Header Ads

టాక్సీవాలా చిత్రం లో నటించడానికి పడిన తిప్పల గురుంచి చెప్పిన ప్రియాంక...అసలు టాక్సీవాలా ఛాన్స్ ఎలావచ్చింది అంటే.?

‘టాక్సీవాలా’ చిత్రం లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించింది ప్రియాంక జవాల్కర్. ఈ నెల 17 న రిలీజవుతున్న ఈ సినిమాతో టాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అవుతుంది. అనంతపురంలో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి మోడల్‌గా ఎదిగి ఇప్పుడు నటిగా మారింది. టాక్సీవాలా చిత్రం లో హీరోయిన్ గా నటించిన ప్రియాంక జవాల్కర్ కి ఇది మొదటి సినిమా. ఇంతకు ముందు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది ప్రియాంక, ప్రియాంక నటించిన పొసెసివ్‌నెస్ అనే షార్ట్ ఫిలిం బాగా పాపులర్ అయ్యింది. ప్రియాంక అనంతపురంలోనే కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసింది. అనంతరం హైదరాబాద్‌లో ఫ్యాసన్ క్లాతింగ్ అండ్ టెక్నాలజీ కోర్సు చేసింది. ‘టాక్సీవాలా’లో తన కాస్ట్యూమ్స్‌ను ప్రియాంకనే డిజైన్ చేసుకుంది.




టాక్సీవాలా రిలీజ్ సందర్బంగా ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ:

నేను మ‌రాఠీ అమ్మాయిని. కానీ ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకున్నాను. 5 ఇయర్స్ బ్యాక్ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశా. అక్కణ్ణించే నా యాక్టింగ్ కరియర్ బిగిన్ అయింది.నేను కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్ ని. ఆ తరవాత హైదరాబాద్ కి వచ్చి నిఫ్ట్ లో ఫ్యాషన్ క్లాతింగ్ అండ్ టెక్నాలజీ డిప్లొమా చేశా. ఈ కోర్స్ చేసే టైమ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేశా.టాక్సీవాలా చాన్స్ వచ్చిన తరవాత కూడా ఇంట్లో చెప్పలేదు.

ఇంత గొప్ప ఆఫర్, అందరికీ చెప్పుకున్నాక మధ్యలో నేను నచ్చక తీసేస్తే, మళ్ళీ బావుండదు అని. కొన్ని రోజుల తరవాత, ఇంకా నన్ను తీసేయరు అని నమ్మకం కుదిరాక చెప్పా. నేను 2016లో యాక్టింగ్ క్లాసెస్ స్టార్ట్ చేశాను బిక్షుగారి ద‌గ్గ‌ర‌. బిక్షుగారు, వాళ్ళ వైఫ్ వాళ్ళు యాక్టింగ్ ఇంట్లోనే నేర్పించేవారు, వాళ్ళ ద‌గ్గ‌రే నేర్చుకున్నాను. నాలుగు నెల‌లు కోచింగ్ తీసుకున్న త‌ర్వాత నా ఫోటోస్ ని గీతాఆర్ట్స్‌కి పంపించాను. వాళ్ళు న‌న్ను పిలిపించి ఆడిష‌న్ ఇవ్వండి అన్నారు. ఆడిష‌న్ ఇచ్చాక నన్ను ఈ సినిమాకి ఎంపిక చేశారు.
షార్ట్ ఫిల్మ్స్ చేశాను. అవి చేసి ఐదు ఏళ్ళు అవుతుంది. అందులో పొసెసివ్‌నెస్ అనే షార్ట్ ఫిల్మ్ బాగా వైర‌ల్ అయింది. ఎం.ఆర్ ప్రొడ‌క్ష‌న్‌లో చేశాను.

చిన్న‌ప్ప‌టినుంచి యాక్టింగ్ అంటే ఇష్టం. నేను ఇంజ‌నీరింగ్ ఫైన‌లియ‌ర్ చేస్తున్న‌ప్పుడు షార్ట్ ఫిల్మ్స్ వస్తే చేశాను. ఇక సినిమా గురించి మాట్లాడుతూ..సినిమాలో నా పేరు అనూ. జూనియర్ డాక్టర్ లా నటించాను. హీరో క్యాబ్ డ్రైవర్ కాబట్టి క్యాబ్ లో పరిచయం, అక్కణ్ణించి హీరోతో పాటు స్టోరీలో ట్రావెల్ ఉంటుంది....అని చెప్పుకొచ్చింది ఈ ముద్దు గుమ్మ.

No comments