“కాల్ గర్ల్స్” కావాలంటే “ఆధార్” తప్పనిసరి..! రూల్ పెట్టింది ప్రభుత్వం కాదు..మరెవరో తెలుసా?ఎందుకంటే.?
గోవా.. మన దేశంలో మందు బాబులకు, జూదగాళ్లకు భూతల స్వర్గం అది. విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేయలేని వారు గోవాకు వెళ్లి ఆ మజాను అక్కడ ఆస్వాదిస్తారు. ఈ క్రమంలోనే దేశంలో గోవా ముఖ్య పర్యాటక ప్రదేశంగా పేరు గాంచింది. అయితే గోవాలో శృంగారం చేయాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా కావాలట. అవును, మీరు విన్నది నిజమే. ముందు ఆధార్ కార్డు ఇస్తే.. వేశ్యలను సప్లై చేసే వారు వాళ్లకు కావాల్సిన ఎంక్వైరీలన్నీ చేసుకొని ఆ తర్వాత కాల్ గర్ల్స్‌ని పంపిస్తారట. ఏంటీ.. షాకింగ్‌గా ఉందా..! అయినా ఇది నిజమే. ఇటీవలే కొందరు యువకులకు ఈ అనుభవం ఎదురవ్వగా వారు తమ అనుభవాలను అపరిచిత పేర్లతో సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ విషయం ఒక్కసారిగా వైరల్ అయింది.
ఈ మధ్యే ఢిల్లీకి చెందిన ఐదుగురు వ్యక్తులు తమ ఫ్రెండ్ బ్యాచిలర్ పార్టీ కోసం వెళ్తే వాళ్లకు వింత అనుభవం ఎదురైంది. ఎలాగోలా కాల్‌గర్ల్స్‌ను సప్లై చేసే ఓ వ్యక్తి నంబర్ సంపాదించి వాళ్లు గోవా వెళ్లారు. అక్కడకెళ్లిన తర్వాత ఆ వ్యక్తికి ఫోన్ చేస్తే.. వాళ్లు అడిగినట్లే ఐదుగురు యువతులను పంపిస్తానని చెప్పాడట. అయితే తీరా కాల్ గర్ల్స్ దగ్గరికి వెళ్లిన తర్వాత ఆ ఐదుగురు వ్యక్తుల ఆధార్ కార్డులు కావాలని బ్రోకర్లు డిమాండ్ చేశారు. దీంతో ఆ యువకులు ముందు కంగారు పడినా.. వాళ్లు చెప్పినట్లే వాట్సాప్‌లో తమ ఆధార్ కార్డుల వివరాలు పంపించారు. అయితే తర్వాత ఆధార్ కార్డులను బట్టి వాళ్ల బ్యాక్‌గ్రౌండ్‌తోపాటు వాళ్లు ఉన్న హోటల్‌పై కూడా బ్రోకర్లు ఎంక్వైరీ చేశారట. పోలీసుల ఇన్ఫార్మర్లేమో అన్న అనుమానంతో అక్కడ వ్యభిచార గృహాలను నడిపే వ్యక్తులు ఇలా విటుల దగ్గర నుంచి ఆధార్ వివరాలు కూడా రాబడుతున్నారు. అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతే వేశ్యలను పంపిస్తున్నారు. అప్పుడు కూడా వాళ్లు అలా పంపిస్తారన్న గ్యారెంటీ లేదని, చాలా మంది ఆన్లైన్లో ఇలాంటి వాటిని చూసి గోవాకు వచ్చి మోసపోతున్నారని అక్కడి పోలీసులు చెబుతున్నారు.
వెబ్సైట్లలో వివరాలు చూసి వచ్చినవాళ్లలో 90 శాతం మోసపోతూనే ఉన్నారని, ఇలాంటి వాటి బారిన పడొద్దని గోవా పోలీసులు చెబుతున్నారు. కొందరు మధ్యవర్తులు మోసం చేయడంలోనూ కొత్త కొత్త దారులు వెతుకుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇళ్లలో కొందరు యువతులను బాల్కనీల్లో నిలబెడతారని, అనంతరం వారు టూరిస్టుల వైపు చేతులు ఊపుతూ తాము వేశ్యలమని నమ్మేలా చేస్తారని, ఆ తర్వాత మధ్యవర్తి వారి నుంచి డబ్బు వసూలు చేసి ఆ ఇంటికి పంపిస్తారని, అనంతరం ఆ ఇంటికి వెళ్లి తలుపులు ఎంత కొట్టినా ఎవరూ తీయరని పోలీసులు అంటున్నారు. ఈ లోపు పక్కనున్న వాళ్లు వచ్చి గొడవ చేస్తారట. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో టూరిస్టులు అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వస్తుంది అని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో టూరిస్టులు అనవసరంగా డబ్బును నష్టపోవాల్సి వస్తుందని గోవా పోలీసులు అంటున్నారు. కనుక ఎవరైనా గోవాకు వెళ్తుంటే.. ఈ ఆధార్ విషయాన్ని గుర్తుంచుకుంటే బెటర్. లేదంటే డబ్బు నష్టపోవాల్సి వస్తుంది..!
Post a Comment