Header Ads

ఇండియా విడిచి వెళ్ళిపో అని ఒక అభిమానికి ఘాటుగా సమాధానం ఇచ్చిన కోహ్లీ.!

నీ పెళ్ళి ఏమో ఇండియా లో చేసుకోలేదు, ఫారిన్ బ్రాండ్స్ ని ఇండియా లో ప్రమోట్ ఎందుకు చేస్తావ్ ?




నిన్నటి నుండి కోహ్లీ మీద ఒకటే కామెంట్స్ సోషల్ మీడియా లో, అసలు నెటిజన్స్ కోహ్లీ ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? 2018 నవంబరు 5 నాటికి 30వ సంవత్సరం లోకి అడుగుపెట్టిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ హరిద్వార్ ఆశ్రమంలో తన పుట్టినరోజు వేడుకలను భార్య అనుష్క శర్మ సమక్షంలో జరుపుకున్నాడు.ఈ సందర్భంగా కోహ్లి తన పేరుతో ఉన్న యాప్‌ను ప్రారంభించాడు. ఈ యాప్‌లో ఓ క్రికెట్‌ ప్రేమికుడు భారత క్రికెటర్లపై కామెంట్లు చేశాడు. ‘కోహ్లి ఆటలో ప్రత్యేకత ఏం లేదు. ఇలాంటి ఇండియన్‌ క్రికెటర్ల కన్నా ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా క్రికెటర్ల ఆటతీరే నాకు ఎంతో ఇష్టం’ అని కోహ్లీ యాప్‌లో కామెంట్ చేశాడు.

దీనితో మన కోహ్లీ కి ఎక్కడ లేని కోపం వచ్చింది, సామాన్యం గా సెలెబ్రిటీలు ఇలాంటి కామెంట్స్ ని చూసి చూడనట్టు వదిలేస్తారు, కానీ కోహ్లీ ఈ కామెంట్ కి చాలా ఘాటుగా సమాధానం ఇచ్చాడు...'నువ్వు భారత్‌లో ఉండాల్సినవాడివి కాదు. ఇంగ్లండ్ లేదా ఆస్ట్రేలియాలు మాత్రమే నీకు సరైనవి. దేశం విడిచి వెళ్లిపో. ఈ దేశంలో ఉంటూ పరదేశాలపై ప్రేమ చాలానే ఉంది. నీవు నన్ను అభిమానించనంత మాత్రాన నాకేం ఒరగదు. నీకు ఈ దేశం సరైంది కాదు’ అని కోహ్లీ బదులిచ్చాడు.

అయితే ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అయ్యింది, ప్రతి ఒక్కరు కోహ్లీ ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, ఇంతటి అహంకారామ్ మంచిది కాదని, నువ్వు ఎన్ని రికార్డ్స్ సృష్టించిన సచిన్ ని అధిగమించలేవు అని కామెంట్ ల వర్షం కురిపిస్తున్నారు, సచిన్, ద్రావిడ్, లష్మణ్ లాగా అనుకువగా ఉండటం నేర్చుకో, ఇండియన్ లెజెండరీ క్రికెటర్స్ కూడా ఈ రేంజ్ లో ఎప్పుడు కామెంట్ చేయలేదు, ముందు నీ పని నువ్వు సక్రమంగా చుస్కో అని ట్విట్టర్,ఫేస్బుక్ మొదలగు సోషల్ మీడియా యాప్స్ మరియు సైట్స్ లో కోహ్లీ ని ట్రోల్ చేస్తున్నారు.

Tweet:

https://twitter.com/Anirudh_d_jack/status/1060051663384383488

No comments