పాసెంజర్ ను ఆ “ఊబర్ క్యాబ్” డ్రైవర్ ఎలా మోసం చేసాడో తెలుసా..? ఇకనైనా జాగ్రత్త పడండి..!
చాలా వేగంగా, సౌకర్యవంతంగా గమ్యస్థానానికి చేరుకోవచ్చని మనం ఓలా, ఊబర్ వంటి క్యాబ్‌లను బుక్ చేసుకుంటాం. దీంతో మనం ఇతరులతో సంబంధం లేకుండా మనకు ఇష్టం వచ్చినట్టుగా త్వరగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు. బాగా కంఫర్ట్‌గా ట్రావెల్ చేయవచ్చు. అయితే క్యాబ్ బుక్ చేసినప్పటి నుంచి గమ్యస్థానానికి చేరుకునే వరకు అంతా బాగానే జరిగితే ఓకే. లేదంటే.. ఇదిగో.. సరిగ్గా ఈ వ్యక్తికి జరిగినట్టే జరుగుతుంది. క్యాబ్ డ్రైవర్ మోసం చేస్తాడు. దీంతో అసలుకే ఎసరు వస్తుంది. ఈ క్రమంలో ఇవ్వాల్సిన డబ్బు కాకుండా ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఆ తరువాత బాధ పడీ ప్రయోజనం ఉండదు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.
అతని పేరు జేపీ ముదులి. బెంగుళూరులో ఉంటాడు. ఓ రోజున అర్జెంటుగా విమానంలో వేరే నగరానికి వెళ్లాల్సి వచ్చింది. దీంతో వెంటనే టిక్కెట్లు బుక్ చేసుకుని ఎయిర్ పోర్టుకు చేరుకునేందుకు క్యాబ్ బుక్ చేశాడు. అది ఊబర్ క్యాబ్. అతనికి చాలా తక్కువ టైం ఉంది ఫ్లైట్ ఎక్కడానికి. దీంతో అదే విషయాన్ని క్యాబ్ డ్రైవర్‌కు చెప్పాడు. అయితే ఆ క్యాబ్ డ్రైవర్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నాడు. జేపీ ముదులి నుంచి ఎక్కువ డబ్బులు గుంజాలని చూశాడు. మార్గమధ్యలో వచ్చిన టోల్ గేట్ వద్ద ఆగి తన వద్ద క్యాష్ లేదని, క్యాష్ ఇస్తే టోల్ చార్జి కడతానని, తరువాత పేమెంట్‌లో అడ్జస్ట్ చేసుకోవచ్చని చెప్పాడు. అయితే అందుకు ముదులి అంగీకరించలేదు. తాను పేటీఎం ద్వారా క్యాబ్ బుక్ చేశానని, దాంతోనే పేమెంట్ చేస్తానని చెప్పాడు. అయితే క్యాష్ ఇవ్వకపోతే ముందుకు వెళ్లలేమని క్యాబ్ డ్రైవర్ చెప్పాడు. దీంతో ముదులి గత్యంతరం లేక ఆ క్యాబ్ డ్రైవర్‌కు క్యాష్ ఇచ్చాడు.
తీరా ఎయిర్‌పోర్టులో దింపాక పూర్తి పేమెంట్‌ను క్యాష్ రూపంలో ఇవ్వాలని క్యాబ్ డ్రైవర్ అడిగాడు. అందుకు ముదులి ససేమిరా అన్నాడు. అయితే ఆ క్యాబ్ డ్రైవర్ మళ్లీ మాట్లాడుతూ… మొత్తం క్యాష్ ఇచ్చేస్తే సదరు పేటీఎం పేమెంట్ ను క్యాన్సిల్ చేసి రివర్స్ చేస్తానని దీంతో పేటీఎంలో కట్ అయ్యే చార్జి మొత్తం మళ్లీ 15 నిమిషాల్లో వెనక్కి వస్తుందని క్యాబ్ డ్రైవర్ చెప్పాడు. అందుకు ముదులి అంగీకరించాడు. ఈ క్రమంలో తాను ఎయిర్‌పోర్టుకు క్యాబులో వచ్చినందుకు గాను అయిన మొత్తం డబ్బు రూ.871 క్యాష్ చెల్లించాడు. తరువాత క్యాబ్ డ్రైవర్ వెళ్లిపోయాడు. అయితే అతను వెళ్లాక 15 నిమిషాలు అయింది. 30 నిమిషాలు దాటింది. గంట కూడా అయింది. అయినా పేటీఎంలో కట్ అయిన రూ.871 వెనక్కి రాలేదు. దీంతో ముదులి ఊబర్ సపోర్ట్‌ను ఆశ్రయించాడు. అయినా స్పందనలేదు. దీంతో అతను చివరకు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని షేర్ చేయగా అప్పుడు ఊబర్ వారు స్పందించారు. ముదులి పేటీఎం నుంచి కట్ అయిన సదరు మొత్తాన్ని వెనక్కిచ్చేశారు. ఇదీ.. అతనికి జరిగింది. చూశారు కదా. నేటి తరుణంలో క్యాబ్‌లు ఎలా తయారయ్యాయో. కనుక మీరు కూడా ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండండి..!
Post a Comment