Header Ads

బయట పడిన కౌశల్ బండారం! సోషల్ మీడియా లో కౌశల్ పైన ట్రోల్ల్స్ వెల్లువ..!

కౌశల్.. కౌశల్.. కౌశల్.బిగ్ బాస్ తెలుగు సీసన్-2 విజేతగా నిలిచినా కౌశల్ పేరు మరో సారి సోషల్ మీడియా లో చెక్కర్లు కొడుతుంది, ఈ సారి మాత్రం నెగటివ్ గానే ప్రచారం జరుగుతుంది కౌశల్ మీద...ఒక్కసారిగా సెలెబ్రిటీ స్టేటస్ తెచ్చుకున్న కౌశల్ అదే స్టేటస్ కొనసాగించ లేకపోయాడు, ఇష్టం వాచినట్టు మాట్లాడి, లేని పోనివన్నీ చెప్పి ఇప్పుడు తల మునకలు అవుతున్నాడు. బిగ్ బాస్ తెలుగు సీసన్-2 విజేతగా నిలిచిన తనకు ఏకంగా పీఎంవో నుంచి మెసేజ్ వచ్చిదంటూ ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దిమ్మతిరిగే బెలూన్లు పేల్చాడు. అంతేకాదు..బిగ్ బాస్ తెలుగు సీజన్ టూ లో తనకు 40 కోట్ల ఓట్లు వచ్చాయని..అంత పెద్ద సంఖ్యలో ఓట్లు రావటంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు తనను అప్రోచ్ అయ్యారంటూ మరో షాకిచ్చాడు కౌశల్. కానీ, అతను చెప్పినవన్నీ అబద్దాలేనని ఇప్పుడు సాక్ష్యాధారాలతో సహా తేలిపోయాయి.
పీఎంవో ఆఫీస్ నుండి విషెస్ రావడం ఏంటని చాలా మంది నెటిజెన్ లు కామెంట్ చేసారు. ఓ వ్యక్తి మాత్రం ఇందులో నిజానిజాలేంటో తెల్సుకునేందుకు ఆర్టీఏ యాక్ట్ ద్వారా పీఎంవో నుంచి వివరాలు సేకరించాడు. గత అక్టోబర్ మొదటి వారంలో బిగ్ బాస్ టూ టైటిల్ విన్నర్ కు మీ నుంచి ఏమైన మెసేజ్ వెళ్లిందా అని ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన పీఎంవో తాము అలాంటి ప్రోగ్రాంకు కంగ్రాట్స్ మెసేజ్ పంపలేదని తేల్చి చెప్పేసింది. పీఎంవో నుంచి కౌశల్ కు కంగ్రాట్స్ మెసేజ్ పరమ అబద్ధం అని తేలిపోయింది.

ఇక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు అప్రోచ్ అవటం నిజమేనా? సాధారణంగా గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఒక ఈవెంట్ రికార్డ్ ను కవర్ చేయాలంటే ముందుగా మనమే వాళ్లకు ఇన్ఫాం చేయాలి. వాళ్ల సమక్షంలో గత రికార్డులను బ్రేక్ చేయటంగానీ, కొత్త రికార్డులను క్రియేట్ చేయటంగానీ జరుగుతుంది. కానీ..కౌశల్ మాత్రం గిన్నిస్ వాళ్లే అతనికి పోలైన ఓట్లు తెల్సుకొని ఫిదా అయి వాళ్లే వచ్చి తనను కలిసారని చెప్పటం అతని విపరీత ఆలోచనా ధోరణి జనానికి తెలిసేలా చేసింది. సీజన్ టూ లో డిఫరెంట్ పర్సనాలిటీగా పేరున్న కౌశల్.. తొలి రోజుల్లో ఫైటింగ్ స్పిరిట్ చూసి చాలా మంది కౌశల్ కి ఫ్యాన్స్ అయ్యారు.
కౌశల్ బిగ్ బాస్ లో ఆడుతున్నప్పుడు అతనికి సపోర్టివ్ గా జనాలు ర్యాలీ లు చేయడం, ఓట్లు వేయమని ప్రచారం చేయడం, ఇలా ఒకటా రెండా.. అతనికి అనుకూలంగా జనాలు ఎన్నో చేసారు. తనను కార్నర్ చేస్తున్నారంటూ ఆడియన్స్ కు మేసేజ్ ఇవ్వటంలో సక్సెస్ అయ్యాడు. కానీ, విన్నర్ గా నిలిచిన తర్వాత వింత చేష్టలతో జనంలో పలుచనైపోయాడు. తనను తాను ఎక్కువగా ఊహించుకొని నెటిజన్లకు స్టఫ్ అయ్యాడు కౌశల్.. బిగ్ బాస్ విజేతగా నిలిచినా తరువాత కొంచెం ఓర్పుతా నెమ్మదిగా మాట తీరు అదుపులో పెట్టుకొని ఉంటె ఇప్పుడు అతని స్థాయి వేరే రకంగా ఉండేది, చేతులారా వచ్చిన క్రేజ్ ని చెడగొట్టుకుంటున్నాడు కౌశల్!!!

No comments