Header Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త థియేటర్ ఓపెనింగ్ కి సూపర్ స్టార్ రజినీకాంత్ రానున్నాడు?

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఆసియన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఏ.ఏం.బి సినిమాస్ హైదరాబాద్ లోని గచ్చిబౌలి లో నిర్మించారు. సూపర్ స్టార్ రజిని కాంత్, ఏ.ఏం.బి మల్టీప్లెక్స్ ఓపెనింగ్ కి వస్తాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ మల్టీప్లెక్స్ ని రోబో 2.0 సినిమా తో ప్రారంభించనున్నారని సమాచారం. తగ్స్ ఆఫ్ హిందుస్తాన్ మూవీ తోనే ఈ మల్టీప్లెక్స్ ఓపెన్ అవ్వాల్సి ఉండే. కానీ అనుకోని కారణాల వాళ్ళ వాయిదా వేయాల్సి వచ్చింది.




3D చిత్రం అయిన 2.0 అయితే కరెక్ట్ గా ఉంటుందని ఆ చిత్రం తో మల్టీప్లెక్స్ ని ఓపెన్ చేయాలి అనుకుంటున్నారు. ఐటీ కారిడార్ గా పేరు ఉన్న గచ్చిబౌలి లో ఏ.ఏం.బి సినిమాస్ ఉండటం వల్ల మల్టీప్లెక్స్ రెవిన్యూ బాగుంటుందని నమ్ముతున్నారు. ఏడు స్క్రీన్లు, 1600 సీట్లు ఈ మ‌ల్టీప్లెక్స్ ప్ర‌త్యేకత‌. ల‌గ్జ‌రీ క్లాస్ కూడా ఉంటుంది. ప్రీమియం లుక్ ఇచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అధునాతన టెక్నాలజీ తో హైదరాబాద్ లోనే ఒక పెద్ద మరియు గొప్ప మల్టీప్లెక్స్ గా మిగిలిపోనుంది.


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి చిత్రం షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న మహర్షి చిత్రం లో పూజ హెగ్డే మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది, ముఖ్య పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 2019 ఉగాది పండుగ కానుకగా ఏప్రిల్ 5 వ తారీఖున రిలీజ్ చేయనున్నట్టు నిర్మాత దిల్ రాజు ప్రకటించాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు కి మహర్షి సినిమా 25 వ చిత్రం కావడం విశేషం.


1 comment: