Header Ads

ఏ.ఆర్.రెహమాన్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియా లో ఇప్పుడు వైరల్ గా మారింది ఇంతకీ అది ఎం వీడియో నో మీకుతెలుసా.?

ప్రస్తుతం ఏ.ఆర్.రెహమాన్ షేర్ చేసిన ఒక వీడియో వైరల్ అవుతుంది, సోషల్ మీడియా లో ఏ.ఆర్.రెహమాన్ షేర్ చేసిన వీడియో నేషనల్ వైడ్ వైరల్ అయ్యింది. రెహమాన్ కంపోజ్ చేసిన ప్రేమికుడు సినిమాలోని ఓ చెలియా పాటను ఒక తెలుగు ఆమె పాడింది, ఆ పాట ఎంత బాగా పాడింది అంటే, ఆమె పాడిన ఆ వీడియో వైరల్ అయి రెహమాన్ కు చేరుకుంది. రెహ్మామన్ ఆ వీడియోను సోషల్ మీడియా లో పోస్ట్ చేసి అద్భుతమైన వాయిస్ అంటూ ప్రశంసలు గుప్పించారు, రెహమాన్ పోస్ట్ వేసే సమయానికి ఆమె ఎవరు అనేది రెహమాన్ కు తెలియదు, అందుకే ఆమె పేరు ని ఆ పోస్ట్ లో తెలుపలేదు. ఒక న్యూస్ ఛానల్, ఆమె ని వెతికి కనిపెట్టారు, ఆమె పేరు బేబీ అని, ఆమె ను సంగీత దర్శకుడు కోటి పాటలు పాడించడానికి సంప్రదించాడు అని ఆ ఛానల్ వారు తెలిపారు .




ప్రస్తుతం రెహమాన్ 2.0 చిత్రానికి సంగీతం అందించాడు, ఈ చిత్రం నవంబర్ 29 న విడుదల అవుతుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య పాత్ర పోషిస్తున్న 2.0 చిత్రానికి దిగ్గజ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించాడు. అక్షయ్ కుమార్ 2.0 చిత్రం లో విలన్ గా నటించాడు. అమీ జాక్సన్ ఇందులో లేడీ రోబో గా నటించింది. 2.0 చిత్రం రిలీజ్ తరువాత ఇంకెన్ని రికార్డ్స్ బాధలు కొడుతుందో వేచి చూడాలి. 2.0 చిత్రాన్ని త్వరలోనే చైనా లో కూడా విడుదల చేయనున్నారు.

Watch Video:

https://www.facebook.com/arrahman/videos/524106481413224/

No comments