Header Ads

రజినీకాంత్ రెండో కుమార్తెకు మళ్ళీ పెళ్లి పీటలు ఎక్కనుందా..?

ఇండియన్ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రెండో కుమార్తె 'సౌందర్య' మళ్లీ పెళ్లి పీటలెక్కనుంది. 2010లో వ్యాపారవేత్త 'అశ్విన్‌' తో సౌందర్యకు వివాహం జరిగింది, అభిప్రాయభేదాల కారణంగా వారిద్దరూ 2017లో విడాకులు తీసుకున్నారు,వీరికి వేద్‌ అనే ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం వేద్‌ తన సౌందర్య దగ్గరే ఉంటున్నాడు. ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు, నటుడు వనంగాముడి విశాకన్‌తో వచ్చే ఏడాది జనవరిలో సౌందర్య వివాహం జరుగబోతుందని సమాచారం. దర్శకదిగ్గజం భారతీరాజా తనయుడు మనోజ్‌ తెరకెక్కిస్తున్న ‘సిగప్పు రోజాక్కళ్‌ 2’లో విశాకన్‌ నటిస్తున్నాడు సౌందర్య, విశాకన్‌లకు ఇటీవలే నిశ్చితార్థం కూడా జరిగినట్లు తెలుస్తోంది. సౌందర్యలాగా విశాకన్‌కి కూడా ఇది రెండో పెళ్లే. సౌందర్య, విశాకన్‌లు ఇద్దరికీ రెండో పెళ్లే కావడంతో నిశ్చితార్థం మీడియాకి దూరంగా జరిపినట్లు సమాచారం.




సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 2.0 చిత్రం నవంబర్ 29 న ప్రపంచ వ్యాప్తంగా విదుదల కానుంది, అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రం లో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తుంది. శంకర్ దర్శకత్వం వహించిన 2.0 చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించాడు. 2.0 చిత్రాన్ని పూర్తిగా 3D లో చిత్రీకరించారు. సుమారు 600 కోట్ల భారీ వ్యయంతో ఈ సినిమా ని నిర్మించారు. రోబో చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న 2.0 చిత్ర టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన వచ్చింది. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం లో రికార్డు స్థాయి లో ఈ సినిమా ని రిలీజ్ చేయనున్నారు, త్వరలోనే చైనా లో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.

No comments