Header Ads

వ్యాపార‌వేత్త‌గా రాణిస్తున్న సౌమ్య గుప్తా

పైల‌ట్ కావాల‌నుకుని దుస్తుల వ్యాపారంలో ల‌క్ష‌లాది రూపాయ‌లు సంపాదిస్తోంది సౌమ్యా గుప్త. ముంబ‌యి న‌గ‌రానికి చెందిన ఈమె సాధించిన విజ‌యం ఎంద‌రో మ‌హిళ‌ల‌కు స్ఫూర్తి క‌లిగించే అంశం. చిన్న‌ప్ప‌టి నుండి సౌమ్య గుప్త‌కు విమానాలంటే ఇష్టం. ఏ రోజైనా స‌రే దానిని న‌డ‌పాల‌ని..ఆకాశం ..భూమికి మ‌ధ్య ప్ర‌యాణం చేయాల‌న్న ఆశలు క‌ల్ల‌ల‌య్యాయి. దీంతో నిరాశ‌కు లోనైంది. పుట్టుక‌తో ఆడ‌పిల్ల అయిన‌ప్ప‌టికీ నేను అబ్బాయిల‌తో పోటీ ప‌డేదాన్ని. మా అమ్మ నా ఉత్సాహాన్ని నీరు గార్చింది. ఏనాడూ వారితో స‌రితూగ‌లేవు అని అన‌డంతో బాధ ప‌డ్డా. అయినా ఏదో ఒక‌రోజు పైల‌ట్ కావాల‌న్న కోరిక నాలో ఉండి పోయింది. ప‌ట్టు వ‌ద‌ల‌లేదు. 2007లో క‌మ‌ర్షియ‌ల్ పైల‌ట్ లైసెన్స్ సాధించింది సౌమ్య‌.లైసెన్స్ పొందినా ఉద్యోగాన్ని పొంద‌లేక పోయింది. పైల‌ట్ అయ్యేందుకు ఆమె కుటుంబం శిక్ష‌ణ కోసం 60 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేశారు. ఎయిర్ పోర్టు అధికారులు న‌న్ను ఇంట‌ర్వ్యూకు పిలిచారు. అన్నిట్లో నేను ఫిట్ . కానీ కొలువు రాలేదు. ఇదేమ‌ని అడిగితే ..నీకు 20 ఏళ్లు. ఎలా ఇవ్వాలి నీకు పైల‌ట్ గా అని తిరిగి ప్ర‌శ్నించారు. దీంతో నేను అవాక్క‌యాను. అందులో ఉన్న సీనియ‌ర్స్ న‌న్ను బోయింగ్‌, ఎయిర్ బ‌స్ న‌డ‌ప‌మ‌ని ..మ‌రికొంత స‌మ‌యం కావాల‌ని సూచించారు. ఇదీ ట్రై చేయాలంటే అద‌నంగా మ‌రో 20 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. అయినా ఉద్యోగం వ‌స్తుంద‌న్న గ్యారెంటీ లేదు. ఇక లాభం లేద‌నుకుని కాల్ సెంట‌ర్‌లో జాబ్‌కు కుదిరింది..నెల‌కు 20 వేల చొప్పున వేత‌నం. కేవ‌లం ఇంట‌ర్ వ‌ర‌కే చ‌దివిన నాకు ఇంత‌కంటే మెరుగైన ఉద్యోగం దొరుకుతుంద‌న్న న‌మ్మ‌కం లేకుండా పోయింది. అక్క‌డ కూడా ఇముడ‌లేక ...జిమ్ ట్రైన‌ర్‌గా స్టార్ట్ చేసింది. త‌ల్లి చెప్ప‌డంతో ఓకే చేసింది. ప్ర‌తిరోజు మేక‌ప్ వేసుకోవ‌డం..త‌యారు కావ‌డం..రిసెప్ష‌నిస్ట్ గా ప‌ని. అయినా ఏదో అసంతృప్తి.

ఆమెలోని అసంతృప్తిని గ‌మ‌నించిన పేరెంట్స్ కామ‌ర్స్ చేయ‌మ‌ని సెల‌విచ్చారు. రెగ్యుల‌ర్ బికాం కోర్సులో చేరింది. దేనినైనా అర్థం చేసుకోవ‌డం వెన్న‌తో పెట్టిన విద్య‌. ట్యూష‌న్స్‌కు వెళ్లింది. కానీ డెబిట్‌..క్రెడిట్ మాత్రం అర్థం చేసుకోలేక పోయింది. అక్క‌డ కూడా నిరాశే. ఇంట్లో ఉన్న బిడ్డ‌కు కొన్ని దుస్తులు ఇచ్చింది త‌ల్లి. వాటిపై డిజైన్ వేయ‌మ‌ని తెలిపింది. డిఫ‌రెంట్ క‌ల‌ర్స్‌..డిజైన్స్‌..30 ని కొనుగోలు చేసింది. ఇంట్లోనే షో ఏర్పాటు చేసింది. క్ష‌ణాల్లోనే అమ్ముడు పోయాయి. గార్మెంట్స్‌ను ఆద‌రించ‌డం ప్రారంభించారు క‌స్ట‌మ‌ర్స్‌. మ‌రింత పెరిగారు. డిమాండ్ రావ‌డంతో అవి 4000 వ‌ర‌కు పెరిగాయి. రెట్టించిన ఉత్సాహం..చేతుల్లో డ‌బ్బులు . కావాల్సినంత స్పేస్‌. ఇది చాల‌దా కాసులు కొల్ల‌గొట్ట‌డానికి.

