ఆ భార్య భర్తలు సెల్ఫీ దిగి…ఆ ఫోటోను ఏం చేసారో తెలుసా..? తర్వాత ఏమైందో తెలుస్తే షాక్ అవుతారు.?
సెల్ఫీ..ఒకప్పటిలా ఫోటో దిగాలంటే హడావిడి అక్కర్లేదు ,చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు..అందరూ ఫొటో గ్రాఫర్ లే అయిపోతున్నారు..టకటక ఫోటోస్ దిగిపోతున్నారు..అదే సెల్ఫీ.తమ చుట్టు ఉన్న పరిస్థితులను కూడా పట్టించుకోకుండా సెల్ఫీలు దిగుతూ ఇబ్బందులూ పడిన సంధర్బాలను..ప్రాణాలే కోల్పోతున్న ఘటనలు మనం చూసాం..కానీ ఒక్క సెల్ఫీతో ఏకంగా లండన్ ట్రిప్ చెక్కేసే అవకాశం పొందారు..అది ఎలాగో కింద వీడియోలో చూడండి!
ఈ సెల్ఫీల ట్రెండ్‌లో చెన్నైకు చెందిన ఓ యువ జంట దిగిన సెల్ఫీ వారికి జీవితంలో మరచిపోలేని మధుర జ్ఞాపకాలను తెచ్చిపెట్టింది. చెన్నైకి చెందిన పింకా మనోగరన్, హరీశ్ రామన్ల జంట బ్రిటిష్ ఎయిర్వేస్ నిర్వహించిన “టేక్‌మీ టు లండన్” అనే సెల్ఫీ కంటెస్ట్‌లో పాల్గొంది. ఈ యువ జంట ఆ కంటెస్ట్‌లో గెలుపొందడంతో వీరికి చెన్నై నుంచి లండన్‌కు, లండన్ నుంచి చెన్నైకి ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించే గొప్ప అవకాశాన్ని సదరు ఎయిర్వేస్ సంస్థ కల్పించింది.నేను నమ్మలేకపోతున్నా లండన్‌కు వెళ్లాలనే నా కల ఇలా సాకారమవుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. లండన్ గురించి చాలా విన్నా. కానీ ఇప్పుడు ఆ నగరాన్ని చూసి తెలియని ఎన్నో విషయాలు ప్రత్యక్షంగా చూసే అవకాశం దక్కింది. జీవితంలో మరచిపోలేని జ్ఞాపకాలను మిగిల్చేలా ఇంతగొప్ప అవకాశాన్ని ఇచ్చిన బ్రిటిష్ ఎయిర్వేస్కు ధన్యవాదాలు చెప్పారు.
విదేశీ పర్యటనకు వెళ్లాలన్నది ఎంతోమందికి జీవిత కల, ఒక్కసారి అయినా విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటుంటారు. కానీ ఆ కలను నెరవేర్చుకొనే అవకాశం ఎంతమందికి వస్తుంది.నిజంగా వీళ్లు లక్కీ కదా.
Post a Comment