Header Ads

గురుత్వాకర్షణ సిద్ధాంతం కనుగొన్నది ఎవ్వరు .? గురుత్వాకర్షణ సిద్ధాంతం తెలుసుకోవడంలో భారతదేశంలోఏమైనా అధరాలు ఉన్నాయా .?

గురుత్వాకర్షణ సిద్ధాంతం ( Law of Gravitation) కనుగొన్నది న్యుటనా!? ఇది పూర్తిగా అసత్యం ఎందుకంటే ప్రాచీన భారతీయ గ్రంధాల నిండా గురుత్వాకర్షణ సిద్దాంతం గురించి ప్రస్తావించబడి వుంది.
1) “సూర్య సిద్దాంత” మనే ప్రాచీన గ్రంధంలో ఇలా చెప్పబడింది. “ధారణాత్మక శక్తి కారణంగా భూమి ఆకాశంలో పడిపోకుండా నిలబడుతున్నది
(సూ.సి. 12 అ – 32 శ్లోII)
శ్లో II మధ్యే సమన్తదన్నస్య భూగోళో వ్యోమ్ని తిష్టతిI
బీభ్రాణః పరమాం శక్తిం బ్రాహ్మణో ధారణాత్మికామ్II

2) వరాహమిహురుడు (క్రీ.శ. 505) తన “పంచ సిద్ధాంతి” అనే గ్రంధంలో గురుత్వాకర్షణ శక్తి గురించి – “భుతలంలోని ఏ భాగంలో అయిన .. అన్ని జ్వాలలు పైకేగుస్తాయి.. పైకి వేసిన వస్తువు కింద పడుతుంది. ఈ అనుభవం అందరికి తెలిసినదే. సమానమైనదే” అని అంటాడు. (పం.సి. 13 అ – శ్లోII)
శ్లోII గగనము పైతి శిభిశిఖ క్షిప్తమపి క్షితముపితి గురు కించిత్I
యధ్వదిహ మానవానాం అసురానం తద్వాదేవాజ్ఘః II

3) “లీలావతి” అనే గ్రంధంలో “భువనకోశం” అనే సర్గలో భాస్కరాచార్యుడు (క్రీ.శ. 1114) తన పుత్రిక లీలావతికి “భూమి గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉంది. ఖగోళంలో గ్రహాల పరస్పర ఆకర్షణ శక్తి వల్లా అవి అక్కడ తమకు తామే ఆధారభూతమై నిలిచి ఉన్నాయని” చక్కగా వివరించారు.

4) “సిద్దాంత శిరోమణి” (భాస్కరాచారుడు) అనే గ్రంధంలో “భువనకోశం” అనే అధ్యాయంలో 6వ శ్లోకంలో గురుత్వాకర్షణ శక్తి గురించి చాలా చక్కగా వివరించారు.
శ్లోII ఆకృష్టిశక్తిశ్చ మహితయా యత్ స్వస్థం/గురు స్వాభిముఖం స్వశక్త్యా
ఆకృష్యతే తత్పతతీవభాతి/సమే సమన్తాత్ క్వ పతత్వియం ఖేII
భూమి ఆకాశంలో ఉన్న వస్తువులను సహజంగా, స్వశక్తితో .. తన వైపునకు ఆకర్షిస్తుంది. ఈ ఆకర్షణ వలన అన్ని వస్తువులు భూమిమీద పడతాయి. ఆకాశంలోని వివిధ గ్రహాల మధ్య సమాన ఆకర్షణ శక్తి ఉన్నప్పుడు అవి ఎక్కడ పడతాయి.

5) బ్రహ్మగుప్తుడు (క్రీ.శ. 591) రచించిన “బ్రహ్మాస్పుఠ సిద్ధాంతం” లో “వస్తువులు భూమి వైపు ఆకర్షింప బడతాయి. నీటికి ఎలా సహజ ప్రవాహశక్తి ఉన్నదో, అలా భూమికి సహజమైన ఆకర్షణ శక్తి ఉంది అని చెప్పారు.

6) జగద్గురువు అదిశంకరుల వారు వారి “ప్రశ్నోపనిషత్” భాష్యంలో “అపాన” శక్తి గురించి రాస్తూ .. “ఒక వస్తువును పైకి ఎగురవేస్తే దానిని ఎట్లు భూమి ఆకర్షిస్తుందో ... అటులనే పైకి లాగబడే “ప్రాణ” శక్తిని “అపాన” శక్తి కిందకు కిందకు లాగుతుంది.
(3-8 శ్లోII) అని చెప్పారు.
శ్లోII తధా పృధివ్యామభిమానినీ యా దేవతా ప్రసిద్ధా సైషా
పురుషస్య అపానవృత్తిమవష్టభ్యాకృష్య వశీకృత్యాధ ఏవ
అపకర్షేణ హి శరీరం గురుత్వాత్ పతేత్ సావకాశే వోద్గాచ్చేత్II”
ఆ తరవాతి భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞుల గ్రంధాలలో కూడా “గురుత్వాకర్షణ” సిద్ధాంతం వివరింపబడి ఉంది. న్యుటను ఎన్నో వేల, వందల సంవత్సరాల పూర్వమే “గురుత్వాకర్షణ” గురించి భారతీయ విజ్ఞానం ఘోషించింది.

ఇంతటి విశిష్టమైన భారతీయ గొప్పతనాన్ని “జజన విజ్ఞాన” సంఘం అంటూ చైనా శక్తులు భారతీయ విద్య విధానం ఒక బూటకం అంటూ నిందలు వేస్తున్న తిరు చూస్తుంటే “సొంత తల్లి ప్రేమని హరికల క్రింద పెట్టి సవతి తల్లి దొంగ ప్రేమను ప్రపంచానికి చెప్తునట్లు ఉంది” ఏది ఏమైనా గురుత్వాకర్షణ శక్తి కోసం కొన్నిటినే ఇక్కడ చెప్పా గలిగాను వాస్తవానికి “వేద”లలో చాల చోట్ల గురుత్వాకర్షణ శక్తి కోసం వివరించి చెప్పడం జరిగింది. ఇది భారతీయులు సాధించిన విజయం.. మన పూర్వ గ్రంధాలను దోచుకువెల్లి ఆ గ్రంధాలపై విశ్లేషణ జరిపి విదేశాలలో చాల మంది మేమే గురుత్వాకర్షణ శక్తి కోసం కనిపెట్టి వివరించాము అని చెప్పుకోవడం హాస్యాస్పదం ..
భారతదేశంలో పుట్టినందుకు గర్వించు భారతీయునిగా జీవిస్తునందుకు అనంధపాడు.

భారయులు భారతీయులు చేసిన ఘనతను కోసం చెప్పుకోవడానికి ఇంకెంత కలం దూరంగా ఉంటాము .? ఈసారి ఎవ్వరైనా గురుత్వాకర్షణ శక్తి కోసం అడిగితే గర్వగా చెప్పండి "“సూర్య సిద్దాంత” “పంచ సిద్ధాంతి” “లీలావతి” “సిద్దాంత శిరోమణి” “బ్రహ్మాస్పుఠ సిద్ధాంతం” “ప్రశ్నోపనిషత్” మా పూర్వికులు ఆ గురుత్వాకర్షణ శక్తి కోసం సరైన విశ్లేషణ ఇచ్చారు .. అంతకు మించిన సమాచారం ఈ ప్రపంచంలో ఇంకెవ్వరు నేటికి ఇవ్వలేక పోయారు అని .

No comments