నా కళ్ళముందు జరిగిన రెండు సంఘటనలు….మతాల పట్ల నా దృక్ఫథాన్నే మార్చేశాయ్.!!
మాది రెండతస్థుల బిల్డింగ్..పై పోర్షన్ లో మేముంటాం..కింద పోర్షన్ కిరాయికిచ్చాం.! మూడు రోజుల క్రితం ఓ ముస్లీం కుటుంబం కింద పోర్షన్ లో అద్దెకు దిగింది. ఆఫీస్ చాలా దూరం కావడంతో నేను 7 గంటలకే ఇంటి నుండి బయలు దేరాలి…అదిగో అలా ఇంటి ఇంటి మెట్లు దిగుతున్నాను…కొత్తగా దిగిన ముస్లీం వాళ్ళ ఇంట్లోనుండి మహాభారతం సీరియల్ సాంగ్ వినిపిస్తుంది.!
ఆశ్చర్యపోయాను….. అలాగే నిల్చున్నాను..అంతలో ఆ ఇంటాయన..ఏంటి సార్..ఏమైనా ప్రాబ్లమా..? అని అడిగాడు…లేదు… మీరు ముస్లీంలు కదా…మరి మీ ఇంట్లో ఆ మహాభారత పద్యం ఏంటి? అని అడిగాను.! దానికి ఆయన ఇందులో తప్పేముంది సార్…మా పిల్లలకు మహాభారతం సీరియల్ అంటే ఇష్టం…ప్రతిరోజు…అదిచూసే స్కూల్ కు వెళతారు.! పనికి రాని కార్టూన్స్, WWE అంటూ భయంకర ఫైటింగ్స్ చూస్తే తప్పుకాని… ఎలాంటి జీవన విధానం అవలంభించాలి…అనే జీవితసత్యాన్ని తెలిపే మహాభారతాన్ని చూస్తే తప్పేంటి? అన్నాడు. మంచి ఎక్కడైనా మంచే. ఆ మాటకొస్తే….దేవుడొక్కడే మనం పిలుచుకునే పేర్లే వేరు కదా.! అన్నాడు. చాలా సంతోషంలో ఆఫీస్ కు బయలుదేరాను.
ఆఫీస్ లో లంచ్ టైమ్ లో…..
అందరం లంచ్ చేస్తున్నాం.. డానియల్ మాత్రం ఏదో బుక్ చదువుకుంటూ కనిపించాడు..డానియల్ బాక్స్ తెచ్చుకోలేదా అని అడిగాను నేను .. లేదు రా…ఈ రోజు గురువారం కదా…మా ఆవిడ ఉపవాసం..సో ఆమె తినదు కదా…నేను కూడా గురువారం తిననని ఆమెకు మాటిచ్చాను. మాది లవ్ మ్యారేజ్ ఆమె హిందువు, పైగా సాయిబాబా భక్తురాలు…అందుకే ఆమెకోసం…గురువారం నేను కూడా సాయిబాబా పేరుమీద ఉపవాసం ఉంటున్నాను.!

ఎక్కడో ఓ ముస్లీం ఉగ్రవాదిగా మారాడని…మన పక్కనున్న వారిని కూడా అనుమానంగా చూస్తుంటాం…ఎక్కడో ఓ క్రిస్టియన్ బలవంతంగా మతం మార్పిస్తున్నాడని…పక్కనున్న క్రిస్టియన్ ను శత్రువును చూసినట్టు చూస్తుంటాం…!! కానీ వారిలో ఇలాంటి వారు కూడా ఉంటారు. అంతేకాదు చాలా మంది ఇలానే ఉన్నారు…కానీ మనం నెగెటివ్ షేడ్ నే ఎక్కువగా చూస్తున్నాం.! ఖురాన్ గీత బైబిల్ ఒక్కటని…కులమత బేధం వద్దని చెప్పడానికి…కళ్లముందు జరిగిన ఈ సంఘటనే నిదర్శనం.!!
Post a Comment