Header Ads

చందమామకు ఆ పేరెలా వచ్చిందో తెలుసా? చంద్రుడు మనకు "మామ" ఎలా అవుతాడు?

చిన్నారులూ…. మీ భూమి మీద చిన్నపిల్లలకి అన్నం పెట్టేటప్పుడు నన్ను చూపించి ఇలా పాటలుపాడి నెమ్మదిగా అన్నాన్ని వాళ్ళ నోళ్ళలో కుక్కేస్తుంటారు కదూ. చెకుముకి ఈ సారి నాగురించి మీకు చెప్పాలని నన్నే పిలిపించింది. నాగురించి నన్నే చెప్పమంది. అందుకే మీ ముందుకు వచ్చాను. నా పేరు చందమామ అని, నేను మీ భూమికి ఉన్న ఒకే ఒక ఉపగ్రహమని, ప్రతి రోజూ నా రూపంలో తేడాలు వస్తాయని, నేను పూర్తిగా కనిపించే రోజు పౌర్ణని అని, అసలు నేను కనిపించని రోజు అమావాస్య అంటారని మీకు తెలుసన్న విషయం నాకూ తెలుసు. నా వెలుతురిని వెన్నెల అంటారని, ఆ వెన్నెల నేను సూర్యుడి నుండి అరువు తెచ్చుకొంటానని మీకు తెలుసుకదా నేను చాలా అందంగా ఉంటానని కవులు ఆడవాళ్ళను వర్ణించేటప్పుడు నాతో పోలుస్తూ కవితలు, పాటలు, పద్యాలు రాస్తూంటారు కదూ.
alkdin నా గురించి మీ స్కూల్లో మీ సైన్సు టీచర్లు బోలెడు చెప్పివుంటారు. అయినా, చెకుముకి పిలిచింది. కాబట్టి మీకు నా గురించి ఎంతో కొంత చెప్పి వెళ్దామని వచ్చాను వింటారా. నా వ్యాసం 2160 మైళ్లు. భూమి వ్యాసం 7927 మైళ్ళు. అంటే భూమిలో నేనునాల్గోవంతుకన్నా ఎక్కువ. మూడోవంతుకన్నాతక్కువగా ఉన్నానన్నమాట. నా గురుత్వాకర్షణ శక్తి భూమికన్నా ఆరురెట్లు తక్కువ. అంటే భూమి మీద మీ బరువు 30 కేజీలు ఉంటే నా మీద 5 కేజీలు మాత్రమే ఉంటారు. మీ భూమిమాద ఎవరైనా భారీ శరీరాలతో బరువెక్కువై కదల్లేకుండా ఉంటే నాదగ్గరకు పంపించండి వాళ్ళ బరువు 6 రెట్లు తగ్గించేస్తాను.

నేను భూమి చుట్టూ ఒకసారి తిరగడానికి 29 రోజులా 12 గంటలు పడుతుంది. అంటే నా ఒక్కరోజు మీ ఒక్క నెలకు సమానం అన్నమాట. ఇంకోరకంగా చెప్పాలంటే నాచుట్టూ నేను తిరగడానికి, భూమిచుట్టూ తిరగడానికీ పట్టేకాలం 29 రోజులూ 12 గంటలు అన్నమాట. దీనినే మీరు నెల అంటారు. నన్ను తమిళంలో నిలా అంటారు. నేను మీచుట్టూ ఒక్క ప్రదక్షిణం చేసేందుకు పట్టేకాలాన్ని మీరు నెల అని పెట్టుకోవడం కరెక్టే కదా. అందుకే నన్ను తెలుగులో “నెలరాజు” అంటారేమో !

నాకు దాదాపు 15 రోజులు పగలు, 15 రోజులు రాత్రి ఉంటుంది. తెలుసా ఆశ్చర్యపోకండి ఇలా ఎందుకంటే నేను నాచుట్టూ నేను తిరగడానికి అంతకాలం పడుతుంది. అని ముందే చెప్పానుకదా. భూమి 24 గంటలు తనచుట్టూ తానను తిరుగుతుంది. కాబట్టి మాకు 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి ఉంటుంది. కదా. నా పగటి ఉష్ణోగ్రత 243ºF రాత్రికి -261ºF, అంటే పగలు విపరీతమైన వేడి, రాత్రి విపరీతమైన చలి. అంతేకాదు. పగలు సూర్యుడు నిప్పులు కక్కుకుంటూ దర్శనమిస్తాడు. ఆయనతో పాటు నా ఆకాశంలో చ్కుకలు కూడా దర్శనమిస్తాయి. నా మీద నక్షత్రాలు మీ భూమిమీదలాగా మిణుకు మిణుకు అనవు. అవి నిశ్చలంగా వెలుగుతాయి.

