వాట్స్ అప్ యాప్ లో కాల్స్ రికార్డు చేయాలంటే ఈ యాప్స్ వాడండి.!
కొన్ని చైనా స్మార్ట్ ఫోన్ లలో కాల్ రికార్డింగ్ మరియు స్క్రీన్ రికార్డింగ్ ఆప్షన్స్ ఉంటాయి. ఉదాహరణ కి రెడ్మ్ మీ, ఒప్పో మొబైల్స్. ఒక వేళా మీరు వాడే ఫోన్ స్టాక్ ఆండ్రాయిడ్, అనగా ఆండ్రాయిడ్ సిస్టం లో ఎటువంటి ఫీచర్స్ యాడ్ చేయకుండా సింపుల్ గా ఉంటుంది, అలాంటప్పుడు మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి మీకు కావాల్సిన ఫీచర్ కలిగిన యాప్స్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాల్ రికార్డర్ యాప్స్ ది బెస్ట్ యాప్స్ మీకోసం .
గూగుల్ ప్లే స్టోర్‌లో లభించే క్యూబ్ కాల్ రికార్డర్ అనే యాప్ ద్వారా వాట్సప్ ఆడియో కాల్స్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇది మామూలు ఫోన్ కాల్స్ రికార్డ్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తుంది. ఒకవేళ ఇది మీకు పని చేయకపోతే మెసెంజర్ కాల్ రికార్డర్ అనే యాప్ గూగుల్‌లో వెదికి థర్డ్ పార్టీ సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కొన్ని కారణాల వల్ల ఈ యాప్‌ని గూగుల్ ప్లే స్టోర్ నుండి తొలగించటం జరిగింది. కొన్ని ఫోన్లలో ఆడియో సోర్స్ విషయంలో ఉన్న పరిమితుల వల్ల ఈ రెండు యాప్స్ వాట్సప్ ఆడియో కాల్ రికార్డ్ చేయకపోవచ్చు. మీ ఫోన్ లో ఉన్న హార్డ్‌వేర్ పరిమితి తప్పించి, దానికి పరిష్కారం ఏమీ లేదు. సెట్టింగ్స్‌లోకి వెళ్లి వేర్వేరు ఆడియో సోర్స్‌లను ఎంపిక చేసుకుని ప్రయత్నించి చూడండి. అప్పటికీ ఫలితం లేకపోతే వేరే ఫోన్లో ప్రయత్నించాల్సిందే. ఇక వీడియో కాల్స్ రికార్డ్ చేసుకోవాలంటే ఎజెడ్ స్ర్కీన్ రికార్డర్ వంటి యాప్స్ వాడి ఫోన్ స్ర్కీన్‌ని ఉన్నది ఉన్నట్లు రికార్డు చేసుకుంటే సరిపోతుంది.
మీరు రెడ్ మీ ఫోన్స్ వాడుతున్నట్టు అయితే మీకు స్క్రీన్ రికార్డర్ ఆప్షన్ ఫోన్ లోనే ఉంటాది, ఈ స్క్రీన్ రికార్డు ల సాయం తో స్క్రీన్ మీద వస్తున్న దేనినైనా రికార్డు చేయవచ్చు. కాల్స్ మాత్రమే రికార్డు చేయాలంటే పైన తెలుప బడిన కాల్ రికార్డింగ్ యాప్స్ వాడితే చాలు, గూగుల్ ప్లే స్టోర్ లో కాల్ రికార్డింగ్ యాప్స్ చాలానే ఉన్నాయ్, కానీ ఎక్కువ రేటింగ్ ఉన్న యాప్స్ ని ప్రిఫర్ చేయండి. రెడీ మీ మొబైల్స్ లో కాల్ రికార్డింగ్ కూడా ఇన్ బిల్ట్ ఏ. కనుక, మీరు రెడ్ మీ ఫోన్స్ వాడుతుంటే, కాల్ రికార్డింగ్, వీడియో రికార్డింగ్ యాప్స్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు.
Post a Comment