Header Ads

భేష‌జాల‌కు తావివ్వ‌ని ఐఏఎస్..!


 • పేరుకే ఐఏఎస్ లు ..వీరిలో కొంద‌రు మాత్రం ప్ర‌జ‌ల‌కు ఆప్తులు. ఎన్నో ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని లెక్క‌కు

 • మించిన ఆస్తుల‌ను కూడ‌గ‌ట్టుకుని జ‌నానికి దూరంగా అధికారం చెలాయించే వాళ్లు ఎంద‌రో ఈ దేశంలో ఉన్నారు. అయితే వీరికి భిన్నంగా

 • ప్ర‌జా సేవ‌కే ప‌రిమిత‌మై వృత్తి ధ‌ర్మాన్ని నిర్వ‌ర్తిస్తున్న వారున్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ఐఏఎస్ గా ఎన్నో సేవ‌లు అందించిన వారిలో వ‌లేవాన్‌,

 • కొప్పుల రాజు, అనంత‌రాముతో పాటు అనిల్ కుమార్ సింఘాల్ ను ప్ర‌త్యేకంగా ఇక్క‌డ ప్ర‌స్తావించ‌క త‌ప్ప‌దు. ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా గ‌ద్వాల‌

 • స‌బ్ క‌లెక్ట‌ర్‌గా అనిల్ కుమార్ సింఘాల్ వ‌చ్చారు. అప్పుడు నేను ఆయ‌న‌ను క‌లిశా. వార్త దిన‌ప‌త్రికను ఆయ‌నతో ప్రారంభింప చేశాము. రాజ‌కీయ‌

 • వ‌త్తిళ్ల‌కు ఆయ‌న త‌లొగ్గ‌లేదు. ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉన్నారు. జ‌నం కోస‌మే ఆయ‌న విధులు నిర్వ‌హించారు. ఆ త‌ర్వాత ప‌దోన్న‌తిపై క‌లెక్ట‌ర్‌గా కృష్ణా జిల్లా, విశాఖ జిల్లాతో పాటు ప్ర‌స్తుత తెలంగాణ రాష్ట్రంలోని మెద‌క్ జిల్లాకు క‌లెక్ట‌ర్‌గా సింఘాల్ స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేశారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను

 • ప‌రిష్క‌రించ‌డంలో ఆయ‌న త‌న వంతు కృషి చేశారు. ఎలాంటి హంగు ఆర్భాటాల‌కు తావివ్వ‌కుండా, ఎలాంటి భేష‌జాలు ప్ర‌ద‌ర్శించ‌కుండా ముక్కు

 • సూటిగా వ్య‌వ‌హ‌రించారు. నిజాయితీ, నిబ‌ద్ధ‌త‌తో జ‌న హృద‌యాల‌ను ఆయ‌న దోచుకున్నారు. ఎప్పుడూ ప్ర‌జ‌ల‌కు ఏం చేయ‌వ‌చ్చో ఆలోచించే

 • అతి కొద్దిమంది ఐఏఎస్ అధికారుల్లో అనంత‌రాముతో పాటు అనిల్ కుమార్ సింఘాల్ ఒక‌రు. ఢిల్లీలో ఏపీ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ గా ఆయ‌న విదులు స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హించారు. సింఘాల్ చేసిన సేవ‌ల‌కు గుర్తింపుతో పాటు ఆయ‌నకు వృత్తి ప‌ట్ల ఉన్న నిబ‌ద్ధ‌త‌ను గ‌మ‌నించిన ఏపీ సీఎం ఎన్ని

 • వ‌త్తిళ్లు వ‌చ్చినా ప‌ట్టించు కోకుండా టీటీడీ ఈఓగా సింఘాల‌ను నియ‌మించారు. కొంద‌రు ఆయ‌న రాక‌ను జీర్ణించుకోలేక పోతున్నారు. గాడి త‌ప్పిన టీటీడీ అడ్డ‌గోలు వ్య‌వ‌స్థ‌కు స‌రైన చికిత్స చేయాలంటే సింఘాల్ లాంటి స‌మ‌ర్థ‌వంత‌మైన అధికారి ఒక‌రు ఉండాలి. వ్య‌క్తిగ‌తంగా సింఘాల్

 • ప‌నితీరును గ‌మ‌నించిన వ్య‌క్తిగా, జ‌ర్న‌లిస్ట్‌గా ఆయ‌నకు ఆ ప‌ద‌వి ఇవ్వ‌డం స‌రైన‌దేన‌ని భావిస్తున్నా. ఎక్క‌డున్నా నిక్క‌చ్చిగా ..నిజాయితీగా
  వ్య‌వ‌హ‌రించ‌ట‌మే కాదు అక్ర‌మార్కులకు దడ పుట్టించ‌డంలో ఆయ‌న దిట్ట‌. ఇక ..టీటీడీని ర‌క్షించ‌డ‌మే.


పార‌ద‌ర్శ‌క‌త‌కు పెద్ద పీట వేశారు సింఘాల్‌. టీటీడీ ఈఓగా ఆయ‌న త‌న విధుల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హిస్తున్నారు. సీఎం త‌న‌పై ఉంచిన న‌మ్మ‌కాన్ని వ‌మ్ము చేయ‌కుండా ..ఎన్నో అడ్డంకుల‌ను దాటుకుని..ఆరోప‌ణ‌ల‌ను ..విమ‌ర్శ‌న‌ల‌ను త‌ట్టుకుని త‌న మానాన ..మౌనంగా ప‌ని చేసుకుంటూ వెళుతున్నారు. ఇక్క‌డికి రావ‌డ‌మే గొప్ప‌. ఇదంతా పూర్వ జ‌న్మ సుకృతం త‌ప్ప మ‌రోటి కాదంటారు. భ‌క్తుల‌కు సేవ చేయ‌డం సాక్షాత్తు శ్రీ వేంక‌టేశ్వ‌రుడు ఇచ్చిన మ‌హ‌దావ‌కాశం ..ఇంత‌కంటే ఏం చెప్ప‌గ‌ల‌ను..ఎన్నో ఏళ్లుగా నిరీక్షించిన క‌ల నిజ‌మైంది. వాస్త‌వ రూపం దాల్చింది. చాలా మంది సీనియ‌ర్లు వున్నారు. నాకంటే అనుభ‌వం క‌లిగిన ఐఏఎస్‌లు , ఏపీఎస్‌లు ఉన్నారు. వారంద‌రికి ద‌క్క‌ని గౌర‌వం నాకు ద‌క్కింది..ఇంత‌కంటే ఇంకేం మాట్లాడ‌లేను. నా జీవితంలో ఒకే ఒక్క కోరిక ఉండేది. అదే స్వామి వారి కృప‌కు నోచుకోవ‌డం..ఈఓ రూప‌కంగా ద‌క్కింది. అందుకే ప్ర‌తి ఒక్క భ‌క్తుడికి ద‌ర్శ‌నం క‌ల్పించేందుకు శ‌త‌విధాలుగా ప్ర‌య‌త్నం చేస్తున్నా. అక్క‌డ‌క్క‌డా పొర‌పాట్లు జ‌రుగుతుండ‌వ‌చ్చు. కాద‌న‌లేం..కానీ బాధ్య‌తాయుతంగా విధులు మాత్రం నిర్వ‌హిస్తూ వెళుతున్నాం. అంతా ఏడుకొండ‌లు..అమ్మ వారి ద‌య‌..నాదేం లేదంటున్నారు అనిల్ కుమార్ సింఘాల్‌.

No comments