స్టూడెంట్స్ కు దిమ్మ తిరిగే సమాధానాలు ఇచ్చిన రాజమౌళి! బాలయ్య బాబు సినిమా వల్ల వెనక్కి తగ్గ వలసివచ్చింది-రాజమౌళి..!
బాహుబలి సినిమా తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు రాజమౌళి. ముఖ్యంగా భారత దేశం అంతటా రాజమౌళి కీర్తి విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరో లుగా ఒక భారీ మల్టీ స్టార్రర్ కు దర్శకత్వం వహిస్తున్న రాజమౌళి ఇటీవల పుత్తూరులో ఓ కాలేజీ ఫంక్షన్లో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు.
మీకు ఎలాంటి కథలు చేయాలనిపిస్తాయి?
నాకు మన రాజుల కథలు చేయాలనిపిస్తాయి, రాజులూ అంటే నాకు చాలా ఇష్టం, వాళ్ళ మీద సినిమాలు తీయాలి అంటే నాకు ఇంకా ఇష్టం. దేవరాయలు, రాజ రాజ నరేంద్రుడు, రాజ రాజ చోళుడు, రాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ కథలు తీయాలనిపిస్తాయి. అవి చాలా ఎమోషనల్ గా ఉంటాయి.
బయోపిక్ సినిమా ల పైన మీ అభిప్రాయం?
ఒకే జోనర్ లో సినిమాలు తియ్యాలని నేను అనుకోను, నాకు సినిమా తియ్యాలి అనే సమయానికి ఏది తియ్యాలి అనిపిస్తే అది తీస్తాను
మీరు ఎప్పుడు చాలా సింపుల్ గా ఉంటారు? మీ సింప్లిసిటీ కి కారణాలు ఏమిటి?
నేను సింపుల్ గా లేకపోతే మా ఆవిడ నన్ను వాయించేస్తుంది, తను కంట్రోల్ చేయడం వల్లే నేను ఇలా సింపుల్ గా ఉన్నాను. పిల్లోళ్ల బాధ్యత మొత్తం తనే తీసుకుంటుంది, అందులో నా పాత్ర చాలా తక్కువ. నేను ఏ మాత్రం పొగరు ప్రదర్శించిన మా ఆవిడ, మా వదిన నా మీద పడి పోతారు.
శ్రీ కృష్ణ దేవరాయలు మీద సినిమా తియ్యాలి అనుకున్నారు అంట. నిజమేనా?
బాహుబలి కి ముందు, శ్రీ కృష్ణ దేవరాయల మీద స్టోరీ రెడీ చేసాం, కానీ నా గురువు రాఘవేంద్ర రావు గారు, బాలయ్య బాబు తో శ్రీ కృష్ణ దేవరాయలు సినిమా తీస్తున్నారని తెలిసింది, అందుకే నేను ఆపేసాను, ఆ తరువాత మహా రానా ప్రతాప్ గారి మీద సినిమా తియ్యాలి అనుకున్నాం, కానీ అనుకోకుండా బాహుబలి సినిమా తియ్యాల్సి వచ్చింది.
గ్రామీణ ప్రజలకు అవకాశాలు కలిపించక పోవడానికి కారణాలు?
నేను ఒక్కడినే సినిమా తియ్యలేను, సినిమా కోసం ఎందరో ఆర్టిస్ట్స్ కష్టపడతారు, ప్రతి ఒక్కరు కష్టపడితే సినిమా నిర్మాణం సాధ్యమవుతుంది. నేను సినిమా చేసేటప్పుడు పని వచ్చిన వాడా లేదా అనేది మాత్రమే చూస్తాను. అతను గ్రామీణ ప్రాంత వాసి న? పట్నం వాసి న అని నేను ఎప్పుడు చూడను. నాకు కావాల్సిన పని చేయగలిగిన వాళ్ళు ఉంటె చాలు నాకు.
Post a Comment