సన్నీ లియోన్ ఏ కావాలని అంటున్న హీరో విశాల్..!
తెలుగు లో సూపర్ హిట్ అయిన టెంపర్ చిత్రాన్ని తమిళ్ లో విశాల్ రీమేక్ చేస్తున్నాడు, తమిళ్ లో విశాల్ మార్కెట్ ఇప్పుడు బాగా పెరిగింది. డిటెక్టివ్, అభిమన్యుడు, పందెం కోడి-2 సినిమాలతో వరుస హిట్స్ అందుకొని జోరు మీద ఉన్నాడు, తెలుగు లో అభిమన్యుడు చాలా బాగా ఆడింది. తెలుగు లో విశాల్ కెరీర్ లో ఎక్కువ కలెక్షన్స్ ని రాబట్టిన చిత్రం గా నిలిచిపోయింది. దసరా కానుకగా వచ్చిన పందెం కోడి-2 చిత్రం తెలుగు లో యావరేజ్ గా నిలిచిపోయింది, కానీ తమిళ్ లో మంచి వసూళ్ళని అందుకుంది.
ఇప్పుడు తమిళ్ లో చేస్తున్న టెంపర్ రీమేక్ చిత్రం లో సన్నీ లియోన్ తో ఐటెం సాంగ్ చేపించాలని అనుకుంటున్నాడట విశాల్, అందుకే ఆమెకు భారీ మొత్తం లో డబ్బులు ఇచ్చాడని సమాచారం. సన్నీలియోన్ కనిపిస్తే మాస్లో టికెట్లు తెగుతాయి. హాట్‌నెస్‌కి మారుపేరు సన్నీ. అందుకే సన్నీలియోన్‌తో ఐటెంసాంగ్‌లు చేయించేందుకు ఫిల్మ్‌మేకర్స్ తెగ ఆసక్తి చూపుతుంటారు. కాకపోతే, ఆమె పారితోషికం చాలా ఎక్కువ. ఆమెకి ఇచ్చే రేట్లో సగానికే మరో తెలుగు హీరోయినో, తమిళ భామనో తీసుకోవచ్చు ఐటెం సాంగ్ లో. అందుకే సన్నీలియోన్‌తో సెలక్టివ్‌గా ఐటెంసాంగ్‌లు చేయిస్తుంటారు. కానీ విశాల్ పట్టుబట్టి మరి సన్నీ లియోన్ ఏ కావాలనుకోవడం లో కేరళ కలెక్షన్స్ ఏ కారణం అని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. టెంపర్ తెలుగు సినిమా ని రీమేక్ చేస్తుండటం తో తెలుగు లో రిలీజ్ కుదరదు, ఇక మిగిలింది మలయాళ మార్కెట్ ఎ. కేరళ లో సన్నీ లియోన్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. కనుక తను ఐటెం సాంగ్ చేస్తే అక్కడ వర్క్ అవుట్ అవుతుందని విశాల్ నమ్మకం.
Post a Comment