అల్లం టీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలిస్తే తప్పకుండ రోజు తాగుతారు.?
సీజన్ మారినప్పుడు చాలా మంది జలుబు, గొంతునొప్పి, అజీర్తి వంటి రోగాలతో సతమతమవుతూ ఉంటారు. ఇలాంటి సమస్యలకు అల్లం టీతో చెక్ పెట్టవచ్చు. రోజుకు రెండేసి కప్పుల అల్లం టీ త్రాగడం వాళ్ళ మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి, అల్లం టీ తాగితే శ్వాసకోశం పనితీరు మెరుగవుతుంది. బీపీ కూడా బాగా తగ్గుతుంది. ఇంకా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు అల్లం టీ తాగడం వల్ల కలుగుతాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న అల్లం టీని మన ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.
- అల్లం టీ తయారీకి కావల్సిన పదార్థాలు.
- సన్నగా తరిగిన అల్లం ముక్కలు - 1 టీస్పూన్
- టీ పొడి - 1 టీస్పూన్ (ఒక కప్పుకు)
- నీళ్లు - 3 కప్పులు
- తేనె - 1 టీస్పూన్
- నిమ్మ రసం - 1 టీస్పూన్
- పాలు - అర కప్పు (సరిపడినంత)
- తయారీ విధానం..
- పాత్రలో 3 కప్పుల నీటిని తీసుకోవాలి. అందులో అల్లం ముక్కలను వేసి మరిగించాలి.
- నీరు బాగా మరిగాక అందులో టీ పొడి, పాలు, తేనె వేయాలి.
- స్టవ్‌ను తక్కువ మంటలో ఉంచి 3-4 నిమిషాల పాటు మరిగించాలి.
- తర్వాత దానికి నిమ్మరసం కలపాలి.
- అంతే.. ఇక అల్లం టీ తయారైనట్లే.
- వేడివేడిగా అల్లం టీ తాగితే.. ఇక ఎలాంటి అనారోగ్య సమస్యలు దరికిచేరవు.
పిల్లలకు రోజుకి ఒక సరి లేదా రెండు సార్లు తాపండి..పెద్ద వాళ్ళు పొద్దున సాయంకాలం త్రాగండి
Post a Comment