ఇంట్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిష‌న్‌కు కుటుంబీకులు, ఫ్రెండ్స్ , ప‌క్క వారి నుండి ఆద‌ర‌ణ ల‌భించింది. స్వంతంగా బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నారు. రీతూ గుప్త ..కూతురు సౌమ్య గుప్త క‌లిసి టెన్ ఆన్ టెన్ పేరుతో బ్రాండెడ్ దుస్తులు అమ్మారు. వీట‌న్నింటిని ఆన్‌లైన్లో అమ్మేందుకు శ్రీ‌కారం చుట్టారు. తాము ప్రారంభించిన ఈ కంపెనీ గురించి ఈ కామ‌ర్స్ ఆంట్ర‌ప్రెన్యూర్ రాహుల్ నార్వేక‌ర్‌కు మెయిల్ పెట్టారు. అప్ప‌టి దాకా మా కంపెనీకి ఎలాంటి స‌మాచారం లేదు. టిన్ లేదు..పాన్ లేదు. ఒక రోజు నార్వేక‌ర్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఆన్ లైన్లో అమ్మేందుకు ఆయ‌న స‌హ‌క‌రిస్తామ‌ని చెప్పారు. క్ష‌ణాల్లోనే అవుటాఫ్ స్టాక్‌. ఇదీ ఓ రికార్డ్‌. అయితే ఎలా అమ్మాలో..ఎలా ఫోటోల‌ను అప్ లోడ్ చేయాలో తెలియ‌లేదు. త‌ల్లీబిడ్డ‌లు క‌లిసి మూడు పేజీలు క్రియేట్ చేశాం. మోడ‌ల్స్‌..డిజైన్స్ తో జుగాడ్ స్వీక‌రించింది.
స్థానికంగా ఉన్న వారితో మోడ‌లింగ్ ..డ్రెస్‌ల‌తో ఆన్‌లైన్‌లో పెట్టారు. స‌క్సెస్ అయ్యారు.

మెల్ల‌గా బిజినెస్ లాభాల్లోకి వ‌చ్చింది. స్వంతంగా ఫోటోగ్రాఫ‌ర్స్‌, మోడ‌ల్స్‌, డిజైన్స్ త‌యారు చేసే గార్మెంట్స్ మెషీన్ల‌ను కొనుగోలు చేశారు త‌ల్లీ కూతుళ్లు. మ్యాన్యూఫాక్చ‌రింగ్ యూనిట్ ప్రారంభించారు. సెకండ్ హ్యాండ్ మెషీన్లే. ఆన్‌లైన్లో ఇప్ప‌టికే హెవీ కాంపిటిష‌న్‌. వాటిని త‌ట్టుకుని నిల‌బ‌డాలంటే..డిఫ‌రెంట్‌గా డిజైన్లతో త‌యారు చేస్తే ఆద‌ర‌ణ ఉంటుంద‌నే ఐడియా నోట్ల క‌ట్ట‌ల‌ను కుమ్మ‌రించేలా చేసింది.

యూనిట్ పేరుతో ఆఫీసు తెరిచింది. అందులో న‌లుగురు సిబ్బంది. 13000కు పైగా దుస్తులు. ఆక‌ట్టుకునే రీతిలో డిజైన్లు. మ‌న‌సు దోచే గార్మెంట్స్‌. పార్కింగ్ చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు. ముంబ‌యి అంటేనే స్పేస్ దొర‌క‌డం క‌ష్టం. పైల‌ట్ కావాల‌నుకున్న సౌమ్య గుప్త‌..ఇపుడు టెన్ ఆన్ టెన్ కంపెనీకి ఓన‌ర్‌. 30 దుస్తుల‌తో ప్రారంభ‌మైన ఈ కంపెనీ ఇపుడు ల‌క్ష‌లాది బ్రాండెడ్ దుస్తుల‌కు చేరుకుంది. ఆన్‌లైన్‌లో ఇదో సంచ‌ల‌నం. ఎలాంటి రుణాలు తీసుకోకుండానే కోట్లాది రూపాయ‌లు సంపాదించి పెడుతోంది. త‌ల్లి ఐడియా..కూతురు ఆచ‌ర‌ణ‌..స‌క్సెస్‌ఫుల్ ఆంట్ర‌ప్రెన్యూర్‌గా మార్చేసింది. 100 మంది స‌క్సెస్‌ఫుల్ బిజినెస్ ప‌ర్స‌నాలిటీల‌లో సౌమ్య గుప్త ఒక‌రు కావ‌డం విచిత్రం క‌దూ. మీకూ ఐడియా వుంటే ఆచ‌రించి చూడండి.

No comments