Header Ads

నాకు ఎటువంటి గాయాలు అవ్వలేదు, నేను క్షేమంగానే ఉన్న- సీనియర్ హీరో రాజశేఖర్..!

సీనియర్ హీరో రాజశేఖర్  గారు మాట్లాడుతూ: నాకు ఎప్పుడో జరిగిన యాక్సిడెంట్ పిక్స్ తీసుకొచ్చి నాకు దెబ్బలు తగిలాయి అని మీడియా లో వస్తున్న వార్తలు అవాస్తవం. అసలు ఏం జరిగిందంటే.




రాజశేఖర్ గారు సోషల్ మీడియా మధ్యములో అసలు ఏం జరిగిందో వెల్లడించారు:

10 రోజుల ముందు 'కల్కి' మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడు, యాక్షన్ సీన్స్ చేస్తుండగా నాకు స్వల్ప గాయాలు అయ్యాయి, కానీ నేను విరామం తీసుకోకుండా అలాగే షూటింగ్ ని కొనసాగించాను. షూటింగ్ కొనసాగించడానికి గల కారణం, మిగిలిన యాక్టర్స్ వాల డేట్స్ కోసమే, వాళ్ళు వేరే సినిమాలు చేయడానికి ఒప్పుకొని ఉంటారు, ఈ సినిమా చాలా ప్రతిష్టాత్మకంగా తీస్తున్నాం, కాబట్టి ఎటువంటి వాయిదాలు లేకుండా ముందుకు సాగాలి అని 'కల్కి' చిత్రీకరణను ముందుకు సాగించాం, గాయాల నుండి నెమ్మదిగా కోలుకుంటున్న.

కులూ మనాలి కి షూటింగ్ కోసం కుటుంబం, కల్కి చిత్ర బృందం తో వెళ్తున్న మార్గం లో కొండా చరియలు విరిగిపడటం తో వెళ్ళుటకు కొంచెం అంతరాయం ఏర్పడింది, అందరం సురక్షితంగానే ఉన్నాం. ఇప్పుడు తిరిగి కులూ మనాలి కి పయనం అయ్యాం. చాలా మంది నాకు యాక్సిడెంట్ అయ్యిందని కాల్స్, మెసేజెస్ చేస్తున్నారు. నేను, నా కుటుంబం, చిత్ర బృందం అందరం క్షేమంగా ఉన్నాం. దయ చేసి ఎవరు తప్పుడు ప్రచారం చేయవద్దు.

Tweet:


https://twitter.com/ActorRajasekhar/status/1065560343122927616?fbclid=IwAR2rAumZBNfgWSuiInKkVZ55--SLTfhvr6lPE2nz0eRTioRWaEVZFVNuDwc

No comments