Header Ads

ఇండియ‌న్స్ సైబ‌ర్ సెక్యూరిటీలో ఎక్స్‌ప‌ర్ట్స్ -న్యూ ఫార్మాట్‌లో మ‌న‌మే టాప్.!!

టెక్నాల‌జీ పుణ్య‌మా అని ప్ర‌పంచం కొత్త పుంత‌లు తొక్కుతోంది. ఐటీ లేకుండా ప్ర‌పంచం మ‌నుగ‌డ సాధించ‌లేని స్థితికి చేరిపోయింది. స‌మాజ‌పు అభివృద్ధిలో ఈ రంగం ప్ర‌ధాన‌మైన భూమిక‌ను పోషిస్తూనే..అత్య‌ధిక ఆదాయాన్ని స‌మ‌కూర్చే రంగమైంది. ప్ర‌భుత్వాలు ప‌రిపాల‌న సాగించాల‌న్నా, పార‌ద‌ర్శ‌కంగా ఉండాల‌న్నా..ఐటీ మీదే ఆధార‌ప‌డాల్సి వ‌స్తోంది. ఐటీ రంగంలోని వేలాది కంపెనీలను సైబ‌ర్ సెక్యూరిటీపైనే ఆధార‌ప‌డి ఉన్నాయి. ఏ టైంలో ఏం జ‌రుగుతుందో విచ్ఛిన్న‌ర శ‌క్తులు, అసాంఘిక శ‌క్తులు దాడి చేసే ప్ర‌మాదం ఉంది.ఈ విష‌యంలో చాలా గోప్యంగా..క‌ఠినంగా ఆయా కంపెనీలు త‌మ‌కు తాము ర‌క్ష‌ణాత్మ‌క ఫ్లాట్ పాంల‌ను త‌యారు చేసుకుంటున్నాయి. ల‌క్ష‌లాది మంది ఇందు కోసం రేయింబ‌వ‌ళ్లు ప‌ని చేస్తున్నారు. సాఫ్ట్ వేర్ , హార్డ్ వేర్‌, సోష‌ల్‌, డిజిట‌ల్, కంపెనీలు, ఇండ‌స్ట్రీలు, అన్నీ క్లౌడ్ , ఆండ్రాయిడ్ ఫ్లాట్ ఫాంల‌ను న‌మ్ముకున్నాయి. అటు అమెరికా నుండి ఇటు ఇండియా దాకా అన్నీ సైబ‌ర్ సెక్యూరిటీ విష‌యంలో తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నాయి. ట్రిలియ‌న్ డాల‌ర్లు, కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్నాయి. స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల నుండి..ఐటీ సేవ‌లకు అంత‌రాయం లేకుండా ఉండేందుకు సైబ‌ర్ సెక్యూరిటీ ఎక్స్‌ప‌ర్ట్స్ అవ‌స‌ర‌మ‌వుతారు.

దీనిలో ఇండియ‌న్స్ టాపర్స్‌గా ఉన్నారు. సైబ‌రాబాద్, బెంగ‌ళూరు, ఢిల్లీ, కోల్‌క‌తా, ముంబ‌యి, ఖ‌ర‌గ్‌పూర్‌, ఆల్ ఐఐటీ, ఎంఐటీ, త్రిబుల్ ఐఐటీలు..యూనివ‌ర్శిటీలు అన్నీ సైబ‌ర్ సెక్యూరిటీ విష‌యంలో ప్ర‌త్యేక‌మైన కోర్సులు నిర్వ‌హిస్తున్నాయి. ఇంజ‌నీరింగ్‌, టెక్నిక‌ల్ నాలెడ్జ్ క‌లిగి ఉండాలి. మ‌న వాళ్ల‌కు ల‌క్ష‌ల్లో, కోట్ల‌ల్లో వేత‌నాలు కంపెనీల రూపేణా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.

సైబ‌ర్ సెక్యూరిటీ విష‌యంలో బెంగ‌ళూరు బేస్డ్‌..సింగ‌పూర్ హెడ్ క్వార్ట‌ర్ క‌లిగిన క్లౌడ్ సెక్ కంపెనీ వ‌ర‌ల్డ్‌లో టాప్ టెన్‌లో ఒక‌టిగా నిలిచింది. ఇది స్టార్ట‌ప్‌గా స్టార్ట‌యింది. వీరు త‌యారు చేసిన టెక్నిక‌ల్ పార్మాట్ వేలాది కంపెనీల‌కు ర‌క్ష‌ణ క‌వ‌చంగా మారింది. 14 కోట్ల రూపాయ‌లు ఫండ్ ద్వారా అందాయి. ఎక్స్‌ఫినిటీ వెంచ‌ర్ పార్ట్‌న‌ర్స్‌, స్టార్ట‌ప్ ఎక్సీడ్ ..ఇందులో భాగ‌స్వామ్యులు. ఇండియాతో పాటు ఆసియా ఖండంలోని దేశాలకు విస్త‌రించాల‌న్న‌ది ఈ కంపెనీ ల‌క్ష్యం.

ఎక్స్‌విజిల్ వీరు త‌యారు చేసిన ప్రొడ‌క్ట్‌. 2015 లో రాహుల్ శ‌శి క్లౌడ్ సెక్ పేరుతో కంపెనీ స్థాపించాడు. మెషీన్ లెర్నింగ్‌, ఫైనాన్సియ‌ల్‌, ఈ కామ‌ర్స్‌, ట్రాన్స్‌పోర్టేష‌న్ సెక్టార్స్‌, ఫార్మాస్యూటిక‌ల్స్‌, పెట్రో కెమిక‌ల్స్‌, రిటైల్ ఇండ‌స్ట్రీ ల‌కు సైబ‌ర్ సెక్యూరిటీ ..విజిల్ టూల్ ర‌క్ష‌ణాత్మ‌కంగా ఉప‌యోగ ప‌డుతోంది. కేర‌ళ‌కు చెందిన మీర‌న్ ఫౌండేష‌న్ పెట్టుబ‌డులు పెట్టింది.

క్లౌడె సెక్ అమెరికా, చైనా, ర‌ష్యా, ఇత‌ర దేశాల‌లో పాపుల‌ర్ అయింది. 2017లో భార‌త దేశ ఇన్మ‌రేష‌న్ అండ్ టెక్నాల‌జీ శాఖ త‌న ఆధీనంలోని అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు వీరి సేవ‌లు అందించాల‌ని కోరింది. దీని బ‌ట్టి చూస్తే క్లౌడ్ సెక్ ఎంత అవ‌స‌ర‌మో. టెక్నాల‌జీ దుర్వినియోగం కాకుండా ఉండేందుకు సైబ‌ర్ సెక్యూరిటీ కావాలి. స‌క‌ల అసాంఘిక శ‌క్తుల నుండి ఇండియాను కాపాడాలి.

No comments