Header Ads

అక్కినేని ఫాన్స్ కి కాలర్ ఎగరేసుకొని తిరిగే రోజులు వచ్చాయి...! సవ్యసాచి రివ్యూ రేటింగ్..?

వినాయక చవితి కానుకగా వచ్చిన శైలజ రెడ్డి అల్లుడు చిత్రానికి ఓపెనింగ్స్ భారీ లెవెల్ లో వచ్చాయి, కొన్ని ఏరియాస్ లో మొదటి రోజు,పెద్ద హీరో ల రేంజ్ లో కలెక్షన్స్ ని రాబట్టాడు, కానీ లాంగ్ రన్ లో అనుకున్నంత కలెక్ట్ చేయలేక పోయింది, దానికి కారణం, ఆ చిత్రానికి యావరేజ్ రిపోర్ట్స్ రావడం, కానీ సవ్యసాచి కి ప్రీమియర్స్ నుండే పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి.




అక్కినేని నాగ చైతన్య నటించిన సవ్యసాచి చిత్రం నేడు విడుదల అయ్యింది, చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించారు. సఖీ మూవీ ఫేమ్ మాధవన్ ఈ చిత్రం లో ప్రతి నాయకుడిగా కనిపించాడు.

ఎన్నో ఏళ్లుగా ఒక్క మాస్ హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగ చైతన్య నిరీక్షణ సవ్యసాచి సినిమా తో తీరింది, యుఎస్ ప్రీమియర్స్ లో బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది, కీరవాణి నేపధ్య సంగీతం సినిమాకు ప్రాణం పోసిందని అందరు అంటున్నారు, నాగ చైతన్య కెరీర్ లో ఈ సినిమా ఒక మెయిలు రాయిగా నిలిచి పోతుందని, ఇప్పటి వరకు తను చేసిన సినిమాల్లో సవ్యసాచి ది బెస్ట్ అని, ఈ సినిమాలో తన బెస్ట్ పెరఫార్మసి ఇచ్చాడు అని అక్కినేని అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు


దీపావళి కానుకగా విడుదల అయిన సవ్యసాచి కి, రెండు వారాల ఓపెన్ గ్రౌండ్ దొరికిందని , హిట్ టాక్ రావడం తో కలెక్షన్స్ కుమ్మేస్తాయి అని అక్కినేని ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు, ఫస్టాఫ్ మొత్తం చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉందని సెకండాఫ్ చాలా థ్రిల్లింగ్‌గా ఉందంటున్నారు. అక్కినేని ఫ్యాన్స్ పండగ చేసుకునేలా చైతూ యాక్టింగ్ ఉందని పండక్కి బొమ్మ హిట్టు అంటున్నారు. విలన్‌గా నటించిన మాధవన్ అదరగొట్టేశాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. చైతూ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడని.. వరుస ట్వీట్లు చేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్..మరో రెండు వారాల వరకు చెప్పుకోదగ్గ మారె పెద్ద సినిమాలు తెలుగు లో రిలీజ్ అవ్వట్లేదు, చైతు 50 కోట్ల క్లబ్ లో చేరుతాడో లేదో చూడాలి.

పాసిటివ్స్:

డిఫరెంట్ స్టోరీ
కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
చైతు యాక్టింగ్
మాధవన్ క్యారెక్టర్
డైరెక్షన్

నెగిటివ్స్:

1st హాఫ్ లో కొన్ని సీన్స్

ఫైనల్ వెర్డిక్ట్:

సూపర్ హిట్

రేటింగ్:  (3.25/5)

No comments