Header Ads

నేను వారికి తల్లిని కాదు అంటున్న కరీనా కపూర్. పిన్ని అని పిలిస్తే నాకు నచ్చదు- కరీనా కపూర్,.

సారా, ఇబ్రహీం లు సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య అయిన అమృతా సింగ్ కు జన్మించారు. సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ కు విడాకులు ఇచ్చి కరీనా కపూర్ ని పెళ్లి చేసుకున్నాడని అందరికి తెలుసు. సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ లకు జన్మించిన బాలుడి పేరు 'తైమూరు'.
ఇటీవల కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'కాఫీ విత్ కరణ్' అనే షో లో 'సారా అలీ ఖాన్', 'సైఫ్ అలీ ఖాన్' పాల్గొన్నారు, ఈ షో లో సారా మాట్లాడుతూ, కరీనా ను 'పిన్ని' అని పిలిస్తే కరీనాకు నచ్చదని సారా చెప్పింది. సారా చెప్పిన మాటలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.

కరీనా కపూర్, సారా చెప్పిన మాటలకు స్పందిస్తూ మీడియా తో మాట్లాడుతూ:

సారా, ఇబ్రహీంలకు నేను పిన్ని ని కాదు, నేను సారా, ఇబ్రహీంలను ఒక పిన్ని గా కంటే ఒక మంచి ఫ్రెండ్ గా చూస్తాను, వారు నాతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. వారికి ఏ అవసరం వచ్చిన నేను అండగా నిలబడతాను, భవిష్యత్తులో వాళ్ళు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అమృతా సింగ్ గారు సారా, ఇబ్రహీంలను చాలా బాగా పెంచారు. సారా, ఇబ్రహీం ల పద్దతి, ఇష్టాయిష్టాలు చూస్తే ముచ్చటేస్తుంది అని కరీనా తెలిపింది.

తైమూరు క్రేజ్ గురుంచి కరీనా మాట్లాడుతూ:

తైమూరు కు చిన్న తనం లోనే మీడియా లో ఇంతటి క్రేజ్ రావడం చాలా సంతోషం గా ఉందని, కానీ అతన్ని ఒక బొమ్మ లాగ చూస్తూ ఫోటో లు తీస్తూ ఉంటె బాధ కలుగుతుంది, తైమూరు ప్రైవసీ కి భంగం కలగకుండా ఉంటె చాలు అని కరీనా తెలిపింది.

#మీటూ ఉద్యమం గురుంచి కూడా కరీనా కపూర్ స్పందించారు:

కరీనా కపూర్ మాట్లాడుతూ: "సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు, దాడులపై బహిరంగ చర్చ జరుగడం శుభపరిణామం. పనిచేసే ప్రదేశంలో తమకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా మహిళలు ముందుకొచ్చి చెప్పడాన్ని స్వాగతించాలి. చాలా ఏళ్లుగా ఇలాంటి పరిణామం కనిపించలేదు. ప్రస్తుతం జరుగుతున్న చర్చకు కారణమైన మహిళలను అభినందించాలి. #మీటూ ఉద్యమం అనేది చాలా మంచి ఉద్యమం అని, ఈ ఉద్యమం వల్ల చాలా ఆడవాళ్లకు ధైర్యం వస్తుంది, స్టార్ హీరోయిన్ అయినా, చిన్న ఆర్టిస్ట్ గా నటించే అమ్మాయి అయినా, అందరికి ఒకే రకంగా రక్షణ కల్పించాలి",  అని కరీనా కపూర్ మీడియా ద్వారా తెలిపారు.


No comments