Header Ads

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ హోటల్ లో ఎలాంటి ఆఫర్ పెట్టారో చూస్తే షాక్ కు గురవుతారు.?

రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఎన్నికల్లో నిలబడే స్వతంత్ర అభ్యర్థులు ఓట్ల కోసం విన్నూతంగా ప్రచారం చేస్తారు, కానీ కొందరు వ్యాపార వేత్తలు, మీరు ఓటు వేసి వస్తే మీకు ఫ్రీ/డిస్కౌంట్ అని ఆఫర్స్ పెడుతున్నారు. అర్ధం కాలేదా?




"మీ ఓటుకు లెక్క ఉంది. మీ ఓటు మార్కు చూపించి, మా వద్ద రెండు రోజుల పాటు 10 శాతం డిస్కౌంట్ పొందండి". అని మధ్యప్రదేశ్ లోని ఒక ఊరి రెస్టారెంటు ముందు బోర్డు పెట్టాడు ఆ రెస్టవురెంట్ ఓనర్, ఇప్పటివరకు ఇలాంటిది మనం ముందెప్పుడూ చూసి ఉండకపోవచ్చు, ఓటు హక్కున్న జనాలని ప్రోత్సహించడానికి ఇదంతా అని రెస్టవురెంట్ ఓనర్ తెలిపారు, మధ్యప్రదేశ్ లూనీ ఒక ఊరి లో బార్బర్ షాపు నడుపుతున్న సతీశ్ చౌహాన్ అనే వ్యక్తి కూడా
కొత్త పద్దతి లో ఓటర్లను ప్రోత్సహిస్తున్నాడు. మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నేడు ఓటు వేసిన వారికి తన షాపులో నేడు ఉచిత సేవలు అందిస్తా అని తెలిపాడు, ఇలా చేస్తే నష్టం వస్తుంది కదా అని అడిగితే, మన దేశం ప్రగతి మార్గంలో పయనించాలి, అదే నా అసలు లక్ష్యం, దాని ముందు ఈ ఒక్క రోజు సంపాదన ముఖ్యం కాదు అని తెలిపారు.

ప్రజలు తమ ఓటు హక్కు ని సరిగ్గా వాడుకోవాలని, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు, ఎన్నికల్లో పాల్గొనాలని ఇలాంటివి చేస్తూ ఉంటారు కొందరు, మనం ఎన్నుకొనే నాయకులే మన భవిష్యత్తు, మన నీడ మన వెంట ఎప్పుడు ఏ రకంగా ఉంటుందో, మనం ఎన్నుకొనే నాయకుడు కూడా మన సమస్యలు ఎప్పటికప్పుడు తీర్చే వాడు అవ్వాలి, ఒక్క మాట లో చెప్పాలి అంటే, ప్రజల నీడ ప్రజా ప్రతినిధులు అవ్వాలి. తెలంగాణ ఎన్నికలు దేగ్గర్లోనె ఉన్నాయ్, ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు అభ్యర్థులు, త్వరలోనే ఆంధ్ర రాష్ట్రం లో కూడా ఎన్నికలు రానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.

No comments