Header Ads

నెట్టింట్లో ముఖపత్రానిదే హవా..!

దేనిలోనైనా నంబర్ వన్ లో వుండాలంటే చాలా సాధన చేయాలి . ఎంతో కష్టపడాలి . ప్రత్యర్థుల పోటీని తట్టుకుని నిలబడాలి . ఎప్పటికప్పుడు అప్ డేట్ కావాలి. ఇది ప్రతి రంగానికి వర్తిస్తుంది . నెట్ పుణ్యమా అంటూ సోషల్ మీడియా తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. ఎక్కడ చూసినా దీనిపైనే చర్చ జరుగుతోంది . కోట్లాది రూపాయల బిజినెస్ మారుతోంది. కలల బేహారులకు స్వర్గధామంగా విరాజిల్లుతోంది.ఇక్కడ కులమతాలు లేవు ..ఒక్కటే పోటీ. ఎవరికి వాళ్ళే రాజులు ..రారాజులు ..నిమిషానికో ఫార్మాట్ మారుతోంది . ఎప్ప్పుడు ఏది వర్కౌట్ అవుతుందో చెప్పలేని పరిస్థితి. దీనిని తట్టుకుని నిలబడాలంటే ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు మార్చుకుంటూ పోవటమే. ఇదే తరహా ఫార్ములాను ఫాలో అవుతున్నాయి ఈ సంస్థలు. ఇక ముఖ పత్రం ఎందుకు ముందు వరుసలో ఉంటోందో ఎవరూ చెప్పలేని స్థితి . దీనిపై ఓ లుక్ వేయాలంటే కొన్ని ఆసక్తికరమైన విషయాలు మనల్ని మెస్మరైజ్ చేయక మానవు.

ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో ఇప్పటికీ ఫేస్ బుక్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటోంది. ఓ వైపు మిగతా సంస్థలు తమ తమ టెక్నాలజీ పరంగా ఎన్ని మార్పులు చేర్పులు చేస్తున్నా ముఖ పత్రం మాత్రం ముందంజలోనే సాగుతోంది. జుకర్ బర్గ్ ఏ ముహూర్తంలో స్టార్ట్ చేసాడో కానీ రాకెట్ కంటే వేగంగా కోట్లాది జనాన్ని కట్టి పడేస్తోంది.

వ్యక్తిగతమైన సమాచారంపై కొన్ని అభ్యంతరాలు వున్నా తన ఉనికికి ఏ మాత్రం భంగం కలగకుండా జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది . ఎన్నో సోషల్ మీడియా సైట్లు ఉన్నా ఇదే మొదటి స్తానం సంపాదిస్తోంది. ప్రతి నెలా జనం ఇందులో చేరుతున్నారు. బంధాలు కలిపేసుకుంటున్నారు. ఇక చిన్న , మధ్య తరహా వ్యాపారులకు ఇదో చక్కని వేదికగా ఉంటోంది . ఇదే ఇప్పుడు దీనికి ఆసెట్ అవుతోంది .

రెండో స్థానంలో ట్విట్టర్ నిలిచింది. చిన్నపాటి సందేశాన్ని నిమిషాల్లో లోకమంతటా చేరేలా చేస్తోంది. దీనికి అభిమానులు జై కొడుతున్నారు . లింక్డ్ ఇన్ ఆ తరవాత స్థానంలో ఉంటోంది . ఇది కూడా వ్యక్తులు , వ్యవస్థలు , సంస్థలు , కంపెనీలు .. ఇలా ప్రతి సమాచారం తో ఆకట్టుకుంటోంది. సెర్చింగ్ లో రారాజుగా గూగుల్ ప్లస్ వెలుగొందుతోంది . ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్ ను గూగుల్ యాజమాన్యం చేరుస్తుంది. ఆకట్టుకునే ప్రయత్నంలో ఉంటోంది .

యూట్యూబ్ ఇదో సంచలనం గా మారుతోంది. క్రియేటివిటీ ఉంటే చాలు ఇది బలమైన ఆర్ధిక వనరుగా ఉపయోగ పడుతోంది . రోజుకు లక్షలాది వీడియోలు అప్ లోడ్ అవుతున్నాయి . చూడాలంటే ఒక జీవితం సరిపోనంతగా వీడియోలు చేరుతున్నాయి. ఇదీ దీని స్పెషాలిటీ . ఇక ఇటీవల మోడీ ఎన్నికల్లో ప్రసంగాన్ని యూట్యూబ్ ప్రత్యక్షంగా ప్రసారం చేసింది . ఇదో ట్రెండ్ గా మారింది . దీని తో పాటే పింట రెస్ట్ తన రేటింగ్ పెంచుకుంటోంది . 2010 లో స్టార్ట్ అయిన ఇంస్టా గ్రామ్ తన బ్రాండ్ కొనసాగిస్తూ మెలమెల్లగా ఎగబాకుతోంది .

టంబ్లర్ దీని స్పెషాలిటీ మాత్రం హై లెట్ గా నిలుస్తోంది . కొత్త కొత్తగా నెటిజన్స్ కు సౌలభ్యంగా ఉంటోంది . యాహూ ఫ్లికర్ తర్వాతి స్థానంలో నిలుస్తోంది . ఇక్కడ ఇమేజెస్ కోకొల్లలు .. చూడాలే కానీ వేలాది ఫోటోలు పంచుకుంటున్నారు . రెడ్దిట్ అనూహ్యంగా ముందుకు వచ్చింది . ఆ తర్వాత స్నాప్ చాట్ ట్రెండ్ ఇప్పుడు నడుస్తోంది .

ఇక ఇండియాలో వాట్స్ అప్ ఒక సంచలనమే అనే చెప్పాలి . స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అంటూ ఇప్పుడు అంతా దానిలోనే లైవ్ గా ఉంటున్నారు . వైన్ ఇదో సోషల్ మీడియాను ఇప్పుడు ఊపేస్తోంది . బిగ్ షుగర్ తో పాటు డెలిషియస్ , డిగ్ , వైబర్ తమకంటూ ఓ బ్రాండ్ ను సృష్టించుకుంటూ ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి . బహుశా ఇన్నేళ్లయినా ఫేస్ బుక్ మాత్రం ఎప్పటికప్పుడు మొదటి స్తానం లో ఉండేలా చూసుకుంటోంది .

No comments