Header Ads

తాతయ్య కాబోతున్న చిరంజీవి, ఆనందంలో మెగా అభిమానులు.!

150వ సినిమాగా ఖైదీ నెంబర్ 150తో బాస్ ఈజ్ బ్యాక్ పేరిట చిరంజీవికి అబ్దుత విజయాన్ని కొడుకు రామ్ చరణ్ అందించిన సంగతి తెల్సిందే. ఇక ఇప్పుడు మరో మూవీతో ఇంకొంత ఆనందాన్ని జోడిస్తూ సందడి చేస్తున్నాడు. అదేనండి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా మూవీని రామ్ చరణ్ భారీ వ్యయంతో చిరంజీవి హీరోగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే ఫారిన్ లో యుద్ధ సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగనుంది. ఇందుకోసం సెట్ కూడా వేశారు. చిరంజీవి కెరీర్ లోనే అంత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రంగా దీన్ని నిర్మిస్తూ తండ్రికి మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. ఇదిలావుంటే సైరా మూవీకి చిరు పెద్ద కుమార్తె కాస్ట్యూమ్స్ డిజైనర్ గా తనదైన శైలిలో కాస్ట్యూమ్స్ అందిస్తోంది.
ఇక పెద్ద అల్లుడు కూడా ఇండస్ట్రీలోకి వచ్చాడు. విజేత సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇక అసలు విషయానికి వస్తే, మెగాస్టార్ చిన్న కుమార్తె శ్రీజ ఇప్పుడు తల్లి కాబోతోంది. పండంటి బిడ్డను కనబోతున్న తీపి వార్తను దీపావళి శుభవేళ తండ్రికి అందించింది. ఈ విధంగా అసలే సంతోషంలో ఉన్న మెగాస్టార్ కి మరింత జోష్ ని ఇస్తూ దీపావళి కి ఈ శుభవార్తతో మంచి గిఫ్ట్ ఇచ్చినట్లయింది.శ్రీజ తల్లి కాబోతున్న విషయంతో ఓ ఫోటో జోడించి ట్విట్టర్ ద్వారా చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ వెల్లడించాడు. శ్రీజ, కళ్యాణ్ దేవ్ ల పెళ్లి చాలా గ్రాండ్ గా జరిగింది. శ్రీజ మొదటి భర్తకు విడాకులు ఇచ్చాక కళ్యాణ్ తో వివాహం బెంగుళూరులోని ఫామ్ హౌస్ లో అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెల్సిందే. ఇప్పడు బిడ్డకు జన్మనిస్తుండడం ఆ కుటుంబానికి సంతోషాన్ని నింపింది. ఇక రామ్ చరణ్ ఉపాసన ల నుంచి గుడ్ న్యూస్ రావాల్సి ఉంది. అయితే కెరీర్ పరంగా ఇంకా ఎంతోసాధించాల్సి ఉందని ఉపాసన ఇదివరకు ఓ ఇంటర్యూలో చెప్పారు. ఇక వీళ్ళిద్దరూ ఓ సొంత ఇంటిని అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్న సంగతి తెల్సిందే.
విజేత సినిమా ప్లాప్ అయినా కళ్ల్యాణ్ దేవ్ నటన బాగుందని చాలా మంది మెచ్చుకున్నారు, మెగా ఫామిలీ కుటుంబంలో ఇప్పుడు ఎటు చుసిన సంతోషమయమే, ఇంకో రెండు నెలల్లో రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం రిలీజ్ కాబోతుంది, సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ చిత్రానికి బోయపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా 2019 తరువాత తిరిగి సినిమాల్లోకి వస్తాడు అని చాలా మంది చెబుతున్నారు, ఒక వేళా అదే నిజం అయితే, చిరు..పవన్..చరణ్ లని ఒకే స్క్రీన్ మీద చూడవచ్చు అని మేగా అభిమానులు ఆనంద పడుతున్నారు.

No comments