Header Ads

చేతిలో అండర్వేర్ ను ప్రదర్శిస్తూ పార్లమెంట్లో ప్రసంగించిన మహిళా ఎంపీ.!!

మహిళల హక్కుల కోసం ఏ రకంగా పోటీ చేస్తారో అందరికి తెలుసు, ఒక మహిళా కు అన్యాయం జరిగిన్నదంటే సాటి మహిళలు ఆ అన్యాయాన్ని చూసి సహించరు, తిరగ బడతారు, ప్రశ్నిస్తారు, నిలదీస్తారు. అలా నిలదీస్తేనే సమాజం బాగుపడుద్ది.ఐర్లాండ్ లో ఒక వ్యక్తి. 17 ఏళ్ళ మైనర్ అమ్మాయిని రేప్ చేసాడు, రేప్ చేసిన వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ అతన్ని విడుదల చేసిన న్యాయస్ధానం. అమ్మాయి ని రేప్ చేసిన వ్యక్తి వైపు వాదించిన న్యాయవాది, అమ్మాయి వేసుకున్న దుస్తుల వల్లే ఆ అమ్మాయి రేప్ కి గురి కాబడింది, ఆమె వేసుకున్న అండర్ వేర్ వల్ల, దుస్తుల వల్ల ఆమె రేప్ కి కాబడింది అంటూ ఆ న్యాయవాది చేసిన కామెంట్స్ సంచలనమయ్యాయి, ఆ న్యాయవాది వాదనలు అమ్మాయి ని రేప్ చేసిన వ్యక్తి ని నిర్దోషిగా ప్రకటించింది న్యాయస్ధానం. ఐర్లాండ్ దేశవ్యాప్తంగా న్యాయ వ్యవస్థపై ప్రజలు తీవ్ర నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే మహిళా ఎంపి రూత్ తమ దేశ న్యాయ‌వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ పార్లమెంట్ లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మహిళలు ధరించే అండ‌ర్‌వేర్‌ను మిగతా ఎంపీలకు చూపిస్తూ కోపాన్ని ప్ర‌ద‌ర్శించారు. అత్యాచారం జరిగిన సమయంలో బాధితురాలు వేసుకున్న ఇలాంటి అండ‌ర్‌వేరే అంటూ నిరసన వ్యక్తం చేశారు. మహిళల దుస్థితిని వివరించడానికి ఎంపీ ఏకంగా మహిళలు ధరించే లోదుస్తులను తీసుకుని పార్లమెంట్ కు వెళ్లారు. వాటిని చూపిస్తూ పార్లమెంట్ సాక్షిగా ప్రస్తుతం మహిళల సమస్యలపై ప్రసంగించారు.


No comments