లవ్ సింబల్ గా "ఈ గుర్తు ( ♥ ) " నే ఎందుకు వాడతారు?
మానవుని గుండెకు, ప్రేమ గుర్తుగా వేసే గుండె ఆకారానికి సంబంధం ఏమిటని ఎప్పుడైనా ఆలోచించారా? ప్రేమ అంటే గుండెకు సంబంధించిన విషయం అయితే దానిని సింబల్ గా తెలిపేటప్పుడు వాస్తవ గుండె ఆకారాన్ని కాకుండా వేరే విధంగా చూపిస్తాం. ఇలా ఎందుకు తెలపాలి అనే డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? చిక్కులు చిక్కులుగా ఉండే మనిషి గుండె ఆకారానికి లవ్ సింబల్ కు లింక్ ఎక్కడ కుదిరిందో తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేద్దాం.
ఐవి ఆకు:
పూర్వకాలంలో గ్రీస్ దేశంలో ఇష్టమైన వారికి ఇప్పుడు గులాబీ పువ్వు ఇచ్చినట్టు, అప్పుడు ఐవి(IVY) అనే చెట్టు ఆకును ప్రేమతో ఇచ్చేవారట . ఆ ఆకు ఇప్పుడు మనం గీసుకుంటున్న లవ్ సింబల్ ఆకారంలో ఉంటుంది. అందుకే తన గుండెలోని ఇన్నర్ ఫీలింగ్ ను ఐవి ఆకుతో తెల్పుతాము కాబట్టి...హృదయం అనగానే ఆ ఆకు ఆకారంలోని బొమ్మను గీసేవారట! కాలక్రమేణా అదే ఆకు సింబల్ లవ్ సింబల్ గా ఫిక్స్ అయిందట!
సిల్ఫియం విత్తనాలపై గుర్తు:
గ్రీకు దేశంలోని సిరిన్ లో పురాతన కాలంలో పండిన విత్తనాలకు ఓ ప్రత్యేక ఆకారం ఉండేదట.ఆ ఆకారాన్ని కొన్ని నాణెలపైనా ముద్రించేవారట. ఈ విత్తనాలపై ఉన్న గుర్తునే మానవ హృదయంగా భావించే వారట.!
స్త్రీ యోని & పిరుదుల ఆకారం:
పూర్వకాలంలో రసికులైన మగవారు, తమ ఇష్ట సఖులకు లవ్ సింబల్ రాసి చూపించే వారట. అంటే తనలోని శృంగార వాంఛను ఈ విధంగా తెలిపేవారట ! పిరుదులు లవ్ ఆకారంలో ఉండడం, యోని కూడా లవ్ ఆకారంలో ఉండడంతో వాటి ద్వారా శృంగారం కావాలని సింపుల్గా లవ్ సింబల్ తో తెలిపేవారట!
రెండు హంసలు ముద్దాడుకుంటున్నపుడు:
కొలనులో రెండు అందమైన హంసలు అందంగా ముద్దాడుకుంటున్నప్పుడు రెండు దగ్గరగా చేరి, తలలను కిందకు వాల్చుతూ సిగ్గుగా ఒకరి కళ్ళలోకి మరొకటి చూసుకుంటూ తన్మయత్వంతో ముద్దుపెట్టుకుంటుండగా, లేడీ హంస సిగ్గుతో తలవాల్చుతుంటే, మగ హంస ముందుకు వచ్చి ముద్దు పెడుతుంది. ఈ రెండు ఇలా ముద్దుపెట్టుకోవడం స్వఛ్చమైన ప్రేమను వ్యక్త పరుస్తున్నాయని తలంచి ఓ చిత్రకారుడు వాటి చుంభన ఆకారాన్నే ప్రేమకు గుర్తుగా ఉంటే బాగుంటుందని లవ్ ఆకారంలో ఓ చిత్రాన్ని గీశాడంట!
Post a Comment