Header Ads

ఎందరో వ్యక్తులకు స్ఫూర్తినిచ్చిన చేగువేరా అసలు ఎవరు ఈ చేగువేరా.? ఎందుకు ఆయనకు అంతటిక్రేజ్..?

చేగువేరా చాలా మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు, చేగువేరా కుభారత దేశం లో చాలా ఫాలోయింగ్ ఉంది, ముఖ్యంగా యువత లో. కేవలం భారత దేశం లోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉంది. చేగువేరా సిద్ధాంతాలను అనుసరించే వారి సంఖ్యా ఎక్కువ.
అసలు ఎవరు ఈ చేగువేరా? ఎందుకు ఆయనకు అంతటి క్రేజ్.?

చేగువేరా అసలు పేరు ఎర్నెస్టో రాఫెల్ గురువే డేరాల సరేనా ఈయన జూన్ 14 1928లో అర్జెంటీనాలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు . ఆయన కి చిన్నతనంలోనే ఆస్తమా ఉండటంవల్ల ఊపిరి తీసుకునేందుకు ఆయన కొంచెం ఇబ్బంది పడే వాడు . చేగువేరా మొదటగా ఇంజనీరింగ్ లో చేరి అది నచ్చక ఆ తర్వాత మెడిసిన్ లో జాయిన్ అయ్యాడు . ఆ తర్వాత లాటిన్ అమెరికా మొత్తం ఒకసారి పర్యటించాలని నిర్ణయించుకున్నాడు . 1952లో తన స్నేహితుడితో ఒక స్కూటర్ పై లాటిన్ అమెరికా మొత్తం పర్యటించడానికి బయలుదేరి వెళ్లారు , ఇలా వారు ప్రయాణించిన కాలమే వారి జీవితంలో ఊహించని మలుపులు తెచ్చిపెట్టింది . లాటిన్ అమెరికాలోని గ్రామాలన్నీ కూడా కటిక పేదరికంలో ఉండేవి ఉత్తర అమెరికాలోని కొంతమంది బడా వ్యాపారులు ఈ లాటిన్ అమెరికాలోని గనుల లో ఉండే అఖండ సంపదని దోచుకుని అక్కడ కొన్ని ఫ్యాక్టరీల నిర్మించి ఆ ఫ్యాక్టరీలలో, అక్కడి గ్రామాల్లో ఉండే పేద ప్రజలను కూలీలుగా నియమించి వారి కష్టాన్ని దోచుకునేవారు. అలా లాటిన్ అమెరికా పర్యటనలో ఉన్న చేగువేరా ఇక్కడ జరిగే ఈ దారుణాన్ని చూసి చలించిపోయాడు. ఎలాగైనా వారి జీవితాల్లో వెలుగులు నింపాలని నిశ్చయించుకున్నాడు .


తొమ్మిది నెలల పాటు లాటిన్ అమెరికా మొత్తం పర్యటించి వెనక్కి వచ్చారు . 1953లో చేగువేరా తన మెడిసిన్ పూర్తి చేశాడు . ఆయన మొదటి నుండి విప్లవకారులు అనుకరిస్తూ వచ్చేవాడు అందుకేనేమో లాటిన్ అమెరికాలో దోచుకుంటున్న వారిని ఎదుర్కోవాలంటే తన మెడిసిన్ చదువు మాత్రమే పనికి రాదని విప్లవం ఒక్కటే దారి తెలుసుకున్నాడు . అతను చేయాలనుకున్న దాని గురించి వారి తల్లిదండ్రులకు చెప్పి లిబియాలో తన విప్లవం ప్రారంభించాలని అనుకున్నాడు కానీ అక్కడ నాయకత్వ లక్షణాలు లేకపోవడం వల్ల ఇంకో స్థావరానికి చేరుకున్నాడు . అక్కడ ఎంతో మంది విప్లవ నాయకులతో చేతులు కలిపి వారి దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు అక్కడే హెల్డా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . ఆ తర్వాత కొంతకాలానికి వారిద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు . ఆ తర్వాత మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు చేగువేరా . ఆ తరువాత క్యాస్ట్రో తో స్నేహం చేసి ,క్యాస్ట్రో తో కలిసి చేగువేరా క్యూబా చేరుకున్న తర్వాత వీరికి ప్రభుత్వానికి మధ్య విపరీతమైన యుద్ధం జరిగాయి . ఈ యుద్ధంలో అమెరికా కలుగజేసుకొని వీరిద్దరికి వ్యతిరేకంగా ఆ ప్రభుత్వానికి సహాయం చేసేది.విప్లవం జరుగుతున్న సమయంలోనే పేదలని మోసం చేస్తున్న వారిని వెతికి వెతికి చంపేవాడు . అందుకే దోపిడీదారులకు చేగువేరా వస్తున్నాడంటే గుండెల్లో వణుకు పుట్టేది ఆయనని ఎదురుగా వచ్చి ఎదుర్కొనే దమ్ము లేక పిరికి పందుల వలె చాటుగా వచ్చి ఆయనను పట్టుకొని జైల్లో బంధించారు . అయినా కూడా చేగువేరా కళ్ళలో కాసింత కూడా భయం అనేది కనిపించలేదు . దీనితో అక్కడ ఉండే సైనికులు చేగువేరా శరీరం లోకి 9 బుల్లెట్స్ దింపారు . దీనితో చేగువేరా అక్కడే కుప్పకూలిపోయాడు . ఆతరువాత అయన శవాన్ని కూడా ఎవరికీ తెలియకుండా పాతిపెట్టేశారు.

చేగువేరా ఒక్క లాటిన్ అమెరికా యువత కె కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువత కు ఆదర్శం.ఆయన ధైర్యం, ఒకరి కింద నీచంగా బ్రతకకూడదు అని అనుకోడం, స్వేచ్ఛగా జీవించాలి అనే ఆలోచనలు యువతకు ఆదర్శం అయ్యాయి. నిజాయితీగా ఒకరిని మోసం చేయకుండా బ్రతకాలి అని ఆయన బ్రతికున్నంత కాలం చెప్పారు.

No comments