పట్టపగలే సూర్యుడితో పాటు నక్షత్రాలు కూడా కనిపించడాన్ని ఒక్కసారి ఊపించుకోండి. ఊహకు అందడం లేదా? అలా ఊహించుకోవాలంటే ముందు మీరు ఆకాశాన్ని నల్లగా ఊహించుకోవాలి. ఆ నల్లటి ఆకాశంలో సూర్యుడిని సూర్యుడితో పాటు నక్షత్రాలు ఊపించుకోండి. అప్పుడు వీలవుతుంది. ఆ దృశ్యం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి !! నిజమే ! నా ఆకాశం మీ ఆకాశంలా నీలంగా ఉండదు. నల్లగా ఉంటుంది. అలా ఎందుకుంటుందంటే మీ భూమిమీదలాగా నా మీద వాతావరణం లేదుకదా అందుకని. వాతావరణం ఉండడంవలన సూర్యుని వెలుతురుని చిందరవందరగా వెదజల్లి అందులోని నీలిరంగు కిరణాలను మాత్రం కనపడేలా చేస్తుంది కాబట్టి మీకు పగటి పూట నక్షత్రాలు కనపడవు. ఇలా వాతావరణం లేని అన్ని గ్రహాలలో పగటిపూట కూడా నక్షత్రాలు కనపడతాయి.


అంతేకాదు వాతావరణం లేని కారణంగా ఇంకొన్ని విచిత్రాలు జరుగుతాయి. అవేంటంటే నా మీద పెద్ద బాంబు పేలినా శబ్దం వినపడదు. పగటిపూట సూర్యకాంతి తీక్షణంగా ఉంటుంది. వేడికూడా వివరీతంగా ఉంటుంది. అదేసమయంలో కొండలు గుట్టల నీడలో చిమ్మచీకటి, విపరీతమైన చలి ఉంటుంది. సూర్యోదయానికి ముందు ఉదయకిరణాలు కనిపించకుండానే ఒక్కసారిగా సూర్యుడు ప్రత్యక్షమవుతాడు. ఒక్కసారిగా స్విచ్ వేస్తే లైట్లు వెలిగినట్లు సూర్యుడు ప్రత్యక్షంకాగానే పగలు వెలుతురుతో నిండుతుంది. అలాగే సూర్యాస్తమయం తరువాత కూడా సంధ్యాకాంతులు మీ భూమి మీద చాలా సేపు ఉంటాయి. దానిని మీరు సాయంత్రం అంటారు. నా మీద సాయంత్రం అన్నమాటే ఉండదు. ఒక్కసారిగా సూర్యుని వెలుతురు మాయం అవుతుంది. అంటే చీకట్లు కమ్ముకొంటాయి. మీకు కరెంటుపోతే ఎలా ఉంటుందో అలా. ఇదందా నాపైన వాతావరణం లేకపోవడం వల్లే జరుగుతుంది.

నేను మీకు పౌర్ణమినాడు చక్కటి వెలుతురు ప్రసారం చేస్తాను కదా. దాన్నే వెన్నెల అంటారుగా మీరు మీకు తెలుసా ? మీ భూమి నాపైన ఎంతటి వెన్నెల కురిపిస్తుందో నా వెన్నెల కన్నా 90 రెట్లు ఎక్కువ అంటే నాపై కురిసే భూమి వెన్నెలలో చిన్న చిన్న అక్షరాలు ఉండే పుస్తకాన్ని కూడా సులభంగా చదవగలరు.

భూమిమీద నేను తూర్పున ఉదయించి పడమర అస్తమిస్తాను. కాని నా ఆకాశంలో భూమి ఉదయించడంగాని, అస్తమించడం గాని, జరగదు. ఎప్పుడూ భూమి నా ఆకాశంలో ఒకేచోట ఉంటుంది. ఎందుకంటే నేను నా చుట్టూ తిరిగేకాలం భూమి చుట్టూ తిరిగే కాలం ఒకటే కాబట్టి అలా జరుగుతుంది. కానీ, భూమికి నా ఆకాశంలో కళలు ఉన్నాయి. అంటే భూమికి పౌర్ణమి అమావాస్య ఉంటాయి. భూమిమీద చంద్ర అమావాస్య రోజు నామీద భూమి పౌర్ణమి, అలాగే భూమిమీద చంద్ర పౌర్ణమి రోజు నామీద భూమి అమావాస్య ఉంటుంది.

నేను భూమిచుట్టూ తిరిగేప్పుడు దీర్ఘవృత్తాకారంలో తిరుగును. అంటే ఒక్కొసారి భూమికి దగ్గరగా, ఒక్కోసారి దూరంగా వెళుతుంటాను. నేను మీకు దగ్గరగా వచ్చినప్పుడు మీకు నా సైజు పెద్దదిగా, దూరంగా వెళ్ళినపుడు చిన్నదిగా కనిపిస్తాను. మీరు ఈ విషయాన్ని ఇప్పుటిదాకా గమనించలేదుకదా ? నా సైజులో నేను 10% మారుతుంటాను. అలాగే నా మీద ఆకాశంలో భూమి సైజు కూడా 10% మారుతుంటుంది.

