Header Ads

సోషల్ మీడియాని ఊపేస్తున్న రణ్‌వీర్ సింగ్, దీపికా పడుకొనెల పెళ్లి ఫోటోలు.!

భారత దేశం అంతటా ఇప్పుడు హాట్ టాపిక్ రణ్‌వీర్ సింగ్, దీపికా పడుకొనెల పెళ్లి కార్యక్రమమే . రణ్‌వీర్ సింగ్, దీపికా పడుకొనె ఎప్పటి నుండో ప్రేమించుకుంటున్నారు, 2013లో ‘రామ్ లీలా’ చిత్రంలో నటించిన ఈ ప్రేమజంట ఐదేళ్ల ప్రేమ ప్రయాణం అనంతరం 2018 నవంబర్ 14 పెళ్లితో ఒక్కటయ్యారు.




బుధవారం నాడు వీరిద్దరు ఇటలీలోని లేక్ కొమోలో కొంకణి పద్దతిలో పెళ్లి చేసుకున్నారు. నేడు సింధీ సాంప్రదాయంలో వివాహం కానుంది. 14 నవంబర్ 2013న రామ్ లీలా సినిమా విడుదలైంది. సరిగ్గా అదే తేదీన వీరి పెళ్లి జరిగిడం విశేషం. ఈ జంట ఇప్పుడు వీర్‌దీప్‌గా మారారు. ప్రస్తుతం ఈ జంట హ్యాష్ ట్యాగ్ టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా కొత్త జంటకు శుభాకాంక్షలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో సందట్లో సడేమియా అన్నట్టు ‘డ్యూరెక్స్’  కండోమ్ కంపెనీ శుభాకాంక్షలు చెబుతూనే తన పబ్లిసిటీ పబ్బం గడుపుకుంటోంది. డబుల్ మీనింగ్‌లో, రొమాంటిక్, సెటైరికల్ డైలాగులతో శుభాకాంక్షలు చెప్పింది. ‘దీపిక, రణవీర్లకు అధికారికంగా రింగ్ తొడుగుతున్నందుకు కంగ్రాట్స్’ అంటూ డ్యూరెక్స్ కండోమ్‌ని పెట్టి ట్వీట్ చేసింది. కాగా, ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. నెటిజన్లు దీనిమీద సెటైర్లు విసురుతున్నారు.


అయితే డ్యూరెక్స్ కండోమ్ కంపెనీకి రణ్‌వీర్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. గతంలో అనుష్కా శర్మ, విరాట్ కోహ్లీ జంటకు కూడా డ్యూరెక్స్ కంపెనీ శుభాకాంక్షలు చెప్పింది. ఇదిలా వుంటే అమూల్ పాల ఉత్పత్తుల కంపెనీ కూడా ఈ జంటకు తమదైన శైలిలో శుభాకాంక్షలు చెప్పింది.


ఇంతకు ముందు ఓ కండోమ్ కంపెనీ బిపాషా బసు, కరణ్ సింగ్ గ్రోవర్ జంటను పెట్టి కండోమ్ యాడ్ చేయించారు. ఆ బాటలో డ్యూరెక్స్ కూడా ఇప్పటినుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నట్టే వుంది. . ప్రపంచ నేతలు అందరూ ఒకచోట కలుస్తున్నప్పుడు వారికి ఎంత భారీ స్థాయిలో భద్రత కల్పిస్తారో అదే స్థాయిలో దీప్‌వీర్‌కి భద్రత కల్పించారు. అయితే తాజా సమాచారం ప్రకారం పెళ్లికి వచ్చే అతిథులు ఎలాంటి బహుమతులు తేకూడదని, ఒకవేళ కానుకలు ఇవ్వాలనుకుంటే దీపిక స్థాపించిన ‘లివ్‌, లవ్‌, లాఫ్’ స్వచ్చంద సంస్థకు దానం చేయాలని చెప్పారట. ఈ విషయాన్ని దీపిక సన్నిహితులు మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ 'సింబా' అనే చిత్రం లో నటిస్తున్నాడు, రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగు లో సూపర్ హిట్ అయిన టెంపర్ సినిమా కి రీమేక్.

No comments