Header Ads

ఆత్మహత్య చేసుకుంటా అంటున్న జబర్దస్త్ ముక్కు అవినాష్ కారణం తెలిస్తే బాధ పడతారు.!!

జబర్దస్త్ కంటెస్టెంట్ ముక్కు అవినాష్ వివాదం లో ఇరుక్కున్నాడు, ఆ వివాదం లో తనని హెవీ గా ట్రోల్ చేస్తున్నారు, తనను టార్చర్ చేయడం ఆపకపోతే ఆత్మహత్య చేసుకుంటా అని అవినాష్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు.
అసలు ఆ వివాదం ఏమిటి?

జబర్దస్త్ లో రక రకాల విషయాల మీద స్కిట్స్ చేస్తుంటారు కంటెస్టెంట్స్, ఏవి చేసినా, కేవలం హాస్యం కోసమే అని వారు పదే పదే చెబుతుంటారు, గల్ఫ్ వెళ్లే కుటుంబాలకు చెందిన మహిళలను అవమానపరిచే విధంగా అవినాష్ చేసిన స్కిట్ ఉందంటూ అతడి సొంత ప్రాంతమైన జగిత్యాల ప్రజల నుంచే వ్యతిరేక వ్యక్తం అయ్యింది, గతం లో వారు ఈ స్కిట్ మీద పోలీస్ లకు ఫిర్యాదు కూడా చేసారు. ఆ తరువాత అవినాష్ క్షమాపణ చెప్పారు.

అవినాష్ ని ట్రోల్ చేస్తుంది ఎవరు?

ఆ ఘటన తరువాత కొందరు నెటిజన్స్ కావాలనే అవినాష్ ను ట్రోల్ చేస్తున్నారు, ఎన్ని సార్లు క్షమాపణ కోరిన వారు కావాలనే అవినాష్ ను ట్రోల్ చేస్తున్నారు, గల్ఫ్ స్కిట్ చేసి చాలా రోజులు అయినా, అవినాష్ ని తిట్టే వారు మాత్రం ఆగలేదు.

అవినాష్ ఆత్మహత్య చేసుకుంటా అని అనడానికి కారణం?

తననే కాదు, తన కుటుంబ సభ్యులను కూడా అసభ్యంగా దూషిస్తున్నారని అవినాష్ వాపొయ్యాడు. అమ్మ, వదినలను కూడా తిడుతున్నారు, నన్ను ఇంతలా టార్చర్ పెడితే నేను తట్టుకోలేను, నన్ను టార్చర్ చేయడం ఆపేయండి, లేకపోతే నేను ఆత్మ హత్యా చేసుకొని ఆ వీడియో మీకు పంపమని చెబుతా, అప్పుడైనా మీరు ఆపుతారని ఆశిస్తున్నా అని ఇంటర్వ్యూ లో తెలిపారు. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, వాటికి క్షమాపణ తెలిపాక కూడా టార్చర్ చేస్తే తట్టుకోలేము అంటూ బాధ పడ్డారు అవినాష్.

ఇది వరకు జబర్దస్త్ కంటెస్టెంట్ వేణు పైన ఒక స్కిట్ వివాదం మీదే బహిరంగంగా కొంత మంది దాడి చేసారు.

No comments