మీకు ఒక విషయం తెలుసా మీ భూమిమీద మీరు ఎప్పుడైనా ఒక ఉల్కపడడం చూసే ఉంటారు. ఉల్కను చూసినవారు. ఆ సమయంలో ఏం కోరుకుంటారో అది జరుగుతుంది. అనే మూఢ నమ్మకం కూదా ఉంది కాదా. భూమిమీద సగటున రోజుకి 10 కోట్ల ఉల్కలు పడతాయి. అనే విషయం మీకు తెలుసా అయితే ఈ ఉల్కలు భూమికి చేరేలోపే గాలి రాపిడికి భస్మం అయిపోతాయి. చాలా అరుదుగా ఉల్కలు భూమిని తాకుతాయి. కాని నా మీద వాతావరణం లేని కారణంగా ఉల్కలు నా ఉపరితలాన్ని తాకి గుంటలు ఏర్పరుస్తుంటారు. నా మీద రోజుకి సగటున 10 లక్షల ఉల్కలు పడుతుంటాయి. ఇవి ఇసుక రేణువంత సైజునుండి చాలా పెద్దపెద్దవిగా ఉంటాయి.


ఇక గ్రహణాల విషయానికి వస్తే మీ భూమి నాకు సూర్యుని కి మధ్యలో ఒకే లైనులో వచ్చిందంటే మీకు నా గ్రహణం (చంద్రగ్రహణం) వస్తుంది కదా అప్పుడు నాకు సూర్యగ్రహణం కనబడుతుంది. అంటే సూర్యుడికి నాకు మధ్యలో భూమి అడ్డంగా వస్తుంది. అలాగే మీ భూమికి, సూర్యునికి మధ్యలో నేను గనుక ఒకే లైనులో వస్తే మీకు సూర్యగ్రహణం వస్తుంది. నాకు అప్పుడు భూమి గ్రహణం వస్తుంది. అంటే సూర్యుని వెలుతురు భూమిమీద పడకుండా నేను అడ్డం వస్తాను.

మీ భారతీయులు త్వరలో నా మీదకి రాకెట్ పంపిస్తారటగా ? మీ శ్రీహరికోటలో ఇందుకు సంబంధించిన పరిశోధనలు జరుగుతున్నాయటగా ? మీ భారతీయులు కూడా నా మీదకు వస్తారంటే నేను కాదంటానా ? రండి మీకు స్వాగతం పలుకుతాను. అంతేకాదు మీరంతా బాగా చదువుకొని శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకొని మంచి పౌరులుగా మానవాళికి ఉపయోగపడేలా మారాలని నేను కోరుకొంటాను. నా కోరికను తీరుస్తారుగా ? చెకుముకి నాకిచ్చిన సమయం అయిపోయింది. ఇంకోసారి ఎప్పుడైనా అప్పుడు మళ్ళీ అదేదో మన అమ్మకు తమ్ముడైనట్టు చంద్రుడిని మనం చందమామ అని పిలుచుకుంటుంటాం కదా.! అసలు చంద్రుడిని చందమామ అని ఎందుకు పిలుస్తారు. మామ అనే బంధుత్వాన్ని చంద్రుడికి ఎందుకు కలుపుతారు అనే డౌట్స్ ఎప్పుడైనా వచ్చాయా..? నాకు సడెన్ గా ఆ డౌట్ వచ్చి మా సార్ ను అడిగా ఏంటి సార్.? చంద్రుడిని మామ అని పిలిచే బంధుత్వం మనకెక్కడదీ అని…దానికి ఆయన నాకు చెప్పిన సమాధానం ఇక్కడ మీకోసం రాస్తున్నాను. మీకు ఉపయోగపడుతుందని.

వాస్తవానికి చంద్రుడిని సంస్కృతంలో చంద్రమాస్ అంటారు. కాలక్రమేణ…అదే పదం చంద్రమా…అని ఆ తర్వాత చందమా…అనే వారని అటు తర్వాత మన తెలుగు వాళ్ళకు “మ” అనే అక్షరం మీదున్న అతి ప్రేమ వల్ల చందమా ను కాస్త చందమామ చేశారని చెప్పుకొచ్చారు. సార్…ఇందులో లాజిక్ లేదు కాస్త లాజికల్గా చెప్పండి.అంటే ..దానిదేం భాగ్యం మనవాళ్లే దీనికి గట్టి లాజిక్ ను గతంలోనే చెప్పారు. ఇప్పుడు అది చెప్తా విను…అంటూ మన సాంప్రదాయం ప్రకారం లక్ష్మీ దేవతను జగన్మాతగా పిలుచుకుంటారు, అంటే లోకం మొత్తానికి తల్లి లాంటిదన్న మాట.! లక్ష్మీ దేవల క్షీర సాగరం నుండి పుట్టింది. సేమ్ టు సేమ్ అదే క్షీర సాగరం నుండి లక్ష్మీ దేవత తర్వాత చంద్రుడు పుట్టాడట. సో క్షీర సాగరం తల్లి అయితే మొదట పుట్టిన లక్ష్మీదేవి అక్క అవుతుంది, తర్వాత పుట్టిన చంద్రుడు తమ్ముడవుతాడు…ఇప్పుడు లక్ష్మీ దేవత లోకమాత అయితే…లక్ష్మీదేవత తమ్ముడు మనకు మామ అవుతాడుగా…! ఇది చంద్రుడిని చందమామ అనడం వెనుకున్న అసలు లాజిక్.!

No comments