Header Ads

అనుష్క శర్మ ప్రెగ్నెంట్ ఆ.?

సోషల్ మీడియా లో అనుష్క శర్మ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి, అనుష్క శర్మ విరాట్ కోహ్లీ కి వివాహం జరిగి సుమారు సంవత్సరం కావొస్తుంది, అనుష్క శర్మ ఇటీవల కొత్త సినిమాలకు సైన్ చేయలేదు, బాలీవుడ్ లో ప్రస్తుతం బిజీ యాక్ట్రెస్ ఎవరు అంటే అందరు అనుష్క శర్మ పేరే చెబుతారు, అనుష్క శర్మ నటించిన 'సూయి దాగా' చిత్రం బాక్స్ ఆఫీస్ దెగ్గర పర్వాలేదు అనిపించినా, సోషల్ మీడియా లో మాత్రం ఒక ఊపు ఊపింది, కారణం అనుష్క శర్మ మీద పడిన ట్రోల్స్, దేశ వ్యాప్తంగా 'సూయి దాగా' చిత్రం లోని అనుష్క శర్మ లుక్ మీద విపరీతంగా ట్రోల్స్ వేశారు నెటిజన్స్, అసలు ఎందుకు వేసారో, వేసిన వాళ్ళకి కూడా తెలియదు. ఇప్పుడు వస్తున్న 'జీరో' చిత్రం లో విభిన్నమైన పాత్ర లో కనబడనుంది అనుష్క శర్మ, చేతి నిండా మూవీస్ తో బిజీ బిజీ గా గడిపేస్తున్న అనుష్క శర్మ, గత కొద్దీ నెలలుగా ఏ కొత్త సినిమాకు సైన్ చేయలేదని సమాచారం.



దీంతో అనుష్క శర్మ ప్రెగ్నెంట్ అవ్వడం వలనే కొత్త సినిమాలను ఒప్పుకోవట్లేదు అనే ప్రచారం జోరందుకుంది, సోషల్ మీడియా లో ఈ పుకారు తారా స్థాయి కి చేరింది, ఈ విషయం అయి విరాట్ కోహ్లీ కానీ, అనుష్క శర్మ కానీ ఎటువంటి అధికార ప్రకటన చెయ్యలేదు. కానీ సోషల్ మీడియా లో అనుష్క శర్మ ప్రెగ్నెంట్ అంటూ చేప్పడానికి రుజువులు ఇవే అంటూ కొన్ని పిక్స్ లీక్ చేసారు కొంతమంది, ఆ పిక్ లో అనుష్క శర్మ పొట్ట బయటకు వచ్చి ఉండటం కూడా సోషల్ మీడియా లో వస్తున్న పుకార్లకు మరింత బలం చేకూర్చింది. ఈ విషయం అయి అనుష్క శర్మ లేదా విరాట్ కోహ్లీ లలో, ఎవరో ఒకరు త్వరలోనే స్పందించే అవకాశం ఉంది.

అనుష్క శర్మ హీరోయిన్ గా నటించిన జీరో చిత్రం డిసెంబర్ 21న విడుదల కానుంది, షారుఖ్ ఖాన్ జీరో చిత్రం లో హీరో. అనుష్క శర్మ తో పాటు కత్రినా కైఫ్ కూడా జీరో సినిమాలో నటించింది.

No comments