుకుంటోంది..నింగీ నేలా లఘు చిత్రంతో మనసుల్ని దోచేసింది..హారిక..ఇలాగే మాట్లాడుతూనే వుండాలి..నటిస్తూనే..మమ్మల్ని అలరిస్తూనే ఉండాలి.
Post a Comment